ఫ్రెండ్‌ కారులో టూర్‌కు వెళ్లిన ఫ్యామిలీకి పెనాల్టీ వేసిన పోలీసులు.. ఇలాంటి రూల్‌ కూడా ఉందా.??

ఉద్యోగ బాధ్యతల్లో అలసిపోయి కాస్తంత రిలీఫ్‌ కోసం.. ఫ్యామిలీతోనో, ఫ్రెండ్స్‌తోనో కలిసి అలా బయటకు వెళ్లాలని ఎవరికైనా ఉంటుంది. అందుకే వారాంతాల్లో(weekend Trip) లేదంటే తమకు వీలైనప్పుడు ఆహ్లాదకరంగా ఉండే ప్రదేశాలకు టూర్‌ వెళ్తుంటారు. ప్రకృతి అందాలను ఆస్సాదిస్తూ ఆ లోకంలో తమను తాము మైమరిచిపోయి సంతోషంగా గడుపుతారు.

ఇందుకోసం కొందరు సొంత కారులో లేదంటే మరికొందరు అద్దెకు తీసుకుని, ఇంకా తెలిసిన వారి కారు తీసుకుని వెళ్తుంటారు. ఎక్కువగా చాలా మంది టూర్ల కోసం పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ కంటే కూడా ప్రైవేట్‌ వాహనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలా ప్రైవేట్ వాహనంలో వెళ్తే ఎక్కడికైనా తమకు అనుకూలంగా ఉండే సమయంలో వెళ్లడానికి వీలుగా ఉంటుంది.

Traffic-Police-Fine-a-Family

ఇంకో ముఖ్య కారణం పర్యాటక ప్రదేశాల్లో కొందరి మోసాలకు గురికాకుండా ఉండటానికి కూడా ప్రైవేట్‌ వాహనాలను ఎక్కువగా వినియోగిస్తారు. ఈ నేపథ్యంలో ఢిల్లీకి చెందిన ఓ కుటుంబం సరదాగా గడిపేందుకు రిషికేశ్‌, మనాలీలకు విహారయాత్రకు వెళ్లారు. ఇందుకోసం తమ స్నేహితుడి వద్ద కారు తీసుకుని బయలుదేరారు. అయితే ఇక్కడే పోలీసుల నుంచి వారికి ఊహించని షాక్‌ తగిలింది.

వారు తమ సొంత కారు కాకుండా స్నేహితుడి కారులో వెళ్తున్నందుకు ఎలాంటి జరిమానా నోటీసు లేకుండా టికెట్ జారీ చేశారు. ఖంగుతిన్న(Family went to Tour in Friend's Car) పర్యాటకులు పోలీసులు చేసిన పనికి షాక్‌ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది. హిమాచల్ రాష్ట్ర పోలీసులే ఈ వింత చర్యకు పాల్పడ్డారు. కారుకు సంబంధించి అన్ని పత్రాలు సరైనవే అయినా.. అరువుగా తీసుకున్న కారు అని చెప్పి అపరాధ రుసుం లేకుండా టికెట్ ఇచ్చారు.

దీంతో కారులో వచ్చిన కుటుంబీకులు పోలీసుల(Police Fine)తో తీవ్ర వాగ్వాదానికి దిగారు. అయినా ఫలితం లేకపోయింది. కారును సన్నిహిత మిత్రుడి నుంచి తీసుకున్నామని వారు చెప్పారు. అయినప్పటికీ పోలీసులు వారిని పట్టించుకోలేదు. ఈ ఘటన పలువురిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇదెక్కడి చోద్యమంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

మనలో చాలా మందికి మన ఊరిలో విహారయాత్రలకు లేదా శుభకార్యాలకు వెళ్లేందుకు స్నేహితులు లేదా బంధువుల దగ్గర కారు తీసుకోవడం అలవాటు. నిజానికి చట్టంలో ఇలాంటి వాటికి జరిమానా విధిస్తారా అంటే లేదనే చెప్పొచ్చు. మీరు సన్నిహితులు లేదా బంధువుల నుండి కారును ఉచితంగా తీసుకోవచ్చు. ఇంకా కొన్ని కార్లను అద్దెకు ఇచ్చే కంపెనీలు మరియు టూర్ ఆపరేటర్లు కూడా ఉన్నాయి.

పోలీసుల తీరును ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం కూడా గమనార్హం. కుటుంబీకులు సెల్‌ఫోన్‌లో కారు యజమానికి ఫోన్ చేసినా.. ఇది చట్టవిరుద్ధమని పోలీసులు చాలాసేపు వాదించడం మరింత వివాదానికి కారణమైంది. ఏదేమైనా పోలీసులు చేసిన ఈ చర్య నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. ఇలాంటి ఫైన్‌ తామెక్కడా చూడలేదంటూ ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. ఇలాంటి వాటికి కూడా ఫైన్‌ విధిస్తే ఇకపై ప్రతి ఒక్కరూ ఎంత అప్పు చేసైనా కారు కొనుగోలు చేయాలేమో..

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, September 25, 2023, 9:52 [IST]
English summary
Himachal pradesh traffic police fined a family for using a friend s car on a trip
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+