15 ఏళ్ళు దాటిందా? కారును తుక్కు చేయాల్సిందే! మరో రాష్ట్రం కీలక నిర్ణయం
వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించడానికి లేదా కార్బన్ ఉద్గారాల స్థాయిని క్షీణింపజేయడానికి ప్రభుత్వాలు కృషి చేస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలో డీజిల్ వాహనాల వినియోగాన్ని నిషేదించారు మరియు పాత వాహనాల వినియోగాన్ని తగ్గించడానికి స్క్రాపేజ్ పాలసీ కూడా తీసుకువచ్చింది. ఇప్పుడు ఓల్డ్ వెహికల్ స్క్రాప్ చేసే ప్రణాళికలను హిమాచల్ ప్రదేశ్ అమలు చేయడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే 15 ఏళ్లకంటే ఎక్కువ వయసున్న వాహనాలను స్క్రాప్ చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం రాష్ట్రంలో 12 స్క్రాప్ సెంటర్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.
హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు పాత వాహనాలను స్క్రాప్ చేయడానికి కొత్త స్క్రాప్ సెంటర్లను ఏర్పాటు చేయడానికి సన్నద్ధమైంది. 2024 అక్టోబర్ నుంచి రాష్ట్రంలో కొత్త స్క్రాపేజ్ విధానం అమలులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం దీనికోసం రవాణాశాఖ సహాయం తీసుకోనుంది. ఇందులో భాగంగానే ప్రతి జిల్లాలో ఒక స్క్రాప్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది.

పాత వాహనాల వినియోగాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ప్రజలను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగానే పాత కార్ల యజమానులు ప్రోత్సహించడానికి ప్రోత్సాహకాలను కూడా ప్రకటించింది. ఎవరైతే పాత వాహనాలను స్క్రాప్ చేసి.. కొత్త వాహనాలను కొనాలని చూస్తున్నారో, కొత్త వెహికల్ కొనుగోలు చేసిన తరువాత రిజిస్ట్రేషన్ ఫీజులో రాయితీ అందిస్తారు. రాయితీ అనేది స్క్రాప్ చేసిన వెహికల్ మీద ఆధారపడి ఉంటుంది.
కమర్షియల్ వాహనాన్ని స్క్రాప్ చేస్తే.. అలాంటి వారు రిజిస్ట్రేషన్ ఫీజులో 50 శాతం తగ్గింపు, వాణిజ్యేతర వాహనాలను స్క్రాప్ చేస్తే.. వారు గరిష్టంగా 25శాతం తగ్గింపు పొందవచ్చు. కొత్త ప్రకటన గురించి హిమాచల్ ప్రదేశ్ రవాణా శాఖ డైరెక్టర్ మాట్లాడుతూ.. 15 ఏళ్ల వాహనాలు ఒక్క హిమాచల్ ప్రదేశ్‌లో మాత్రమే కాకుండా దేశం మొత్తం మీద రద్దు చేయబడతాయి. అలాంటి వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు కూడా రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

హిమాచల్ ప్రదేశ్‌లో స్క్రాప్ సెంటర్లు త్వరలోనే ప్రారంభమవుతాయి. స్క్రాప్ సెంటర్లను ప్రారంభించడానికి దరఖాస్తు చేసుకున్న వారి అప్లికేషన్స్ త్వరలో పరిశీలించి.. ఎంపిక చేసిన సంస్థలకు పని అప్పగించడం జరుగుతుంది. ఇతర రాష్ట్రాల్లో ఉన్న స్క్రాపేజ్ విధానంతో పోలిస్తే హిమాచల్ ప్రదేశ్‌లో కొంత భిన్నంగా ఉంటుంది. అంటే స్క్రాప్ చేసిన వాహనాల విడి భాగాలు మళ్ళీ వినియోగించడానికి అనుమతించబడదు.
సాధారణంగా ఎక్కడైనా వెహికల్ స్క్రాప్ చేసిన తరువాత, అందులోని కొన్ని విడి భాగాలను లేదా ఫ్యానెల్స్ తక్కువ ధరలకు విక్రయించడం లేదా వినియోగించడం చేస్తూ ఉంటారు. అలాంటి వాటిని కూడా పూర్తిగా రద్దు చేయాలని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. స్క్రాప్ చేయబడిన వాహనాల సమగ్ర రికార్డులు నిర్వహించబడతాయి. ఇవన్నీ పారదర్శకంగా నిర్వహించబడతాయి. కాబట్టి స్క్రాప్ చేసిన వాహనాల్లోని విడి భాగాలను ఉపయోగించడానికి అనుమతించే అవకాశం లేనేలేదు.
పాత వాహనాల్లోని వస్తువులను ఏదైనా ఇతర వాహనాల్లో ఉపయోగించడం ద్వారా మళ్ళీ అందులో ఏదైనా సమస్య ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ దానిని వినియోగదారుడు భరించాల్సి ఉంటుంది. ఒకవేలా ప్రమాదాలు కూడా జరగవచ్చు. ఇలాంటి వాటిని పూర్తిగా నిర్మూలించడానికి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెహికల్ స్క్రాపేజీ పారదర్శకంగా అమలు చేస్తుంది. పాత వాహనాల్లో డీజిల్ కార్లు మాత్రమే కాకుండా పెట్రోల్ వాహనాలు ఉంటాయి.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








