హైవే డ్రైవింగ్ చిట్కాలు - సిడ్, జేమ్స్ రోడ్ ట్రిప్ నుంచి..

By Ravi

సిద్దార్థ్, జేమ్స్‌లు కాలేజ్ రోజులు ముగిసిన తర్వాత చాలా కాలం వరకు ఒకరినొకరు కలుసుకోలేదు. వారిద్దరూ ఇప్పుడు 30 ఏళ్ల మధ్య వయస్సులో ఉన్నారు. కాలేజీ రోజుల తర్వాత ఇద్దరికీ ముఖ పరిచయం లేకపోయినప్పటికీ, వారు తరచూ ఫోన్లలో మాట్లాడుకుంటూ, మంచి స్నేహ సంబంధాలను కొనసాగిస్తున్నారు. వీరిద్దరూ ఓసారి ముఖాముఖిగా కలిసి ఓ రోడ్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు.

జేమ్స్ ఆస్ట్రేలియాలో వృత్తిరీత్యా ఓ సౌత్ ఇండియన్ రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్నాడు. సిద్ధార్థ్ మాత్రం ఇండిపెండెంట్ మార్కెటింగ్ కన్సల్టెంట్‌గా ఉన్నాడు. జేమ్స్‌కు ఆటోమొబైల్స్, మోటార్‌స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. లోకల్‌గా జరిగే చిన్న చిన్న మోటార్‌స్పోర్ట్‌లలో పాల్గొంటుండే వాడు జేమ్స్. ఓరోజు వీరు ఇద్దరూ కలిసి బెంగుళూరు నుంచి పాండిచ్చేరి ఓ షార్ట్ హాలిడే ట్రిప్ ప్లాన్ చేశారు. (క్రింది ఫొటో ఫీచర్‌లో స్టోరీ కొనసాగింపు...)

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాల కోసం ఈ ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి..!

హైవే డ్రైవింగ్ చిట్కాలు

మిగతా స్టోరీని తర్వాతి స్లైడ్‌లలో పరిశీలించండి.

Picture credit: Flickr

UrvishJ

హైవే డ్రైవింగ్ చిట్కాలు

ఉదయం ఏడు గంటలకు జేమ్స్ ఫోన్ మోగింది. ఆవతలి వైపు నుంచి సిద్ధార్థ్.. 'జేమ్స్ ఇంకా నిద్రపోతున్నావా..' అని అడిగాడు. అప్పుడు జేమ్స్ 'హా లేదు, ఇప్పుడే నిద్ర లేచాను' అన్నాడు. అప్పుడు సిద్ధార్థ్ త్వరగా రెడీ అవ్వు లేకపోతే పాండీలో మనం సాటర్‌డే డ్రింకింగ్ పార్టీ మిస్ అవుతాం అన్నాడు. దాదాపు రెండు గంటల తర్వాత ఇద్దరూ రెడీ అయ్యారు. సిద్ధార్థ్ కారులో జేమ్స్‌ను పికప్ చేసుకొన్నాడు. ఆ సమయంలో సిద్ధార్థ్ కారు నడుపుతున్నాడు.

సిద్ధార్థ్ హైవే పైకి చేరుకోవటానికి సర్వీస్ రోడ్‌లో కారును నడుపుతున్నాడు. కానీ సిద్ధార్థ్ మాత్రం చాలా నెమ్మదిగా వెళ్తున్నాడని జేమ్స్ భావించాడు. అందుకే జేమ్స్ సిద్ధార్థ్‌తో కాస్తంత వేగంగా వెళ్లమని చెప్పాడు. అప్పుడు సిద్ధార్థ్ ఎందుకని ప్రశ్నించగా.. జేమ్స్ బదులిస్తూ.. సర్వీస్ రోడ్ నుంచి నెమ్మదిగా హైవే పైకి రావటం చాలా ప్రమాదకరం, అలా చేయటం వలన వెనుక నుంచి వచ్చే వాహనాలు మన వాహనాన్ని గుద్దే ప్రమాదం ఉంటుంది. మనం కూడా హైవేపై వెళ్లే వాహనాలతో సమాన సగటు వేగాన్ని పాటించినప్పుడు, ఎలాంటి ఇబ్బంది లేకుండా హైవేపైకి చేరుకోగలమని జేమ్స్ చెప్పాడు.

Picture credit: Wiki Commons

Vitor Pamplona

హైవే డ్రైవింగ్ చిట్కాలు

అప్పుడు సిద్ధార్థ్.. 'హమ్.. జేమ్స్ ఇది ఇండియా. ఇక్కడ్ డ్రైవింగ్ డిఫరెంట్‌గా ఉంటుంది, నువ్వు అది మర్చిపోయావా ఏంటి?'

