దారుణం.. డ్రగ్స్ మత్తులో కారు బానెట్ పై పోలీసును 10 కి.మీ లాక్కెళ్లిన వ్యక్తి
మద్యం మత్తులో లేదా ఇతర సందర్భాల్లో పోలీసులు కారు లేదా బైక్ లను ఆపినప్పుడు వారికి చిక్కకుండా ప్రయత్నించే సంఘనలు రోజుకు ఎన్నో చూస్తూ ఉంటాం. ముఖ్యంగా కారు బానెట్‌పై పోలీసులను లాకెళ్లని ఘటనలు చాలా సార్లు వార్తలో చూశాము. దేశంలో ఇలాంటి సంఘటనలు సర్వసాధారణంగా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా జరిగిన ఓ సంఘటన ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.
ఇలా హల్ చల్ సృష్టించిన సంఘటనలన్నీ సదరు వ్యక్తి అరెస్టు అనంతరం ముగిసిపోతుంది. డ్రగ్స్ మత్తులో ముంబైలో ఓ వ్యక్తి చేసిన హంగామాపై నెటిజన్లు మండిపడుతున్నారు. పోలీసు కానిస్టేబుల్ కారు బానెట్ పై ఉండగా మత్తులో కారును అలానే తీసుకెళ్తున్న విజువల్స్ హైవేపై అమర్చిన కెమెరాలో చిక్కాయి. ట్రాఫిక్ పోలీసులు ఆ వ్యక్తి కారుని ఆపేందుకు ప్రయత్నించగా కారు డ్రైవర్ ఆపకుండా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుండగా కానిస్టేబుల్ అడ్డుపడినట్లు తెలుస్తోంది.

కారుని నిలువరించేందుకు ట్రాఫిక్ పోలీసులు మోటార్‌సైకిల్‌పై వాహనాన్ని వెంబడించగా దానిని కూడా అతను ఢీకొడతాడు. వాషి సిటీ క్రాసింగ్ వద్ద కారును మరోసారి ఆపేందుకు ప్రయత్నించగా కానిస్టేబుల్ సిద్దేశ్వర్ మాలి అతనిని స్లో చేయడానికి కారు ముందు నిలబడగా అతని మీద నుంచి కారును తీసుకెళ్లేందుకు ఆ వ్యక్తి ప్రయత్నించాడు. ఈ క్రమంలో కారు బానెట్ పై సిద్ధేశ్వర్ మాలి ఉండిపోతాడు.
దీంతో డ్రగ్స్ మత్తులో ఉన్న వ్యక్తి కానిస్టేబుల్ ని దాదాపు 10 కి.మీ వరకు పోలీసులను ఈడ్చుకెళ్లాడు. కారుని వేగంగా డ్రైవ్ చేస్తూ సిద్ధేస్వర్ ని భయభ్రాంతులకు గురిచేస్తాడు. ఏమాత్రం అధైర్య పడని కానిస్టేబుల్ సిద్ధేశ్వర్ కారుపై అలానే ఉంటాడు. సిద్ధేశ్వర్ ను ఈడ్చుకెళ్తున్న సంఘటనలు ఆ రోడ్డు మార్గంలోని వివిధ CCTVల్లో రికార్డు అయ్యాయి.
వాహనం విండ్‌షీల్డ్‌పై పోలీసు వేలాడుతున్నట్లు అన్నీ కెమారాల్లో గమనించవచ్చు. నిందితుడు ఆదిత్య బెంబాడేగా పోలీసులు గుర్తించారు. అతను సుమారు 10 కిలోమీటర్ల మేర బానెట్ పై ఈడ్చుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. కొంతదూరం వెంబడించిన అనంతరం అతన్ని పట్టుకున్నట్లు తెలిపారు. నగరంలోని ఉరాన్ నాకా వద్ద ఉన్న గవాన్ ఫాటా వద్ద కారును పోలీసులు నిలిపివేశారు.
ఆ వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు డ్రగ్స్ మత్తులో మాలిని హత్య చేయడానికి ప్రయత్నించినందుకు అతనిపై కేసు కూడా నమోదు చేశారు. ప్రస్తుతం దేశంలోని పోలీసు వ్యవస్థలో అధునాతన వైర్‌లెస్ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. పారిపోతున్న వాహనాలను సులభంగా పట్టుకునేలా వ్యవస్థను రూపొందించారు. పోలీసుల నుంచి తప్పించుకోవడం చేస్తున్నారంటే వారు ఏదైనా అక్రమాలకు పాల్పడిన,జరిమానా, చలాన్లను తప్పించుకునేందుకు ఇలాంటి చర్యలకు ఉపక్రమించనున్నాయి.
ఇక కారు డ్రైవర్లు పోలీసులను ఈడ్చుకెళ్లిన సంఘటనలు చాలా ఉన్నాయి. అనేక కిలోమీటర్లు ఈడ్చుకెళ్లి, కొన్ని సందర్భాల్లో గాయపరిచే ఇలాంటి ఎపిసోడ్‌లను మనం చాలాసార్లు చూశాం. కొన్ని రోడ్ రేజ్ కేసులలో, వాహనాలు చిన్న వాహనాలను కూడా ఢీకొట్టి కొన్ని కిలోమీటర్ల వరకు ఈడ్చుకెళ్లాయి. హైవేలపై ట్రక్కులు లేదా లారీలు భారీ వాహనాలు చిన్న చిన్న వాహనాలను, బైక్ రైడర్లను ఢీకొట్టి కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లిన సందర్భాన్ని మనం చాలా చూశాం.
సాధారణంగా, పోలీసు అధికారులు ఉల్లంఘనను ఫోటో తీసి ఆన్‌లైన్‌లో చలాన్ జారీ చేస్తారు. పోలీసులు ఆదేశించినప్పుడు ఆపడానికి నిరాకరించడం చాలా తీవ్రమైన నేరమని ఇప్పటికే చట్టం చెబుతోంది. జరిమానాను తిరిగి చెల్లించడం తప్పనిసరి దీని నుంచి తప్పించుకోవడం కష్టం. అంతేకానీ సొమ్ము చెల్లించకుండా తప్పించుకుంటే తీవ్రమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలానే మద్యం మత్తులో సృష్టించే హంగామాకు భారీ నుంచి అతిభారీ జరిమానాను చెల్లించాల్సి ఉంటుంది.
మీరు ఎలాంటి తప్పు చేయనప్పుడు జరిమానా లేదా అనవసరపు చర్యలకు పోలీసులు పాల్పడితే సీనియర్ పోలీసు అధికారులకు వెంటనే ఫిర్యాదు చేయవచ్చు. అక్కడ కూడా న్యాయం జరగకపోతే కోర్టులో సవాలు చేయవచ్చు. ఇది సుదీర్ఘమైన ప్రక్రియ అయినప్పటికీ, భారతదేశంలో ఫిర్యాదులను పరిష్కరించడానికి ఇది చట్టబద్ధమైన మార్గమని పౌరులు తెలుసుకోవడం ఉత్తమం. ఎలాంటి తప్పు చేయని వారు న్యాయంగా పోరాడి కేసు గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి.


Click it and Unblock the Notifications








