ఆ కారుకి మూడే చక్రాలు.. అదే దాని వైఫల్యానికి కారణం.. ఇదెక్కడో కాదు మన దేశంలోనే..

భారతదేశ ఆటోమొబైల్స్ చరిత్రను పరిశీలిస్తే, చాలా ప్రత్యేకమైన మోడళ్లు, అద్భుతమైన కార్లు, పురాతన కార్ బ్రాండ్లు ఇలా చాలానే ఉన్నాయి. మన దేశంలో విజయవంతమైన కార్ల గురించి అందరికీ తెలుస్తూనే ఉంటుంది. కానీ, అనేక కారణాల వలన మార్కెట్లో రాణించలేక ఆగిపోయిన కార్ల గురించి మాత్రం అతికొద్ది మందికి మాత్రమే తెలుస్తుంది.

ఆ కారుకి మూడే చక్రాలు.. అదే దాని వైఫల్యానికి కారణం.. ఇదెక్కడో కాదు మన దేశంలోనే..

భారతదేశంలో కొన్ని కార్ల కంపెనీలకు చెందిన మోడళ్లు మార్కెట్లో విఫలం అయ్యాయి. వీటిలో కొన్ని కార్లు ఖరీదైనవి కావడం వల్ల విక్రయించబడలేదు మరికొన్ని వాటి డిజైన్ కారణంగా ప్రజలు ఇష్టపడలేదు. ఈ రోజు మనం ఇలాంటి ఓ కారు గురించి తెలుసుకోబోతున్నాం. దాని డిజైనే ఆ కారు వైఫల్యానికి కారణమైంది. విరాల్లోకి వెళితే...

ఆ కారుకి మూడే చక్రాలు.. అదే దాని వైఫల్యానికి కారణం.. ఇదెక్కడో కాదు మన దేశంలోనే..

కారు అనగానే సాధారణంగా మన మనస్సులోకి వచ్చే మొదటి విషయం అదొక నాలుగు చక్రాల వాహనం. నిజానికి నాలుగు చక్రాలు లేని దానిని మనం కారు అని ఒప్పుకోలేం. 1975 కాలంలో, ఒక భారతీయ సంస్థ చాలా వినూత్నమైన ఉత్పత్తితో ముందుకు వచ్చింది. ఈ సంస్థ తయారు చేసిన కారుకు కేవలం మూడే చక్రాలు ఉండేవి. ఈ కారుని 'బాదల్' అని పిలిచేవారు మరియు దీనిని 'సిపాని' తయారు చేశారు.

భారతదేశం యొక్క మొట్టమొదటి మూడు చక్రాల కారు వెనుక ఉన్న చరిత్ర గురించి మాట్లాడే వీడియో ఇక్కడ ఉంది. ఈ వీడియోను టాకింగ్ కార్స్ వారి యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసింది. ఈ వీడియోలో, ప్రెజెంటర్లు సిపాని భారతీయ కస్టమర్ల కోసం బాదల్ ఉత్పత్తిని ఎలా ముగించారు అనే దాని గురించి మాట్లాడుతారు. ఆ వీడియోని మీరు కూడా చూసేయండి.

ఆ కారుకి మూడే చక్రాలు.. అదే దాని వైఫల్యానికి కారణం.. ఇదెక్కడో కాదు మన దేశంలోనే..

సిపాని సంస్థను ఇంతకు ముందు సన్‌రైజ్ ఆటోమోటివ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనే పేరుతో పిలిచేవారు. ఇది అప్పట్లో భారత మార్కెట్లో ఉన్న హిందూస్తాన్ మోటార్స్, ప్రీమియర్, స్టాండర్డ్ మరియు ఫియట్ వంటి ఆటోమొబైల్ తయారీదారులు మాదిరిగానే వాహనాలను తయారు చేయాలని భావించింది. కాకపోతే, సాంప్రదాయ కార్ల కన్నా భిన్నాంగా తమ ఉత్పత్తి ఉండాలనే ఉద్దేశ్యంతో సిపాని బాదల్‌ను సృష్టించింది.

ఆ కారుకి మూడే చక్రాలు.. అదే దాని వైఫల్యానికి కారణం.. ఇదెక్కడో కాదు మన దేశంలోనే..

