ప్రతి 14 నిమిషాలకు ఓ కారు మాయం.. అత్యధికంగా కార్లు చోరీ అయ్యేది ఈ నగరాల్లోనే.!!
భారత్‌లో 2023లో కార్ల దొంగతనాలు ఎక్కువయ్యాయని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ ACKO ఇటీవల నివేదిక వెల్లడించింది. ప్రధానంగా దేశ రాజధాని ఢిల్లీలో కార్ల, బైక్‌లు చోరీలు ఎక్కువగా నమోదయ్యాయని వెల్లడించింది. ఆటోమొబైల్ రంగంలో అత్యాధునిక టెక్నాలజీతో కార్లను తయారుచేస్తున్నప్పటికీ.. చోరీలకు గురి కావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
కాగా గత నివేదికలతో పోలిస్తే భారత్‌లో(Most Stolen Cars In India) 2023లో కార్ల దొంగతనం రెండింతలు పెరిగిందనే షాకింగ్ సమాచారాన్ని నివేదిక వెల్లడించింది. అయితే మరి దేశవ్యాప్తంగా ఏయే నగరాల్లో కార్లు ఎక్కువగా చోరీ గురవుతున్నాయో తెలుసా.. ఈ జాబితాలో దేశ రాజధాని ఢిల్లీ-NCR మొదటి స్థానంలో ఉంది. పూర్తి సమాచారం ఈ కథనంలో..

ACKO నివేదిక ప్రకారం 2023 లో దేశ రాజధాని ఢిల్లీ NCR ప్రాంతంలో ప్రతి 14 నిమిషాలకు ఓ వాహనం చోరీకి గురవుతుందని వెల్లడించింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో గతేడాది సగటున 105 కార్ల దొంగతనం కేసులు నమోదయ్యాయి. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ దొంగతనాలు ఎక్కువగా మంగళ, గురు, ఆదివారాల్లో చోటుచేసుకున్నాయట.
కాగా కార్ల దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్న నగరాల్లో తమిళనాడు రాజధాని చెన్నై(Car Thefts Chennai) రెండో స్థానంలో నిలిచింది. గత నివేదికలతో పోలిస్తే గతేడాది చెన్నైలో కార్ల దొంగతనాలు ఎక్కువగా నమోదయ్యాయని ACKO వెల్లడించింది. గతంతో పోలిస్తే 10.5 శాతం ఎక్కువగా కార్లు చోరీకి గురయ్యాయట.

కార్ల దొంగతనాలు జరుగుతున్న నగరాలకు సంబంధించి మూడో అత్యంత అసురక్షితమైన నగరంగా కర్ణాటక రాజధాని, టెక్ సిటీ బెంగళూరు(Car Thefts In Bengaluru) స్థానం సంపాదించుకుంది. గత నివేదికలతో పోలిస్తే.. 2023 లో 10.2 శాతం ఎక్కువగా కార్ల చోరీ కేసులు నమోదయ్యాయి.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే తెలంగాణ రాజధాని హైదరాబాద్.. కార్ల దొంగతనాల లిస్ట్‌లో నాలుగో స్థానంలో ఉంది. ఈ మేరకు ACKO రిపోర్ట్(ACKO Report Car Thefts Hyderabad) వెల్లడించింది. ఐదో స్థానంలో దేశ ఆర్థిక రాజధాని ముంబయి నిలిచినట్లు నివేదికలు చెబుతున్నాయి.

కాగా 2022, 2023 లో ముంబయిలో జరిగిన కార్ల దొంగతనాల(Car Thefts In Mumbai) కేసుల్లో 55 శాతం కేసులను పోలీసులు విజవయంతంగా పరిష్కరించారు. 4,259 దొంగిలించబడిన వాహనాలను ముంబయి పోలీసులు గుర్తించినట్లు ACKO నివేదిక(ACKO Report Cars Theft) చెబుతోంది.
చివరిగా దేశంలో కార్ల దొంగతనాల పరంగా సురక్షిత నగరంగా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా నిలిచింది. భారత్‌లో ఆరు మెట్రోపాలిటన్ నగరాల్లో కోల్‌కతా సురక్షితమైన నగరంగా స్థానం దక్కించుకుంది. దీని ద్వారా మిగతా నగరాలతో పోలిస్తే కోల్‌కతా నగరవాసులు ప్రశాంతంగా నిద్రపోతున్నారనే చెప్పొచ్చు. ఏదేమైనా అత్యాధునిక టెక్నాలజీతో తయారీదారులు కార్లను రూపొందిస్తున్నప్పటికీ ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరం.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