అప్పుడు జేమ్స్.. 'లేదు, నేను డిఫరెంట్ కాదని చెప్పడం లేదు, కానీ సేఫ్‌గా డ్రైవర్ చేయటం వలన కలిగే నష్టమేమీ లేదు. అబ్రాడ్‍‌లో నేను రెగ్యులర్‌గా డ్రైవ్ చేస్తుంటాను, నాకు తెలుసు, కానీ ఇండియాలో కూడా నేను ఎక్కువ సమయం డ్రైవింగ్ చేస్తుంటాను, అది నీకు తెలుసు కదా..'

కారు సైలెన్సర్ అలికిడి విని జేమ్స్‌కి తన కాలేజీ రోజులు గుర్తుకు వచ్చాయి.. 'గుర్తుందా.. మనం ప్రొఫెసర్ మాథెన్‌ని తన క్యాబిన్‌లో స్మోక్ చేస్తుండగా పట్టుకున్నాం? అప్పుడు అతని ఎక్స్‌ప్రెషన్ నేను ఎప్పటికీ మర్చిపోలేను'.

అప్పుడు సిద్ధార్థ్.. 'హా గుర్తుంది.. ఆ తర్వాతి నుంచి కదా మన అసైన్‌మెంట్ గ్రేడ్స్ సడెన్‌గా పెరగటం ప్రారంభించాయి'

Picture credit: Flickr

Bryangeek

హైవే డ్రైవింగ్ చిట్కాలు

ఇలా వీరిద్దరూ డ్రైవ్ చేసుకుంటా బెంగుళూరు నుంచి సుమారు 70 కిలోమీటర్ల దూరం వచ్చేశారు. కాఫీ బ్రేక్ కోసం సిద్ధార్థ్ కారును ఓ పెట్రోల్ బంక్ వైపుకు పోనిచ్చాడు. అది పూర్తయిన తర్వాత, సిద్ధార్థ్ జేమ్స్‌తో కారును నడుపుతావా అని అడిగాడు, దానికి జేమ్స్ సరే అని డ్రైవర్ సీట్లోకి వచ్చాడు.

సీటులో కూర్చోగానే జేమ్స్ ముందుగా సీటును తనకు అనువుగా ఉండేలా అడ్జస్ట్ చేసుకొని, వెనుక వచ్చే వాహనాలు కనిపించకుండా అడ్డుగా ఉన్న ఓ బ్యాగ్‌ను తొలగించాడు. ఆ తర్వాత సీట్ బెల్ట్ ధరించాడు. ఇదంతా చూసిన సిద్ధార్థ్, జేమ్స్‌తో అయిందా, ఇక వెళ్దామా అన్నాడు. అప్పుడు సిద్ధార్థ్ సరే అని కారును ముందుకు పోనిచ్చాడు.

జేమ్స్ సర్వీస్ రోడ్ నుంచి హైవే పైకి చేరుకునేందుకు కారు వేగాన్ని గంటకు 80 కిలోమీటర్లకు యాక్సిలరేట్ చేశాడు. ఇలా హైవే చేరుకోగానే కొద్ది నిమిషాల తర్వాత వారి కారు ముందు ఎడమ వైపు ఓ ట్రక్కు వెళ్తోంది..

Picture credit: Wiki Commons

Harmishhk

హైవే డ్రైవింగ్ చిట్కాలు

'సిడ్, నువ్వు ట్రక్కులు, బస్సులను పాస్ అయ్యేటప్పుడు లైట్స్ ఫ్లాష్ చేస్తావా' అని అడిగాడు జేమ్స్. అందుకు సమాధానంగా సిద్ధార్థ్ లేదని సమాధానమిచ్చి, అలా ఎందుకు చేయాలని జేమ్స్‌ని అడిగాడు.

'అలా చేయటం వలన ముందుగా/ఎదురుగా వచ్చే వాహనాలకు మన వాహనం సమీపిస్తున్నట్లు వారికి అర్థం అవుతుంది, అంతేకాదు వేగంగా వెళ్తున్నప్పుడు బస్సులు, ట్రక్కులు చేసే శబ్ధం వలన కొన్ని సందర్భాల్లో మనం హారన్ ఇచ్చినా అది వారికి వినిపించకపోవచ్చు. అందుకే లైట్లను ఫ్లాష్ చేయాలి. ఇలా లైట్లను ఫ్లాష్ చేయటం వలన మన ముందు వెళ్తున్న వారు తమ వాహనం సైడ్ మిర్రర్‌లో మన వాహన లైట్ల ఫ్లాషింగ్‌ను మనకు సైడ్ ఇస్తారు. అలా చేయకపోతే, మనం వారికి పెద్ద బ్లైండ్ స్పాట్‌లోకి వెళ్లినట్లు భావిస్తారు, అప్పుడు వాళ్లు మనల్ని పూర్తిగా చూడలేదు.

