వాహనంపై ఎంత వేగంతో వెళ్తున్నారో ఇట్టే తెలిసిపోతుంది.. ఎలా అనుకుంటున్నారా?

భారతదేశంలో రోజురోజుకి రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతున్న సమయంలో ప్రభుత్వం చాలా కఠినమైన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఇటీవల కోల్‌కతా ట్రాఫిక్ పోలీసులు డిస్ప్లే బోర్డుతో 11 స్పీడ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ స్పీడ్ కెమెరాలను కోల్‌కతా మెయిన్ రోడ్డులో ఏర్పాటు చేయడం జరిగింది.

ఇక వాహనంపై ఎంత వేగంతో వెళ్తున్నారో ఇట్టే తెలిసిపోతుంది.. ఎలా అనుకుంటున్నారా?

వాహనదారులు ట్రాఫిక్ నియమాలను తప్పకుండా పాటిస్తే ఎటువంటి చర్యలకు లోను కాకుండా ఉండవచ్చు. అలా కాకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా పోతే వారికి తప్పకుండా జరిమానా మరియు ఇతర శిక్షలు కూడా విధించే అవకాశం ఉంటుంది.

ఇక వాహనంపై ఎంత వేగంతో వెళ్తున్నారో ఇట్టే తెలిసిపోతుంది.. ఎలా అనుకుంటున్నారా?

వాహనదారులు మితిమీరిన వేగంతో ప్రయాణిస్తే, వారి వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా వారి మొబైల్‌కు ఎస్ఎమ్ఎస్ పంపబడుతుంది. ఇందులో వాహనదారుడు ఎంత వేగంతో వెళ్తున్నాడు అని వేగం యొక్క వివరాలు కూడా నివేదించబడుతుంది. ఈ కొత్త పద్ధతి రోడ్డుపై వేగ పరిమితిని తగ్గిస్తుంది. దీని ద్వారా ప్రమాదాల సంఖ్య కూడా తగ్గిపోతుంది.

ఇక వాహనంపై ఎంత వేగంతో వెళ్తున్నారో ఇట్టే తెలిసిపోతుంది.. ఎలా అనుకుంటున్నారా?

గతంలో కూడా వేగాన్ని గుర్తించడానికి బోర్డులపై, వాహనదారులు వేగంగా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వైట్ బోర్డింగ్ లైట్లు వెలిగేవి. కానీ ఇప్పుడు ఏర్పాటు చేసిన ఈ కొత్త బోర్డులు పరిమిత వేగం కంటే ఎక్కువ వేగంతో వెళ్ళినట్లైతే 'రిస్క్' మరియు 'స్లో డౌన్' వంటి సిగ్నెల్స్ చూపిస్తాయి.

ఇక వాహనంపై ఎంత వేగంతో వెళ్తున్నారో ఇట్టే తెలిసిపోతుంది.. ఎలా అనుకుంటున్నారా?

40 కిలోమీటర్ల వేగ పరిమితి ఉన్న ప్రాంతంలో ఒక వాహనదారుడు గంటకు 40 కి.మీ ప్రయాణించవచ్చని డిస్ప్లే బోర్డు చూపిస్తుంది. గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ప్రయాణిస్తే ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉంటుంది. ఒక వేళా ప్రమాదం జరిగినప్పటికీ ప్రాణాపాయ స్థితినుంచి తప్పించుకోవచ్చు.

ఇక వాహనంపై ఎంత వేగంతో వెళ్తున్నారో ఇట్టే తెలిసిపోతుంది.. ఎలా అనుకుంటున్నారా?

వాహనం యొక్క వేగ పరిమితి గంటకు 50 కిమీ దాటితే, 'డేంజర్' అని చూపుతుంది. సాధారణంగా వాహనదారుడు ప్రయాణించే రహదారిపై వేగ పరిమితి తమకు తెలియదని చాలా మంది వాహనదారులు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఈ కొత్త విధానంలో ఏర్పాటు చేసిన డిస్ప్లే బోర్డు ఉన్న ఈ కెమెరాలు వాహనదారులకు సహాయపడతాయి.

ఇక వాహనంపై ఎంత వేగంతో వెళ్తున్నారో ఇట్టే తెలిసిపోతుంది.. ఎలా అనుకుంటున్నారా?

ఈ బోర్డులు వాహనం యొక్క వేగాన్ని తెలుపుతుంది. కావున ఈ సమయంలో వాహనదారుడు తన వేగాన్ని తగ్గించుకోవచ్చు. ఈ కెమెరాలు వేర్వేరు సందులలో ప్రయాణించే వేర్వేరు వాహనాల వేగాన్ని గుర్తించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అంతే కాకుండా ఈ కెమెరాలు రాత్రి సమయంతో సహా అన్ని వాతావరణ పరిస్థితులలో సమర్థవంతంగా పనిచేస్తాయి.

ఇక వాహనంపై ఎంత వేగంతో వెళ్తున్నారో ఇట్టే తెలిసిపోతుంది.. ఎలా అనుకుంటున్నారా?

భారతదేశం అంతటా ట్రాఫిక్ నేరాలను తగ్గించడానికి పోలీసులు ఇప్పుడు వివిధ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఇది పోలీసు అధికారులు మరియు వాహనదారుల మధ్య జరిగే వివాదాలను నివారిస్తుంది. భారతదేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి ప్రభుత్వం వివిధ చర్యలు తీసుకుంటోంది.

ఇక వాహనంపై ఎంత వేగంతో వెళ్తున్నారో ఇట్టే తెలిసిపోతుంది.. ఎలా అనుకుంటున్నారా?

ప్రభుత్వాలు ఎన్ని కట్టుదిద్దటమైన చర్యలు అమలుచేసినప్పటికీ అది కేవలం వాహనదారుల సహకారంతోనే జరుగుతాయి. ప్రభుత్వం ఏది చేసిన ప్రజల మంచి కోసమే కావున, వాహనదారులు తప్పకుండా ఈ నియమాలను తప్పకుండా పాటించాలి. అప్పుడే పూర్తిగా ప్రమాదాలను ఆరికట్టవచ్చు.

Note: Images used are for representational purpose only.

Most Read Articles

English summary
Hi Tech Speed Cameras In Kolkata. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X