బ్రేకింగ్.. తెలంగాణలో ఒక్కసారిగా అనేక లగ్జరీ కార్లు సీజ్.. కారణం ఇదే

యావత్ భారతదేశం మొత్తం 75 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఉవ్వెత్తున ఎగిసి పడ్డాయి. దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని ఎర్రకోటపై భారత ప్రధాని నరేంద్ర మోడీ త్రివర్ణ పథకం ఎగురవేశారు. ఇందులో ఎంతోమంది కేంద్రమంత్రులు కూడా పాల్గొన్నారు. ఆ సమయంలో ప్రధాని మోడీ జాతినుద్దేశించి సుదీర్ఘ ప్రసంగం కూడా చేసారు.

బ్రేకింగ్.. తెలంగాణలో ఒక్కసారిగా అనేక లగ్జరీ కార్లు సీజ్.. కారణం ఇదే

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా అట్టహాసంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విజయవాడలో జాతీయజెండా ఎగురవేయగా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గోల్కొండ కోటలో జండా ఎగురవేశారు.

బ్రేకింగ్.. తెలంగాణలో ఒక్కసారిగా అనేక లగ్జరీ కార్లు సీజ్.. కారణం ఇదే

తెలంగాణాలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15 ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సాధారణ వాహనాల రాకపోకలను నిషేధిస్తూ రామ్‌దేవ్ గూడ నుండి గోల్కొండ కోట వరకు రహదారి మూసివేయబడింది. అంతే కాకుండా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కొరకు A, B మరియు C కేటగిరీల్లోని కార్ పాస్ హోల్డర్లు రామ్‌దేవ్ గూడ నుండి గోల్కొండ కోటకు ప్రవేశించడానికి అనుమతించబడ్డారు.

"D" కార్ పాస్‌లతో వాహనాలలో వచ్చే ఆహ్వానితులందరూ షేక్‌పేట్ నాలా మరియు టోలిచౌకి మీదుగా గోల్కొండ కోటకు రావాలని సూచించారు. ఈ సమయంలో వాహనదారులందరూ కూడా ప్రియదర్శిని స్కూల్ లోపల తమ వాహనాలను పార్క్ చేయాలని పోలీసులు అభ్యర్థించారు.

బ్రేకింగ్.. తెలంగాణలో ఒక్కసారిగా అనేక లగ్జరీ కార్లు సీజ్.. కారణం ఇదే

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఎలాంటి నిరాఘాటంగా జరుగుతున్న సమయంలో 75 వ స్వాతం దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్ ర్యాలీని నిర్వహించడం ద్వారా ట్రాఫిక్ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు తెలంగాణ ఆర్టీఏ అధికారులు అనేక హై-ఎండ్ కార్ల యజమానులపై చర్యలు తీసుకోవాల్సి వచ్చింది.

బ్రేకింగ్.. తెలంగాణలో ఒక్కసారిగా అనేక లగ్జరీ కార్లు సీజ్.. కారణం ఇదే

తెలంగాణ రాష్ట్రంలో ట్రాఫిక్ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు ఒక్క సారిగా ఎక్కువ సంఖ్యలో లగ్జరీ మరియు సూపర్ కార్లను సీజ్ చేయాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో కూడా మీరు ఈ ఆర్టికల్ లో గమనించవచ్చు.

బ్రేకింగ్.. తెలంగాణలో ఒక్కసారిగా అనేక లగ్జరీ కార్లు సీజ్.. కారణం ఇదే

మీరు ఈ వీడియోలో గమనించినట్లయితే ఇందులో మెర్సెడెస్ బెంజ్, రోల్స్ రాయిస్, లంబోర్ఘిని, ఫెరారీ మరియు మసెరాటి వంటి కార్లు హై ఎండ్ కార్లు ఉన్నాయి. ట్రాఫిక్ అధికారులు కార్ల యజమానులకు జరిమానా విధించే ముందు కార్లను అన్నింటికి హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో నిలిపివేశారు.

బ్రేకింగ్.. తెలంగాణలో ఒక్కసారిగా అనేక లగ్జరీ కార్లు సీజ్.. కారణం ఇదే

కేవలం ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన నేపథ్యంలో మాత్రమే కాకుండా ఈ హై ఎండ్ కార్లన్నీ కూడా రాష్ట్ర రోడ్ టాక్స్ చెల్లించలేదని ఆరోపణ కూడా వుంది. టాక్స్ చెల్లించకుండా విదేశీ కార్లు మనదేశంలో తిరగడం చట్టరీత్యా నేరం. ఈ విదేశీ వాహనాలు సుమారు 5 కోట్ల రూపాయల నుంచి 8 కోట్ల రూపాయల మేరకు వసూలు టాక్స్ చెల్లించాల్సి ఉందని అధికారులు తెలిపారు.

బ్రేకింగ్.. తెలంగాణలో ఒక్కసారిగా అనేక లగ్జరీ కార్లు సీజ్.. కారణం ఇదే

ఏళ్లతరబడి రవాణా శాఖకు పన్నులు ఎగవేస్తూ తిరుగుతున్న ఖరీదైన కార్లపై దాడులు నిర్వహించడం రవాణశాఖ చరిత్రలో ఇదే మొదటి సారి అని ఆ శాఖ అధికారులు తెలిపారు. మొత్తానికి సంబంధిత అధికారులు బరిలోకి దిగి చట్టానికి వ్యతిరేఖంగా ఉన్న అన్ని కార్లపైనా చర్యలు తీసుకున్నారు.

బాగా డబ్బున్న సంపన్నుల వాహనాలపై దాడులు నిర్వహించి సీజ్ చేయడంపై పలువురు రవాణాశాఖ అధికారులను ప్రశంసిస్తున్నారు. ఇంతకాలం సామాన్యులపైనే ప్రతాపం చూపిస్తారన్న ఆరోపణలకు చమరగీతం పాడుతూ ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా ఎలాంటి వాహనాలనైనా సీజ్ చేయడం జరుగుతుందని రవాణా శాఖ అధికారులు నిరూపించారు.

ఇటీవల తమిళనాడులో హీరో విజయ్ కి కూడా తన ఖరీదైన రోల్స్ రాయ్‌ కారుకి ట్యాక్స్ చెల్లించక పోవడం వల్ల మద్రాస్ హైకోర్టు ఏకంగా ఒక లక్ష రూపాయలు జరిమానా విధించిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఇలాంటి న్యూస్ హీరో ధనుష్ పై కూడా వచ్చింది.

బ్రేకింగ్.. తెలంగాణలో ఒక్కసారిగా అనేక లగ్జరీ కార్లు సీజ్.. కారణం ఇదే

భారతదేశంలో మోటార్ వాహన చట్టానికి సంబంధించి నియమనిబంధనలు చాలా కఠినంగా మారుతున్నాయి. ఇందులో భాగంగానే ట్రాఫిక్ రూల్స్ కూడా కట్టుదిట్టం చేయబడ్డాయి. వాహనదారులు ఈ నియమాలను ఉల్లంఘించినట్లతే తప్పకుండా శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. వాహనదారులు వీటిని తప్పకుండా గుర్తుంచుకోవాలి.ట్రాఫిక్ ఉల్లంఘనల వల్ల ఊహకందని ప్రమాదాలు జరుగుతున్నాయి. కావున వాహనదారులు తప్పనిసరిగా ఈ నియమాలను పాటించాలి, అప్పుడే వాహనదారులకు మరియు రోడ్డుపై ఇతర వ్యక్తులకు కూడా ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉంటుంది.

Most Read Articles

English summary
High end car rally in hyderabad fined for violating guidelines details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X