Picture credit: Flickr

Falling outside the normal moral constraints

హైవే డ్రైవింగ్ చిట్కాలు

ఇలా వీరిద్దరూ వెళ్తుండగా హఠాత్తుగా ఇనుము గోడను గుద్దుకుంటే వచ్చే శబ్ధం వినిపించిద. వెంటనే జేమ్స్ కారును రోడ్డు పక్కగా పార్క్ చేసి, హాజర్డ్ లైట్లు వేసిన తర్వాత కారులో నుంచి క్రిందకు దిగి ఏమైందో చూడసాగాడు. వాస్తవానికి మార్కింగ్ చేయని స్పీడ్ బ్రేకర్‌ను చూసుకోకుండా కారును పోనివ్వటం వలన కారు బంపర్ కొద్దిగా సొట్టపోయింది. ఆ సమయంలో కారును గంటకు 80 కి.మీ. పైగా వేగంతో నడుపుతున్నాడు జేమ్స్.

ఈ సంఘటన జరిగిన తర్వాత జేమ్స్.. 'సారీ సిడ్ నేను ఆ స్పీడ్ బ్రేకర్‌ను చూసి ఉండాల్సింది. నా ముందున్న కారు హైవే నుంచి క్రిందకు దిగటానికి స్లో అవుతుందని అనుకున్నాను' అని సిద్ధార్థ్‌తో అన్నాడు.

Picture credit: Wiki Commons

Woodennature

హైవే డ్రైవింగ్ చిట్కాలు

ఆ తర్వాత ఇద్దరు మళ్లీ కారులో ఎక్కి ముందుకు సాగిపోసాగారు. ఈసారి కూడా జేమ్సే కారును నడుపుతున్నాడు. జేమ్స్ హైవేపై ఇతర వాహనాలను ఓవర్‌టేక్ చేసే ప్రతిసారి గేర్ డౌన్ చేస్తున్నాడు. ఇది చూసిన సిద్ధార్థ్.. జేమ్స్ హైవేపై ఇలా చేయటం (గేర్ డౌన్ చేయటం) అవసరమా? మైలేజ్ తగ్గిపోతుంది కదా అన్నాడు.

అప్పుడు జేమ్స్ బదులిస్తూ.. సిడ్ హైవేపై ఏలాగో మనకు సిటీ డ్రైవ్ కన్నా మంచి మైలేజ్ వస్తుంది, కాబట్టి మైలేజ్ కన్నా ముందు మనం సేఫ్‌గా వెళ్లటం అవసరం. హైవేపై ఓవర్‌టేక్ చేసేటప్పుడు గేరును డౌన్ చేసినట్లయితే, ఓవర్‌టేక్ మరింత వేగంగా, సులువుగా అవుతుంది. అలా చేయటం వలన మన ఫాస్ట్ లేన్‌ను ఎక్కువ సేపు బ్లాక్ చేయం. మన ముందు వైపు ఫాస్ట్ లేన్‌లో వెళ్తున్న కరోలా కారును గమనించు, అతను చాలా సేపు అదే లేన్‌లో వెళ్తున్నాడు అందుకు కారణం అతను డౌన్‌షిఫ్ట్ చేయకపోవటమే. అతను ఆ ముందున్న వోల్వో బస్సును ఓవర్‌టేక్ చేయటానికి చాలా సమయం పడుతుంది.

ఆ కరోలా కారు వల్ల ఫాస్ట్ లేన్ బ్లాక్ అయ్యి, వెనుక వచ్చే వాహనాలకు కూడా దారి లభించక ట్రాఫిక్ బ్లాక్ అయ్యింది. దీంతో విసుగెత్తి వెనుక నుంచి వచ్చే డ్రైవర్లు గ్యాప్ లేకుండా హారన్ మ్రోగిస్తున్నారు. ఎట్టకేలకు కరోలా డ్రైవర్ ఓవర్‌టేకింగ్‌ను పూర్తి చేసిన తర్వాత, అతను రైట్ లేన్‌లో నెమ్మదిగా వెళ్తున్నాడు. వాస్తవానికి రైట్ లేన్ ఫాస్ట్ ట్రాఫిక్ కోసం కేటాయించబడినది. ఈ లేన్‌లో కరోలా స్లోగా వెళ్తుండటంతో వెనుక వైపు అనేక వాహనాలు కూడా నెమ్మదిగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Picture credit: Flickr

M J M

హైవే డ్రైవింగ్ చిట్కాలు

సిద్ధార్థ్‌కు జేమ్స్ చెబుతున్న విషయాలాన్ని చాలా ఆసక్తిగా, కొత్తగా అనిపించాయి. దీంతో జేమ్స్ కారు నడుపుతున్నంత దూరం అనేక కొత్త విషయాలను, చిట్కాలను నేర్చుకోవాలనుకున్నాడు సిద్ధార్థ్.

