మోడీ ప్రారంభించిన అటల్ టన్నెల్‌లో 7 మంది అరెస్ట్.. ఎందుకో తెలుసా ?

భారతదేశంలో కొన్ని నెలల క్రితం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అటల్ టన్నెల్ సొరంగ మార్గాన్ని ఓపెన్ చేసిన విషయం అందరికి తెలుసు. ఈ అటల్ టన్నెల్ భారతదేశం యొక్క కీర్తికి ఒక నిలువెత్తు నిదర్శనం. ప్రజల ఉపయోగార్థం ఈ అటల్ టన్నెల్ ఓపెన్ చేయబడింది. ఈ మార్గం ప్రారంభించినప్పటి నుంచి ట్రాఫిక్ పెరిగింది.

మోడీ ఓపెన్ చేసిన అటల్ టన్నెల్‌లో 7 మంది అరెస్ట్.. ఎందుకో తెలుసా ?

ఈ సొరంగం మార్గం చూడటానికి చాల అద్భుతంగా ఉంటుంది. ఈ కారణంగా అందమైన దృశ్యాలను ఫోటోలు మరియు వీడియో తీయడానికి ప్రజలు ఈ స్థలానికి చేరుకుంటారు. ఈ కారణంగానే సొరంగంలో తరచుగా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ఫోటోలు తీసుకోవడం వంటి వాటి వల్ల అటల్ టన్నెల్ నిరంతరం ట్రాఫిక్ ఎక్కువవుతున్న కారణంగా ఇక్కడ ఫోటోలు మరియు వీడియోలు నిషేధించబడ్డాయి.

మోడీ ఓపెన్ చేసిన అటల్ టన్నెల్‌లో 7 మంది అరెస్ట్.. ఎందుకో తెలుసా ?

ఇటీవల కొంతమంది పర్యాటకులు తమ వాహనాలను అటల్ టన్నెల్ మధ్యలో పార్క్ చేసి, ఫోటోలు తీసుకొని డ్యాన్స్ చేశారు. ఈ కారణంగా ట్రాఫిక్ ఎక్కువైంది. అటల్ టన్నెల్‌లో ట్రాఫిక్ కి కారణమైన వారిని హిమాచల్ ప్రదేశ్ పోలీసులు ఏడుగురు పర్యాటకులను అరెస్టు చేసి 3 కార్లను స్వాధీనం చేసుకున్నారు. అటల్ టన్నెల్ లోపల పర్యాటకులు డ్యాన్స్ చేస్తున్న వీడియోలు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో వైరల్ అయ్యాయి.

MOST READ:భారత్‌లో ప్రారంభమైన నిస్సాన్ మ్యాగ్నైట్ డెలివరీలు ; వివరాలు

మోడీ ఓపెన్ చేసిన అటల్ టన్నెల్‌లో 7 మంది అరెస్ట్.. ఎందుకో తెలుసా ?

ఈ వీడియోలు హిమాచల్ ప్రదేశ్ పోలీసుల దృష్టికి కూడా వచ్చాయి. ఇవి పోలీసుల దృష్టికి చేరిన వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ఈ సొరంగం మార్గం ట్రాఫిక్ ప్రాముఖ్యత కలిగిన రహదారి కాబట్టి వారు వెంటనే చర్యలు తీసుకున్నారు. సొరంగం మధ్యలో, పర్యాటకులు తమ వాహనాలను పార్క్ చేసి డాన్స్ చేస్తారు. దీనివల్ల సొరంగం లోపల ట్రాఫిక్ రద్దీ ఏర్పడి, వాహనాలు ఎక్కువగా నిలిచిపోతాయి.

మోడీ ఓపెన్ చేసిన అటల్ టన్నెల్‌లో 7 మంది అరెస్ట్.. ఎందుకో తెలుసా ?

ఈ కారణంగా ఇతర వాహనదారులు కూడా ఎక్కువ ఇబ్బందిపడవలసి వస్తుంది. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏడుగురు వ్యక్తులు ఇంకా అదుపులో ఉన్నారు. అటల్ టన్నెల్ లోపల వాహనాల పార్కింగ్ నిషేధించబడింది. అంతకు మించి పార్కింగ్ చేయడం చట్టవిరుద్ధం. ఈ సొరంగంలో సెల్ఫీలు తీసుకొని వీడియోలు తీయడం కూడా ఇక్కడ నిషిద్ధం.

MOST READ:నిర్మానుష్య రోడ్డుపై వెళ్తున్నారా.. అయితే టేక్ కేర్.. ఎందుకో వీడియో చూడండి

మోడీ ఓపెన్ చేసిన అటల్ టన్నెల్‌లో 7 మంది అరెస్ట్.. ఎందుకో తెలుసా ?

ఈ రకమైన కార్యకలాపాలు ఇతర వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్నాయని ప్రయాణికులు తెలుసుకోవాలి అని అధికారులు తెలిపారు. అటల్ టన్నెల్ ఓపెన్ చేసినప్పటి నుంచి ఇక్కడ అనేక రోడ్డు ప్రమాదాలు సంభవించడం గమనార్హం. వాహనదారులు వేగంగా వెళ్లడం వల్ల కూడా ఈ ప్రమాదాలు సంభవిస్తాయి.

మోడీ ఓపెన్ చేసిన అటల్ టన్నెల్‌లో 7 మంది అరెస్ట్.. ఎందుకో తెలుసా ?

ఇతర వాహనాలను అధిగమించడానికి ప్రయత్నిస్తున్న ఈ వాహనాలకు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ కారణంగా, అటల్ టన్నెల్‌లో ప్రయాణించే వాహనాలకు జరిమానా విధిస్తున్నారు.

MOST READ:అలెర్ట్.. 2021 జనవరి 1 నుంచి ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి

వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించకుండా నిరోధించడానికి పోలీసు బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ బృందాలు అటల్ టన్నెల్‌లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి మరియు ఇక్కడ జరిగే అవకతవకలను కూడా పర్యవేక్షిస్తున్నాయి. ఏది ఏమైనా ప్రజల ఉపయోగార్థం తయారు చేసిన ఈ టన్నెల్ ఇలాంటి సంఘటనలు జరగటం నిజంగా బాధాకరం.

మోడీ ఓపెన్ చేసిన అటల్ టన్నెల్‌లో 7 మంది అరెస్ట్.. ఎందుకో తెలుసా ?

వాహనదారులు కూడా ఈ టన్నెల్ లో ప్రయాణించేటప్పుడు నిబంధనలకు అనుకూలంగా ఉండాలి, అప్పుడే ప్రమాదాల నుంచి బయటపడే అవకాశం ఉంది. అంతే కాదు ఇతర వాహనదారులకు కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుంది.

MOST READ:ఒకటి, రెండు కాదు ఏకంగా 80 పోర్స్చే కార్లను కలిగి ఉన్న 80 ఏళ్ళ వ్యక్తి ; పూర్తి వివరాలు

Most Read Articles

English summary
7 Tourists Arrested For Violating Traffic Rules In Atal Tunnel Viral Video. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X