ఐదవ ఎడిషన్ 2013 గోల్డ్‌రష్ ర్యాలీ హైలైట్స్ - ఫొటోలు
గడచిన నెలలో నిర్వహించిన 5వ ఎడిషన్ 2013 గోల్డ్‌రష్ ర్యాలీ చిన్నచిన్న అపశృతుల మినహా విజయవంతంగా జరిగింది. 2013 గోల్డ్‌రష్ ర్యాలీలో అనేక మంది సూపర్ కార్, ఎగ్జోటిక్ కార్ ప్రియులు పాల్గొని ఈ రేసును విజయవంతం చేశారు. ఈ రేసులో పాల్గొన్న ఓ వ్యక్తి నడుపుతున్న మెక్‌లారెన్ ఎమ్‌పి4-12సి సూపర్‌కారు ప్రమాదవశాత్తు అదుపు తప్పి హైవే పక్కన ఉన్న రెయిలింగ్‌ను ఢీకొట్టుకొని నుజ్జు నుజ్జుయింది.
రోడ్డుపై వెళ్తున్న ట్రక్కును ఓవర్‌టేక్ చేయటంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అదృష్టవశాత్తు ఇందులోని డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ చిన్న అపశృతి మినహా ర్యాలీ సజావుగానే సాగిందని చెప్పాలి. ఎప్పటి మాదిరిగానే అందమైన కార్లు అంతకన్నా అందమైన ముద్దుగుమ్మలతో 2013 గోల్డ్‌రష్ ర్యాలీ హాట్ హాట్‌గా సాగిపోయింది.
జూన్ 8, 2013 శాన్ ఫ్రాన్సిస్కోలో ప్రారంభమైన ఈ ర్యాలీ లాస్ ఏంజిల్స్, లాస్ వేగాస్, డల్లాస్, మెంఫిస్, సెయింట్ లూయిస్ మీదుగా ప్రయాణించి జూన్ 15, 2013న చికాగోలో ముగిసింది. ప్రీమియం లైఫ్‌స్టయిల్ ర్యాలీగా పేరు దక్కించుకున్న 2013 గోల్డ్‌రష్ ర్యాలీలో బెంట్లీ, మెక్‌లారెన్, బుగాటి, ఫెరారీ, చెవర్లే, మెర్సిడెస్, ఆడి, నిస్సాన్, ఫోర్డ్, లోటస్, పోర్షే, రోల్స్ రాయిస్, లాంబోర్గినీ, మాసరేటి, రేంజ్ రోవర్, టెస్లా, స్పోర్ట్‌ఛాస్సిస్, ఆస్టన్ మార్టిన్, బిఎమ్‌డబ్ల్యూ తదిత బ్రాండ్‌లకు చెందిన అనేక లగ్జరీ కార్లు పాల్గొన్నాయి.
ఐదవ ఎడిషన్ 2013 గోల్డ్‌రష్ ర్యాలీలో దేశవిదేశాలకు చెందిన అనేక మంది రేస్ ప్రియులతో పాటు, అందమైన సుందరాంగులు, పలువులు ప్రముఖులు పాల్గొన్నారు. మరి ఈ ర్యాలీ హైలైట్స్‌ను మనం కూడా చూసొద్దాం రండి..!














































Click it and Unblock the Notifications