జేమ్స్ ఓ మంచి డ్రైవర్ అని సిద్ధార్థ్ అర్థం చేసుకున్నాడు. జేమ్స్ కారు వేగాన్ని పెంచాడు. ఇప్పుడు కారు గంటకు సగటును 100 కిలోమీటర్ల వేగంతో నడుపుతున్నాడు. జేమ్స్ లేన్ మారే ప్రతిసారి ఇండికేటర్స్ వేయటం, చుట్టు పక్కల వాహనాలకు సుమారు ఐదు కార్ల దూరాన్ని మెయింటైన్ చేయటం చేస్తున్నాడు. వీటన్నింటినీ సిద్ధార్థ్ జాగ్రత్తగా గమనిస్తున్నాడు.

Picture credit: Flickr

Philozopher

హైవే డ్రైవింగ్ చిట్కాలు

ఇలా వీరిద్దరూ చెంగం సరిహద్దులు దాటారు, ఇద్దరికి బాగా ఆకలిగా ఉంది, బిర్యానీ తినాలనిపించింది. హైవేపై రెస్టారెంట్ కోసం చూస్తూ డ్రైవ్ చేస్తుండగా, పది నిమిషాల తర్వాత ఓ బిర్యానీ ప్యారడైజ్ కనిపించింది. కారును ఇండికేటర్ వేసి హైవే పైనుంచి రెస్టారెంట్ వైపుకు మళ్లించారు. కడుపు నిండా భోజనం చేసిన తర్వాత, ఇద్దరూ తిరిగి కారు వద్దకు వచ్చారు.

అప్పుడే జేమ్స్, సిద్ధార్థ్‌తో నువ్వు కారు నడుపుతావా అని అడిగాడు. లేదు నువ్వే నడుపు అని సిద్ధార్థ్ చెప్పాడు. సిద్ధార్థ్ ప్యాసింజర్ సీట్లోనే కూర్చుని మరిన్ని డ్రైవింగ్ టెక్నిక్స్‌ను జేమ్స్ నుంచి నేర్చుకోవాలనుకుంటున్నాడు. సరే పదా అని ఇద్దరు కారులో ముందుకు సాగిపోయారు.

Picture credit: Flickr

V i p e z

హైవే డ్రైవింగ్ చిట్కాలు

ఇక తర్వాతి 100 కిలోమీటర్ల ప్రయాణం చాలా కీలకమైనది. ఎందుకంటే, ఆ రూట్లో ట్రక్ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ముందు వెళ్తున్న ట్రక్కులను ఓవర్‌టేక్ చేద్దామంటే ట్రక్ డ్రైవరు ఇరువైపులా లేన్లను బ్లాక్ చేసుకుంటూ పోతున్నారు. దీంతో ఓవర్‌టేకింగ్ కాస్తంత క్లిష్టంగానే మారింది. ఈ 100 కిలోమీటర్ల స్ట్రెచ్‌ను దాటడానికి వారికి 3 గంటలకు పైగా సమయం పట్టింది. జేమ్స్ చాలా సేపటి నుంచి డ్రైవ్ చేస్తున్నప్పటికీ, ఇతర డ్రైవర్ల మాదిరిగా స్టీరింగ్‌పైకి తూలిపోకుండా, స్టడీగా ఉంటూ, తనలో తాను పాటలు పాడుకుంటూ చాలా కామ్‌గా డ్రైవ్ చేస్తుండటాన్ని సిద్ధార్థ్ గమనించాడు.

హైవేపై చిరాకుగా డ్రైవ్ చేయటం వలన ఒరిగేదేమీ లేదు. ఊరికే హారన్ మ్రోగించడం వలన మన ముందున్న వాహనాలేవీ వేగంగా వెళ్లలేవు. హైవేపై కూడా ట్రాఫిక్ ఉంటుందన్న విషయాన్ని మనం గ్రహించి, సహనంతో డ్రైవ్ చేయాలి. అప్పుడే సురక్షితంగా మనం మన గమ్యాలను చేరుకోవచ్చు. గమ్యం చేరుకోవటంలో ఒకటి రెండు గంటలు ఆలస్యం జరిగినా నష్టపోయేదేమీ ఉండదు. రోడ్డుపై ఆవేశానర్థాలకు తావివ్వకుండా, ఓర్పుతో వ్యవహరించాలి.

