ఆల్టో కారుపై వచ్చిన సీఎం.. అవ్వాక్ అయిన ఆఫీసర్స్.. కట్ చేస్తే..!

బడ్జెట్ సెషన్స్ అప్పుడు కొందరు ముఖ్య నాయకులు పార్లమెంట్ కి లేదా అసెంబ్లీకి వివిధ వాహనాలపై వస్తారు. కొందరు సైకిల్ పై రావడం, మరి కొందరు రిక్షాపై ఇంకొందరు ఖరీదైన కార్లలో రావడం చాలా సందర్భాల్లో చూశాం. తాజాగా ఓ రాష్ట్ర సీఎం 20 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన కారుపై బడ్జెట్ సెషన్స్ కి వచ్చి చూపరులను ఆకట్టుకున్నాడు. ఇంతకీ ఆ సీఎం అతను వచ్చిన వాహనం ఏంటి..

సాధారణంగా దేశంలో, రాజకీయ నాయకులు ఖరీదైన MPV లేదా SUV లలో కాన్వాయ్‌గా రావడం మనం పరిపాటే. మన దేశంలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రుల విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. వారి పని స్వభావం భద్రతా కారణాల దృష్ట్యా, వారికి తరచుగా ఈ వాహనాలు కాన్వాయ్‌లు మారుతుంటాయి. సాధారణం కంటే భిన్నమైన రూపంలో వచ్చినప్పుడు అది మీడియాతో పాటు ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంది.

హిమాచల్ సీఎం

తొలిసారి సరికొత్తగా..

హిమాచల్ ప్రదేశ్ లో కొత్తగా ఏర్పాటైన కొత్త ప్రభుత్వం తమ మొదటి బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఈ సెషన్‌కు హాజరయ్యేందుకు ఆ రాష్ట్ర సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు తన పాత మారుతీ ఆల్టో కారులో వచ్చి ఆశ్చర్య పరిచారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. దేశ వ్యాప్తంగా ఈ ముచ్చట ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మొదటి బడ్జెట్ సమావేశానికి హాజరయ్యేందుకు తన అధికారిక నివాసమైన ఓకోవర్ నుంచి సుఖ్వీందర్ సింగ్ సుఖు బయలుదేరారు. కారులోని ముందు భాగంలో కూర్చుని రాగా డ్రైవర్ అతని డ్రైవర్ కారును నడిపాడు. ముఖ్యమంత్రితో పాటు విద్యాశాఖ మంత్రి రోహిత్ ఠాకూర్, లాహుల స్పితి ఎమ్మెల్యే కారులో సీఎం వెంట వచ్చారు.

మారుతి కారుపై హిమాచల్ సీఎం

నాకు ఇలానే ఇష్టం..

విధానసభలో ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రి ముఖేష్ అగ్నిహోత్రి, శాసనసభ వ్యవహారాల మంత్రి హర్షవర్ధన్ చౌహాన్ స్వాగతం పలికారు. ఈ కారు గురించి మీడియా ఆయన్ను ప్రశ్నించగా.. ఇది నా పాత రోజులను గుర్తుకు తెచ్చిందని ముఖ్యమంత్రి అన్నారు. చాలా కాలంగా ఈ కారును వాడుతున్నాని తెలిపారు. తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఇదే కారును వినియోగించినట్లు ఆయన పేర్కొన్నారు.

సుఖ్వీందర్ సింగ్ సుఖు

అప్పటి నుంచి ఆయన విధానసభకు వెళ్లేందుకు ఈ కారునే ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. భద్రతా ప్రమాణాల దృష్ట్యా విధానసభ వెలుపలనే మారుతీ ఆల్టోను అధికారులు నిలిపివేశారు. కారులో ముఖ్యమంత్రిని చూసిన వారంతా ఆశ్చర్యానికి గురై అనంతరం దానిని ముందుకు పంపారు. ఎటువంటి VVIP ప్రోటోకాల్ లేకుండా మార్నింగ్ వాక్ సమయాల్లో, రద్దీ ప్రదేశాల్లో జనాలతో మాములుగా కలుసుకుని మాట్లాడటం ఆయనకు అలవాటుగా ఉంది.

హిమాచల్ సీఎం

కాస్ట్లీ కార్లను వాడుతున్న నేతలు..

రాజకీయ నాయకులు తమ బలాన్ని, అధికారాన్ని చాటుకోవడానికి ఖరీదైన కార్లు SUVలను ఉపయోగించడం సర్వసాధారణం. ఓ సీఎం మారుతి ఆల్టో వంటి కారును ఉపయోగించి ప్రయాణించడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. అంతకు ముందు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రెండు మూడు సందర్భాల్లో ప్రయాణించినా భద్రతా ప్రమాణాల దృష్ట్యా ఆ కారును నిలిపివేశారు. కానీ ఈ సీఎం ఈ కారును ఉపయోగిస్తూ వస్తుండటం గమనార్హం.

ప్రభుత్వ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక వాహనాలు ఉండేలా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని హిమాచల్ సీఎం ఆదేశించారు. మారుతి ఆల్టో తన అధికారిక కాకపోయిన దాన్ని ఆయన వాడుతున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, రాజ్ థాక్రే, సోనియా గాంధీ, జ్యోతిరాదిత్య సింధియా వంటి రాజకీయ నాయకులు ల్యాండ్ రోవర్ డిఫెండర్, రేంజ్ రోవర్స్ వంటి ఖరీదైన SUVలను ఉపయోగిస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Sunday, March 19, 2023, 12:33 [IST]
English summary
Himachal cm arrives in a 20 year old maruti alto car to attend his first budget session
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+