మెర్సిడెస్ బెంజ్ పెర్ఫార్మెన్స్ డివిజన్ 'ఏఎమ్‌జి' (AMG) హిస్టరీ

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ అందిస్తున్న కొన్ని మోడళ్లలో 'ఏఎమ్‌జి' (AMG) వెర్షన్స్ అని అందుబాటులోకి ఉంటాయి. రెగ్యులర్ మోడళ్లకు పెర్ఫార్మెన్స్ జోడించిన మోడళ్లే ఈ 'ఏఎమ్‌జి' వెర్షన్స్. సింపుల్‌గా చెప్పాలంటే, ఏఎమ్‌జి బ్రాండ్ కార్లు రెగ్యులర్ మెర్సిడెస్ బెంజ్ కార్ల మరింత స్టయిలిష్‌గా ఉండి, వేగంగా పరుగులు తీసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి బ్రాండ్‌కు సంబంధించి పెద్ద చరిత్రే ఉంది. 1965లో మెర్సిడెస్ బెంజ్ మోటార్‌స్పోర్ట్స్ నుంచి తొలగిపోవాలని నిర్ణయం తీసుకోవటం హాన్స్-వార్నర్ ఆఫ్రెక్ట్, ఎర్‌హార్డ్ మెల్చెర్ అనే ఇద్దరు ఇంజనీర్లను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. దీంతో వారు ఓ 300 ఎస్ఈని ఆక్వైర్ చేసుకొని, కారు ఇంజన్ పవర్‌ను 170 బిహెచ్‌పిల నుంచి 238 బిహెచ్‌పిలకు పెంచే ప్రయత్నం చేశారు.

ఆ ఇంజనీర్ల ప్రయత్నం మంచి ఫలితాలను తెచ్చిపెట్టింది. 1965లోని జర్మన్ టూరింగ్ కార్ ఛాంపియన్‌షిప్‌లో ఆ కారు 10 రేస్‌లలో ఘన విజయాన్ని సాధించింది.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాల కోసం ఈ ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి..!

'ఏఎమ్‌జి' (AMG) హిస్టరీ..

మెర్సిడెస్ బెంజ్ పెర్ఫార్మెన్స్ బ్రాండ్ ఏఎమ్‌జికి సంబంధించిన మరింత సమాచారాన్ని తర్వాతి స్లైడ్‌లలో పరిశీలించండి.

'ఏఎమ్‌జి' (AMG) హిస్టరీ..

ఏఎమ్‌జి బ్రాండ్‌ను 1967లో ఏఎమ్‌జి మోటారెన్‌బావ్ అండ్ ఎన్ట్విక్లుంగ్స్‌గెస్సెల్‌షాఫ్ట్ ఎమ్‌బిహెచ్ (ఏఎమ్‌జి ఇంజన్ ప్రొడక్షన్ అండ్ డెవలప్‌మెంట్ లిమిటెడ్) క్రింద స్టట్‌గార్ట్ సమీపంలోని బర్గ్‌స్టాల్ యాన్ డెర్ ముర్‌లోని ఆల్ఫెర్చ్ వద్ద స్థాపించారు. ఏఎమ్‌జి అంటే ఆఫ్రెక్ట్ మెల్చెర్ అండ్ గ్రోబాస్‌ప్యాచ్ (ఆఫ్రెక్ట్ పుట్టిన నగరం) అని అర్థం.

Picture credit: Flickr

900hp

'ఏఎమ్‌జి' (AMG) హిస్టరీ..

ఏఎమ్‌జి యొక్క తొలి మోటార్‌స్పోర్ట్ మైలురాయిని 1971లో జరిగిన స్పా 24 అవర్స్ వద్ద అధిగమించారు. ఇందులో ఏఎమ్‌జి మెర్సిడెస్ 300 ఎస్ఈఎల్ 6.5 కారు ఈ క్లాస్‌లో కెల్లా విజేతగా నిలిచి, మొత్తమ్మీద ద్వితీయ స్థానాన్ని దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి బ్రాండ్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టిన విజయాల్లో ఇది కీలకమైనది.

Picture credit: Wiki Commons

Silosarg

'ఏఎమ్‌జి' (AMG) హిస్టరీ..

1970 కాలంలో కార్ కస్టమైజేషన్‌కు డిమాండ్ బాగా పెరిగింది, అప్పుడు ఏఎమ్‌జి ఇంజన్లకు అదనంగా కస్టమ్-మేడ్ ఇంటీరియర్లను ఆఫర్ చేసేది. ఆ తర్వాత 1976లో ఏఎమ్‌జి తన 12 మంది సిబ్బందితో పర్సప్-బిల్ట్ వర్క్‌షాప్, ఆఫీస్‌ను ఏర్పాటు చేసింది. 1986లో ఏఎమ్‌జి సరికొత్త 5.0 లీటర్ వి8 పవర్‌ప్లాంట్‌ను ఈ-క్లాస్ కూపే కారులో అమర్చింది. ఈ కారు ఇప్పటి ఐకానిక్ కారుగా నిలిచిపోయింది. దీనిని 'ది హమ్మర్' అని ముద్దుపేరుతో పిలిచేవారు.

Picture credit: Flickr

Kickaffe

'ఏఎమ్‌జి' (AMG) హిస్టరీ..