Picture credit: Flickr

Snikrap

హైవే డ్రైవింగ్ చిట్కాలు

జేమ్స్, సిద్దార్థ్ ఇద్దరూ సాయంత్రం లోపుగా పాండిచ్చేరి చేరుకోవాలని ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు, కానీ హైవే ట్రాఫిక్ వలన వారు రాత్రికి గానీ పాండిచ్చేరి చేరుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇంతలో సూర్యుడు పడమర వైపు అస్తమించ సాగాడు. దీంతో రోడ్డుపై మెల్లిగా చీకటి పొరలు కమ్ముకుంటున్నాయి. దీంతో జేమ్స్ పార్కింగ్ లైట్లను ఆన్ చేసి డ్రైవ్ చేస్తున్నాడు. సిద్ధార్థ్ ఎందుకలా చేశావని జేమ్స్‌ని ప్రశ్నించగా.. అప్పుడు బదులిస్తూ.. డస్క్ (సంధ్య వేళ)లో డ్రైవింగ్ చాలా ప్రమాదకరం, ఆ సమయంలో విజిబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది. చాలా మంది డ్రైవర్లు పూర్తిగా 'చీకటి పడే వరకు కానీ తమ వాహన లైట్లను ఆన్ చేయరు, ఇది చాలా తప్ప. రోడ్డుపై అన్ని సమయాల్లో స్పష్టంగా చూడటం సాధ్యం కాదు' అని చెప్పాడు.

వాస్తవానికి వీరిద్దరూ నైట్ డ్రైవింగ్ చేయాలనుకోలేదు, కానీ ఇప్పుడు వారికి వేరే చాయిస్ లేదు. అయితే, అదృష్టవశాత్తు వారు తమ హోటల్‌ను చేరుకోవాటనికి ఇంకో అర్థగంట మాత్రమే పడుతుంది. ఎదురుగా వస్తున్న వాహనాలన్నీ హైబీమ్ లైట్లను వేసుకొని వస్తున్నాయి, దీంతో రోడ్డు స్పష్టంగా కనిపించడం లేదు. ఈ పరిస్థితిలో జేమ్స్ రోడ్డుకు లెఫ్ట్‌గా వెళ్తుండటాన్ని సిద్ధార్థ్ గమించాడు. ఇలా చేయటం వలన ఎదుగా వచ్చే వాహనాల లైట్ ఫోకస్ నేరుగా కళ్లలో పడకుండా ఉండి, సేఫ్‌గా డ్రైవ్ చేయటం సాధ్యమవుతుంది.

Picture credit: Flickr

MC =)

హైవే డ్రైవింగ్ చిట్కాలు

మొత్తానికి సిద్ధార్థ్, జేమ్స్‌లు పాండిచ్చేరి చేరుకున్నారు, స్థానికుల సాయంతో తమ హోటల్‌కు రూట్ తెలుసుకున్నారు. రూమ్‌కి చేరుకొని ఫ్రెష్ అయ్యాక ఇద్దరూ కలిసి డ్రింక్ తాగుతున్నారు. అప్పుడు సిద్ధార్థ్.. జేమ్స్ సేఫ్టీ విషయంలో నువ్వు స్పష్టంగా ఉంటావని నాకు తెలియదు, నీ డ్రైవింగ్ చూసి నేను చాలా నేర్చుకున్నాను అని చెప్పాడు.

మరి జేమ్స్, సిడ్‌ల ప్రయాణం నుంచి మీరు కూడా ఏమైనా డ్రైవింగ్ చిట్కాలు తెలుసుకున్నారా..?

(తర్వాతి స్లైడ్‌లో ఘాట్ రోడ్ డ్రైవింగ్ చిట్కాలను తెలుసుకోండి)Picture credit: Flickr

Shashi.kallada

ఘాట్ రోడ్ డ్రైవింగ్ చిట్కాలు

ఇది కూడా చదవండి (లింక్‌పై క్లిక్ చేయండి): ఘాట్ రోడ్ డ్రైవింగ్ చిట్కాలు

More from DriveSpark

Article Published On: Wednesday, June 4, 2014, 16:10 [IST]
English summary
Read our highway driving tips for Indian roads. Learn safe driving habits on the highway on a journey with Sid and James. These highway driving tips helps you to improve your driving habits.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+