ఆ సమయంలో భారత మార్కెట్లో ఉన్న ఇతర కార్ల కంటే భిన్నమైన మరియు చౌకైన ఉత్పత్తిని తీసుకురావాలని సిపాని భావించింది. అప్పటి కార్లకు ఆర్థిక ప్రత్యామ్నాయంగా, చవకైన కారుగా సిపాని బాదల్ ప్రవేశపెట్టబడింది. సిపాని కార్లను బ్రిటిష్ కంపెనీ రిలయంట్ మోటార్స్ సహకారంతో నిర్మించారు.

ఆ కారుకి మూడే చక్రాలు.. అదే దాని వైఫల్యానికి కారణం.. ఇదెక్కడో కాదు మన దేశంలోనే..

ఈ వింతగా కనిపించే మూడు చక్రాల కారును సంవత్సరానికి 150 యూనిట్లు అమ్ముడైంది. అయితే, ఈ కంపెనీ నుండి గరిష్టంగా 300 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఈ కారు మార్కెట్లో అంతగా ప్రజాదరణ పొందకపోవటానికి ప్రధాన కారణం, దాని డిజైన్. త్రీ-వీలర్ కారు అనేది ఆ సమయంలో చాలా కొత్త కాన్సెప్ట్ మరియు అది వినియోగదారులను అంతగా ఆకర్షించలేకపోయింది.

ఆ కారుకి మూడే చక్రాలు.. అదే దాని వైఫల్యానికి కారణం.. ఇదెక్కడో కాదు మన దేశంలోనే..

అంతేకాదు, ఈ కారులో అనేక సాంకేతిక లోపాలు కూడా ఉన్నాయి. ఈ కారు నిటారుగా లేదా వాలుగా ఉన్న రహదారిపై సులభంగా సమతుల్యత (బ్యాలెన్స్)ను కోల్పోయేది. ఫలితంగా, కారు అదుపు తప్పి ప్రమాదాలు కూడా జరిగేవి. ఈ విషయంలో కారు బరువు కూడా సరిగ్గా సమతుల్యం కాలేదు, దీని కారణంగా అధిక వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు దీనిని నియంత్రించడం అసాధ్యమయ్యేది.

ఆ కారుకి మూడే చక్రాలు.. అదే దాని వైఫల్యానికి కారణం.. ఇదెక్కడో కాదు మన దేశంలోనే..

సిపాని బాదల్ అమ్మకాలను పెంచడానికి, సంస్థ దానిని ప్రోత్సహించడానికి ఆ సమయంలో చాలా మంది ప్రసిద్ధ కళాకారులతో క్యాంపైన్స్ కూడా చేసింది. అయితే ఈ కారు యొక్క చెడు ఇమేజ్ మరియు తక్కువ అమ్మకాల కారణంగా, చివరికి దాన్ని నిలిపివేయాల్సి వచ్చింది.

ఆ కారుకి మూడే చక్రాలు.. అదే దాని వైఫల్యానికి కారణం.. ఇదెక్కడో కాదు మన దేశంలోనే..

సిపాని బాదల్‌ను ఒక 4 సీటర్ కారులా డిజైన్ చేశారు. ఈ కారు లోపల 3-స్పోక్ స్టీరింగ్ వీల్ మినహా ఎలాంటి ఇతర ఫీచర్లు కనిపించవు. కారు ముందు భాగంలో రెండు తలుపులు, వెనుక కూర్చునే వారి కోసం ఒక తలుపు ఉంటుంది. అప్పట్లో స్కూటర్లలో ఉపయోగించే 200సిసి పెట్రోల్ ఇంజన్‌ను ఈ సిపాని బాదల్ త్రీ-వీలర్ కారులో ఉపయోగించారు.

ఆ కారుకి మూడే చక్రాలు.. అదే దాని వైఫల్యానికి కారణం.. ఇదెక్కడో కాదు మన దేశంలోనే..

సిపాని బాదల్‌ను యూకేకి చెందిన రిలయంట్ సంస్థ సహకారంతో రూపొందించినప్పటికీ, దీనిని పూర్తిగా భారతదేశంలో తయారు చేశారు. రిలయంట్ సంస్థ కూడా రాబిన్ పేరుతో ఇలాంటి ఓ కారును తయారు చేసేది. అయితే, సిపాని బాదల్‌తో పోలిస్తే రిలయంట్ రాబిన్ కారు డిజైన్ పూర్తిగా భిన్నంగా ఉండేది. బహుశా అది కూడా ఈ కారు వైఫల్యానికి ఓ కారణం అయి ఉండొచ్చేమో.

Image Courtesy: Talking Cars

Most Read Articles

English summary
History Behind The First Made In India Three Wheeler Car Sipani Badal, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X