కూతురికి రూ.2 కోట్ల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి.. ఫిదా చేస్తున్న వీడియో
తల్లిదండ్రులు తమ పిల్లలకు ఖరీదైన గిఫ్ట్స్ ఇవ్వడం సర్వసాధారణం. ఇలాంటి ఘటనలు గతంలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు కూడా అలాంటి మరో సంఘటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
హైలైట్ గ్రూప్ వ్యవస్థాపకుడు పీ. సులైమాన్ తన కుమార్తె 'నిమా సులైమాన్'కు అత్యంత ఖరీదైన అన్యదేశ్య కారు 'పోర్షే 911 కారెరా ఎస్' (Porsche 911 Carrera S) స్పోర్ట్స్ కారును గిఫ్ట్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు పోర్షే సెంటర్ కొచ్చి తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది. నిజానికి ఈ కారు డెలివరీ కస్టమర్ ఇంటివద్దనే జరిగింది.

ప్రస్తుతం పోర్షే 911 కారెరా ఎస్ కారును కూతురు గిఫ్ట్ ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో తండ్రి కూతుళ్ళ సంతోషం చూడవచ్చు. వీడియోలో మీరు గమనించినట్లయితే.. కారును ఒక ట్రక్కులో తీసుకురావడం చూడవచ్చు. ఆ తరువాత కారును ఆ ఇంటి ఆవరణలోనే డెలివరీ చేయడానికి కావలసిన ఏర్పాట్లను సిద్ధం చేశారు. అక్కడే డీలర్‌షిప్ సిబ్బంది కూడా వారికి కారును డెలివరీ చేయడం చూడవచ్చు.
కొత్త కారును డెలివరీ చేసే సమయంలో సులైమాన్ మాత్రమే కాకుండా.. నిమా సులైమాన్ మరియు కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు అందరూ ఉండటం చూడవచ్చు. చివరికి కారును డీలర్‌షిప్ సిబ్బంది వారికి డెలివరీ చేస్తారు. ఆ తరువాత నిమా సులైమాన్ కారులో కూర్చుంటుంది. ఈ తరువాత కారును స్టార్ట్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. వీడియో అంతటితో ముగుస్తుంది.

సులైమాన్ తన కుమార్తె నిమాకు ఇచ్చిన పోర్షే కారు ధర రూ. 2 కోట్లు కంటే ఎక్కువ అని తెలుస్తోంది. ఇటీవల నిమా కంపెనీ డైరెక్టర్‌గా బాధ్యత స్వీకరించింది. దీంతో తండ్రి ఆమెకు ఖరీదైన కారును గిఫ్ట్ ఇచ్చారు. ఈ కారు షార్క్ బ్లూ కలర్ ఆప్షన్‌లో చాలా ఆకర్షణీయంగా ఉండటం చూడవచ్చు. ఇది మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి చూడగానే ఆకర్శించే విధంగా ఉంది.
ఇక్కడ కనిపిస్తున్న పోర్షే 911 కారెరా ఎస్ కారు 992 జనరేషన్ స్పోర్ట్స్ కారు అని తెలుస్తోంది. ఇది 3.0 లీటర్ ట్విన్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇంజిన్ 450 Bhp పవర్ మరియు 530 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది. పవర్ వెనుక చక్రాలను డెలివరీ చేయబడుతుంది. కాబట్టి ఉత్తమ పనితీరును అందిస్తుంది.

పోర్షే 911 కారెరా ఎస్ స్పోర్ట్స్ కారు కేవలం 3.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. నిమాకు గిఫ్ట్ ఇచ్చిన కారు ఇంటీరియర్ బ్లాక్ కలర్ పొందుతుంది. ఇది రెండు డోర్స్ మాత్రమే కలిగి ఉంది. అయితే నలుగురు ప్రయాణించడానికి అనుమతిస్తుంది. ఈ కారు పెడా ఓవల్ హెడ్‌ల్యాంప్ కలిగి, వెనుక వైపు బ్రాండ్ లోగో మరియు బ్యాడ్జింగ్ వంటివి ఉన్నాయి.
పోర్షే 911 కారెరా ఎస్ ముందువైపు 20 ఇంచెస్ వీల్స్ ఉన్నాయి, వెనుక వైపు 21 ఇంచెస్ వీల్స్ ఉండటం చూడవచ్చు. ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, అనలాగ్ టాకోమీటర్‌తో కూడిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి ఉన్నాయి. ఇది ఎలక్ట్రిక్ డోర్ హ్యాండిల్స్ పొందుతుంది. మొత్తం మీద ఇది వాహన వినియోగదారులకు చాలా అద్భుతమైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








