హైవేపై ఇలాంటివి జరగొచ్చు.. జరభద్రం - భయపెడుతున్న వీడియో

భారతదేశంలో ఓ వైపు రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతుంటే.. మరోవైపు హైవేల మీద దోపిడీలు ఎక్కువవుతున్నాయి. హైవే మీద నిర్జన ప్రదేశాల్లో ఒంటరిగా వెళ్తున్న వాహనదారులను లక్ష్యంగా చేసుకుని కొంతమంది దుండగుల సమూహం దొంగతనాలకు పాల్పడుతున్నాయి. గతంలో ఇలాంటి ఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు మరో ఇలాంటి ఘటనే తాగాజా వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఈ దారిదోపిడీ ఎక్కడ జరిగింది? పోలీసులు సంబంధిత వ్యక్తులను అరెస్ట్ చేసారా? ఈ ఘటనలో ఎవరికైనా గాయాలయ్యాయా.. అనే మరిన్ని విషయాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం..

నివేదికల ప్రకారం, జూన్ 14 తెల్లవారుజామున కోయంబత్తూర్‌లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. కేరళకు చెందిన యువకులు కంప్యూటర్లు కొనుగోలు చేసి బెంగళూరు నుంచి కొచ్చికి హైవే మీద వెళ్తున్న సమయంలో.. సేలం కొచ్చి జాతీయ రహదారిపై మరో కారు వారిని అడ్డగించారు. అడ్డగించిన వారు కూడా కేరళకు చెందిన దుండగులే అని తెలుస్తోంది. ఈ దుండగులు వారి ఆయుధాలతో యువకుల కారు అద్దాలను ధ్వంసం చేశారు.

Highway Robbery In Coimbatore

కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తి సిద్ధిక్ అని తెలుస్తోంది. వీరి కారును వెంబడించిన దుండగులు కె శివదాస్, రమేష్ బాబు, విష్ణు మరియు అజయ్ కుమార్ అని పోలీసులు గుర్తించారు. దుండగులు వెంబడించిన సమయంలో సిద్ధిక్ కారును వేగంగా రివర్స్ చేసి కారును టోల్ ప్లాజా వైపు పోనిచ్చాడు. కానీ దుండగులు తమ ఆయుధాలతో కారు అద్దాలను పగులగొట్టినట్లు వీడియోలో కనిపిస్తుంది.

సిద్ధిక్ అలా వేగంగా సమీపంలో ఉన్న టోల్ ప్లాజాను చేరుకునే వరకు దుండగులు వారి కారును వెంబడించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన మొత్తం కారులోని డ్యాష్ బోర్డు కెమెరాలో రికార్డ్ అయింది. దీని ఆధారంగానే పోలీసులు నిందితులను పట్టుకోగలిగినట్లు కోయంబత్తూరు పోలీసులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా చాలా దీనిని తీవ్రంగా ఖండిస్తున్నారు.

Highway Robbery In Coimbatore

హైవేల మీద కొంతమంది దుండగులు కాపు కాసి.. ఒంటరిగా ప్రయాణించేవారిని భయపెట్టి వారిదగ్గర ఉన్న డబ్బు, ఇతర విలువైన వస్తువులను దొంగిలిస్తారు. ఇంతకు ముందు కూడా ఇలాంటి సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు కూడా మరోసారి ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చి అందరిని ఒక్కసారిగా భయభ్రాంతుల్ని చేస్తోంది. ఇలాంటి చర్యలకు పూర్తిగా చరమగీతం పాడటానికి పోలీసులు కంకణం కట్టుకోవాలి.

హైవేల మీద ఎక్కువగా ఈ దోపిడీలు జరుగుతూ ఉంటాయి. అందులోనూ ప్రత్యేకించి రాత్రి సమయంలో ఇవి ఎక్కువ. రాత్రి సమయంలో వాహనాల రద్దీ లేదా రాకపోకలు చాలా తక్కువగా కొంత నిర్మానుష్యంగా ఉంటుంది. ఆ సమయంలో దొంగల గుంపు వాహనదారుల మీద విరుచుకుపడతారు. వాహనాలను ధ్వంసం చేయడమే కాకుండా.. వారిదగ్గర ఉన్న విలువైన వస్తువులను దోచుకుని వెళ్ళిపోతారు.

మన దేశంలో ఇలాంటి దారి దోపిడీలను నివారించడానికి సంబంధిత ప్రభుత్వాలు మరియు పోలీసులు తప్పకుండా చర్యలు తీసుకోవాలి. లేకుంటే దారిదోపిడీ చేసే వారి ఆగడాలు ఎక్కువైపోతాయి. కొన్ని సందర్భాల్లో వారు అమాయక ప్రజల ప్రాణాలను తీసే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇలాంటివి జరగకుండా చూడాలి. అంతే కాకుండా.. వాహనదారులు కూడా హైవే మీద ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Tuesday, June 18, 2024, 15:00 [IST]
English summary
Highway robbery in coimbatore video goes viral
Read more on: #off beat
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+