Live Video 120 కి.మీ వేగంతో ప్రయాణిస్తున్న Tata Altrozను ఢీకొట్టిన అడవి జంతువు!

భారత్‌లో గతంలో పోలిస్తే రాష్ట్ర, జాతీయ రహదారుల విస్తరణ శరవేగంగా సాగుతోంది. అవసరమైన ప్రాంతాల్లో హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వే ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. అయితే రోడ్డు ప్రమాదాలు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి.

అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ సహా అకస్మాత్తుగా రోడ్లపైకి వస్తున్న జంతువుల కారణంగాను ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా ఇటువంటి ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. ఈ ఘటన ఢిల్లీ- ముంబై ఎక్స్‌ప్రెస్‌వే పైన (Tata Altroz car accident) జరిగింది. వేగంగా ప్రయాణిస్తున్న టాటా ఆల్ట్రోజ్‌ కారును అడవి జంతువు ఢీకొట్టింది.

tata altroz latest news

120 కి.మీ వేగం : ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో టాటా ఆల్ట్రోజ్‌ డ్యాష్‌బోర్డు కెమెరాలో రికార్డు అయింది. ఈ వీడియో ఆధారంగా ఢిల్లీ- ముంబై ఎక్స్‌ప్రెస్‌వే పైన టాటా ఆల్ట్రోజ్‌ కారు 120 కి.మీ వేగంతో ప్రయాణం చేస్తోంది. అకస్మాత్తుగా రోడ్డుపైకి ఓ అడవి జంతువు (Nilgai) కారును ఢీకొట్టింది. దీంతో టాటా ఆల్ట్రోజ్‌ కారు అదుపు తప్పింది.

అంతవేగంలోనూ కారు బోల్తా పడకుండా డ్రైవర్ నియంత్రించాడు. ప్రమాదం తర్వాత ఘటన ప్రాంతం నుంచి కొంచెం దూరం వెళ్లిన డ్రైవర్ హైవే పెట్రోలింగ్ బృందానికి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అనంతరం వాహనాన్ని సర్వీస్‌ సెంటర్‌కు తరలించారు. స్థానికుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయనే ఆలోచనతో ముందుకు వెళ్లినట్లు తెలుస్తోంది.

tata altroz accident on delhi mumbai expressway

ప్రమాద తీవ్రత కారణంగా టాటా ఆల్ట్రోజ్‌ కారు భారీగా డ్యామేజీ అయింది. కుడివైపు ఉన్న రెండు డోర్లు సహా ఇతర భాగాలు దెబ్బతిన్నాయి. ప్రమాద సమయంలో కారులో డ్రైవర్‌ ఒక్కరే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే డ్రైవర్‌కు ఎటువంటి గాయాలు కాలేదని సమాచారం.

టాటా ఆల్ట్రోజ్ కారు గ్లోబల్‌ NCAP రేటింగ్‌లో 5 స్టార్‌ రేటింగ్‌ను పొందింది. ప్రయాణికులకు మెరుగైన భద్రత అందిస్తుంది. అయితే టాటా ఆల్ట్రోజ్‌ కారు గ్లోబల్‌ NCAP పాత ప్రోటోకాల్ ప్రకారం పరీక్ష చేసినట్లు తెలుస్తోంది. అయితే అనంతరం నూతన నిబంధనల ప్రకారం అప్‌గ్రేట్‌ చేసినట్లు సమాచారం.

nilgai hits tata altroz car

భారత్‌లో రోడ్డు ప్రమాదాలకు అనేక కారణాలు ఉంటున్నాయి. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కొన్ని కారణాలు అయితే.. అడవి జంతువులు, వీధి కుక్కలు సహా ఇతర జంతువులు అకస్మాత్తుగా రోడ్లపైకి రావడంతో చాలా చోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇవే తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. రాత్రిపూట రోడ్లపైకి వచ్చే జంతువులు వాహనదారులకు కనిపించే విధంగా పశువుల కొమ్ములకు ప్రత్యేకమైన రంగులను వేశారు.

అయితే ఈ చర్యలు కొంతమేర ఫలితాలను ఇచ్చినప్పటికీ.. ఇలాంటి ఘటనలు నియంత్రణకు మరింత మెరుగైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. రహదారులపైకి పశువులు వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. రోడ్డుకు ఇరువైపులా ఇనుప కంచె వంటి ఏర్పాట్లు చేయడం ఉత్తమం.

మరియు డ్రైవింగ్‌ చేస్తున్న సమయంలో హెచ్చరిక బోర్డులు లేదా చోట్ల కాస్త జాగ్రత్తలు వహించాలి. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. మరియు వాహన బ్రేకులు, లైట్లు వంటి వాటిని క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవాలి. మరియు అధిక వేగం కూడా ప్రమాదాలకు కారణం కావచ్చు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Thursday, October 19, 2023, 16:12 [IST]
English summary
High speed tata altroz car hits by nilgai video goes viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+