రోడ్లు సరిగ్గా లేకుంటే టోల్‌ ఫీజు వసూలు చేయవద్దు: కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ

టోల్‌ వసూలుపై కేంద్రమంతి నితిన్‌ గడ్కరీ (Nitin Gadkari) కీలక వ్యాఖ్యలు చేశారు. వాహనదారులు ప్రయాణించే రహదారులు సరిగ్గా లేకపోతే (దెబ్బతింటే) హైవే ఏజెన్సీలు టోల్ వసూలు చేయరాదని అన్నారు. త్వరలోనే దేశవ్యాప్తంగా అమలు చేయనున్న శాటిలైట్ ఆధారిత టోల్ వసూలుకి సంబంధించిన గ్లోబల్ వర్క్ షాప్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 5,000 కిలోమీటర్ల మేర జీపీఎస్‌ ఆధారిత వ్యవస్థ ద్వారా టోల్‌ వసూలు చేసే అవకాశం ఉంది. ఈ ఏడాది చివరిలోపే ఫాస్టాగ్‌ స్థానంలో గ్లోబల్‌ నేవిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్‌ (GNSS) ద్వారా టోల్‌ ఫీజు వసూలు చేయనున్నారు.

నాణ్యమైన సేవలు అందించకపోతే టోల్ వసూలు చేసే అధికారం లేదని కేంద్ర మంత్రి తేల్చి చెప్పారు. నాణ్యమైన రోడ్లు, సౌకర్యాలు కల్పించనప్పుడు యూజర్ ఫీజు వసూలు చేయడానికి హక్కు ఎలా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అంతే కాకుండా గుంతలు, బురదతో ఉండే రోడ్లపై టోల్ వసూలు చేస్తే ప్రజల నుంచి విమర్శలు తప్పవని ఆయన సూచించారు. ఇలాంటి సందర్భాలు ఉత్ఫన్న కాకుడదంటే నాణ్యమైన రైడింగ్‌ అనుభూతిని వాహనాదారులకు కల్పించాలని అన్నారు.

Nitin-Gadkari-On-Toll-Plaza-

త్వరలోనే కేంద్రం ఫాస్టాగ్‌కి స్వస్తి చెప్పాలని నిర్ణయించింది. ప్రస్తుత ఫాస్టాగ్ ప్లేస్‌లో గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్‌ని అమలు చేయనున్నారు. ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ETC) పద్ధతిలో టోల్ వసూలు చేసే వ్యవస్థను దేశవ్యాప్తంగా త్వరలోనే అమలు చేయనున్నారు. ప్రారంభంలో హైబ్రిడ్ మోడ్‌, RFID (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్) చిప్‌ ఆధారంగా టోల్‌ కలెక్షన్‌ చేపట్టనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి టెండర్‌ ప్రక్రియ కొనసాగుతుంది.

ఇందుకోసం గ్లోబల్‌ కంపెనీల నుంచి సైతం టెండర్లను స్వీకరిస్తున్నారు. పెద్ద ప్రాజెక్ట్‌ కావడం అలాగే భారత్‌ లాంటి ఉపఖండంలోని కష్టమైన రోడ్లను అంచనా వేయడం పలు సవాళ్లతో కూడుకున్నది కాబట్టి అందుకు తగిన కంపెనీ కోసం గ్లోబల్ టెండర్‌ ప్రక్రికయ కొనసాగుతుంది. తొలుత వాణిజ్య వాహనాలపై, ఆ తర్వాత ప్రైవేట్ వాహనాలపై దీన్ని అమలు చేయాలని NHAI భావిస్తోంది. దీనిపై ఇంకా ఎటువంటి అధికారికా సమాచారం లేదు.

Nitin-Gadkari-On-Tollgates

టోల్ గేట్ల వద్ద వీటిని గుర్తించేందుకు ప్రత్యేక వర్చువల్‌ గ్రాంట్స్‌ని ఏర్పాటు చేయనున్నారు. ప్రయోగాత్మకంగా జీపీఎస్‌ కోసం ప్రత్యేక లైన్‌ని కేటాయించనున్నారు. పూర్తి స్థాయిలో దీనిని పరీక్షించాకే అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం ఫాస్టాగ్‌ సిస్టమ్‌లోని లోపాలు ఇతర టెక్నికల్‌ సమస్యలకు స్వస్తి చెప్పేందుకు ఈ చర్యలకు కేంద్ర నిర్ణయం తీసుకుంది. ఈ విధానంలో కేవలం మీరు ఎంత దూరమైతే ప్రయాణిస్తారో కేవలం ఆ దూరానికి మాత్రమే అమౌంట్‌ చెల్లించాల్సి ఉంటుంది.

ఫాస్టాగ్‌ వలె ఇందులో కూడా రీఛార్జ్‌ ఆప్షన్‌ ఉంటుంది. ఒక్కసారి ఈ వ్యవస్థ అందుబాటులోకి రావడంతో టోల్‌గేట్ల వద్ద రద్దీ తగ్గనుంది. పూర్తి స్థాయిలో అన్ని సౌకర్యాలు కలిగి ఉన్న రోడ్లపై ముందుగా ఈ వ్యవస్థను అమలు చేసే అవకాశం ఉంది. రానున్న రెండేళ్లలో దాదాపు 50,000 కి.మీ పైగా రోడ్లను జీపీఎస్‌ ఆధారిత టోల్‌ సిస్టమ్‌తో కనెక్ట్‌ చేసేలా కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.

NHAI-Tollgates

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, June 27, 2024, 12:08 [IST]
English summary
Highway agencies no right to collect toll if roads are not in good condition says nitin gadkari
Read more on: #auto news #roads #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+