1980లో డైమ్లర్ బెంజ్ మరియు ఏఎమ్‌జిలు సంయుక్తంగా పనిచేసి, ఏఎమ్‌జిని రేసింగ్ పార్ట్‌నర్‌గా అభివృద్ధి చేశారు. ఈ ఇరు సంస్థల కలయికలో రూపొందిన 190 రేస్‌కార్, 1988-1993 మధ్య కాలంలో మొత్తం 50 డిటిఎమ్ విజయాలను సాధించింది.

Picture credit: Flickr

pilot_michael

'ఏఎమ్‌జి' (AMG) హిస్టరీ..

ఏఎమ్‌జి చరిత్రలో 1990 మరొక మైలురాయిగా చెప్పుకోవచ్చు. ఆ సంవత్సరంలో డైమ్లర్ బెంజ్ ఏజి మరియు ఏఎమ్‌జి సంస్థల మధ్య పరస్పర సహకార ఒప్పందం కుదింరింది. ఆ ఒప్పందం తర్వాత ఏఎమ్‌జి ఉత్పత్తులను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మెర్సిడెస్ బెంజ్ నెట్‌వర్క్ ద్వారా విక్రయించేందుకు మరియు ఉత్పత్తుల డిజైన్‌పై సంయుక్తంగా కలిసి పనిచేసేందుకు అవకాశం ఏర్పడింది.

ఈ సహకార ఒప్పందం నుంచి వచ్చిన తొలి ఉత్పత్తి 276 బిహెచ్‌పి మెర్సిడెస్ బెంజ్ సి63 ఏఎమ్‌జి మోడల్. దీనిని తొలిసారిగా 1993లో విడుదల చేశారు. ఇది అప్పట్లో బిఎమ్‌డబ్ల్యూ ఈ36 ఎమ్‌3 మోడల్‌కి గట్టి పోటీనిచ్చేది. ఆ తర్వాతి కాలంలో మెర్సిడెస్ ఉత్పత్తులను ఆధారంగా చేసుకొని ఏఎమ్‌జి మోడళ్లను విడుదల చేయటం ప్రారంభించారు. అలా పుట్టుకొచ్చిందే ఈ సిఎల్‌కె-జిటిఆర్ సూపర్‌కార్.

Picture credit: Flickr

BrisChri

'ఏఎమ్‌జి' (AMG) హిస్టరీ..

2000వ సంవత్సరం ఆరంభంలో మెర్సిడెస్ మరియు ఏఎమ్‌జి సంస్థలు సూపర్‌చార్జ్డ్ వి8, వి6 ఇంజన్లపై దృష్టి సారించారు. ఆ తర్వాత 2006లో ఏఎమ్‌జి స్వతహాగా అభివృద్ధి చేసిన 6.2 లీటర్ వి8 ఇంజన్‌ను 2006లో వెలుగులోకి తీసుకువచ్చింది. అదే సంవత్సరంలో ఏఎమ్‌జి టర్బోచార్జింగ్‌ను పవర్ గెయిన్స్ కోసం ఉపయోగించనున్నట్లు ప్రకటించింది. అప్పటి నుంచే ఈ ట్రెండ్ ప్రారంభమైంది.

'ఏఎమ్‌జి' (AMG) హిస్టరీ..

ఈరోజు, మెర్సిడెస్-ఏఎమ్‌జి పోర్ట్‌ఫోలియోలో 20కి పైగా మోడళ్లున్నాయి. ఇందులో ప్రతి మోడల్ కూడా ఒక్కో విశిష్టతను కలిగి ఉండి, పెర్ఫార్మెన్స్‌లో బెస్ట్ అనిపించుకుంటుంది. ఇక్కడ వన్ మ్యాన్, వన్ ఇంజన్ అనే ట్రెడిషన్ ఇప్పటికీ అమల్లో ఉంది. అంటే, ఈ పెర్ఫార్మెన్స్ కోసం ఒక ఇంజన్ పూర్తిగా ఒక వ్యక్తి మాత్రమే చేతుల్తో తయారు చేస్తారు. ఇలా తయారు చేసిన వారి పేరును ఇంజన్ నేమ్‌ప్లేట్‌పై ముద్రిస్తారు. బాగుంది కదూ.. ఏఎమ్‌జి హిస్టరీ..!

ఈ కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాతో పంచుకోగలరు.

'ఏఎమ్‌జి' (AMG) హిస్టరీ..

2014 మెర్సిడెస్-ఏఎమ్‌జి పీటర్స్ ఎఫ్1 టీమ్ గురించి చెప్పకుంటే ఈ కథనం పూర్తిగా సంపూర్ణం కాదనే అనాలి. లెవిస్ హామిల్టన్, నికో రోస్‌బర్గ్‌లు డ్రైవర్లుగా వ్యవహరిస్తున్న ఈ బృందం ప్రస్తుత సంవత్సరం ఛాంపియన్‌షిప్‌లో ఇతరుల కన్నా ముందంజలో ఉంది. ఎఫ్1 చరిత్రలో ఇలాంటి విజయాలను ఇదివరకెన్నడూ చూడలేదు, రానురాను ఈ జట్టు మరింత ధృడంగా మారుతోంది.

More from DriveSpark

Article Published On: Thursday, May 22, 2014, 18:04 [IST]
English summary
Just a mention of the acronym "AMG" is enough to send shivers down the chassis of other ‘mortal' automobiles. Mercedes-Benz AMG cars are known to be brutally fast with unabashedly aggressive styling - performance figures usually step into supercar territory. If you thought Mercedes-Benz cars were highly desirable, AMG sport sedans and SUVs take it to the next level.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+