ఈ అంబాసిడర్ కారును చూశారా.. అబ్బా ఎంత అందంగా ఉందో..

భారత ఆటోమొబైల్ చరిత్రలో హిందూస్తాన్ మోటార్స్ వారి అంబాసిడర్ కారుకు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే, కాలంతో పాటుగా కార్ల రూపాలు కూడా మారుతూ వచ్చాయి. దీంతో ఈ క్లాసిక్ కారును ఇష్టపడే వారే కరువయ్యారు. ఫలితంగా, అంబాసిడర్ కారు ప్రజలకు పూర్తిగా దూరమైంది.

ఈ అంబాసిడర్ కారును చూశారా.. అబ్బా ఎంత అందంగా ఉందో..

గత 1965లో అమ్మకానికి వచ్చిన హిందుస్థాన్ అంబాసిడర్ కారును ఒకప్పుడు దేశాధినేతలు కూడా అత్యధికంగా ఉపయోగించేవారు. టాక్సీ వాలాలకు అయితే, ఇప్పటికీ ఇది అత్యంత ఫేవరేట్ కారుగా ఉంటుంది. సౌకర్యవంతమైన సీటింగ్, విశాలమైన బూట్ స్పేస్‌తో ఈ కారు అందరి మన్ననలు పొందంది.

ఈ అంబాసిడర్ కారును చూశారా.. అబ్బా ఎంత అందంగా ఉందో..

అయితే, ఇప్పటికీ ఈ కారును అభిమానించే వారు, దానిని ఎంతో జాగ్రత్తగా చూసుకునే వారు కూడా ఉన్నారు. వారిలో ఒకరు కేరళకు చెందిన జినిల్ జాన్సన్. ఇతవి వద్ద హిందుస్థాన్ అంబాసిడర్ ఎమ్‌కే 2 మోడల్ కారు ఉంది. దీనిని ఆయన సెకండ్ హ్యాండ్ కారుగా కొనుగోలు చేశారు.

ఈ అంబాసిడర్ కారును చూశారా.. అబ్బా ఎంత అందంగా ఉందో..

జాన్సన్ అప్పటి కారును పూర్తిగా రీపెయింట్ చేయించి, క్రోమ్ గార్నిష్‌లతో అదనపు యాక్ససరీలతో సరికొత్త మోడల్‌గా తీర్చిదిద్దారు. నీలం రంగులో పెయింట్ చేయబడిన ఈ అంబాసిడర్ కారులో ఫ్రంట్ బంపర్ నుండి రియర్ బంపర్ వరకూ పూర్తిగా కొత్తదానిలా అనిపిస్తుంది.

ఈ అంబాసిడర్ కారును చూశారా.. అబ్బా ఎంత అందంగా ఉందో..

జినిల్ జాన్సన్ మోడిఫై చేయించుకున్న ఈ అంబాసిడర్ కారులో ఫ్రంట్ బంపర్ గార్డ్‌పై అదనపు హెడ్‌లైట్స్ మరియు నాలుగు హారన్స్ కూడా కనిపిస్తాయి. కుడిచేతి వైపు ఫ్లాగ్స్‌ను ఉంచేందుకు వీలుగా ఫ్లాగ్ హోల్డర్ రాడ్, కారు అంతటా క్రోమ్ గార్నిష్, క్రోమ్ సైడ్ మిర్రర్స్, ఫ్రంట్ విండ్‌షీల్డ్ స్పాయిలర్ మరియు సైడ్ మిర్రర్స్‌పై వైజర్స్ ఇందులో కనిపిస్తాయి.

ఈ అంబాసిడర్ కారును చూశారా.. అబ్బా ఎంత అందంగా ఉందో..

ఫ్రంట్ హెడ్‌లైట్స్ మరియు సైడ్ ఇండికేటర్స్‌పై కూడా క్రోమ్ గార్నిష్ కనిపిస్తుంది. ఇందులో ఫాగ్ ల్యాంప్స్ లేవు, కాబట్టి వాటి స్థానంలో జాన్సస్ అదనపు లైట్లను ఫ్రంట్ బంపర్‌పై అమర్చారు. ఇక సైడ్ వీల్స్‌ని గమనిస్తే, వీటిని వైట్ అండ్ బ్లూ కలర్‌లో బాడీ కలర్‌కు మ్యాచ్ అయ్యేలా పెయింట్ చేశారు. అన్ని చక్రాలపై క్రోమ్ క్యాప్స్ కనిపిస్తాయి.

ఈ అంబాసిడర్ కారును చూశారా.. అబ్బా ఎంత అందంగా ఉందో..

కారు లోపల డ్యాష్‌బోర్డులో ఎలాంటి మార్పులు చేయలేదని తెలుస్తోంది. పాత కాలపు అంబాసిడర్ కార్లలో కనిపించినట్లుగానే ఇందులో గుండ్రటి డయల్స్, డ్యాష్ బోర్డ్ మధ్యలో ఉంచిన ఇగ్నిషన్ కీ మరియు దానికి ఇరువైపులా స్విచ్ కంట్రోల్స్, సన్నటి మరియు వెడల్పాటి స్టీరింగ్ వీల్ మొదలైవి ఉన్నాయి.

ఈ అంబాసిడర్ కారును చూశారా.. అబ్బా ఎంత అందంగా ఉందో..

ఇందులోని సీట్లను బ్రౌన్ కలర్ లెథర్ అప్‌హోలెస్ట్రీతో రీడిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది. కారు లోపలివైపు పైకప్పును వెల్వెట్ ఫ్యాబ్రిక్ మెటీరియల్‌తో కస్టమైజ్ చేసినట్లుగా ఉంది. ఇక ఈ కారు ఇంజన్‌లో కూడా ఎలాంటి మార్పులు చేసినట్లు లేదు. అయితే, ఇందులో బానెట్ క్రింద్ కొత్త హారన్ సిస్టమ్ అమర్చినట్లు తెలుస్తోంది.

ఈ అంబాసిడర్ కారును చూశారా.. అబ్బా ఎంత అందంగా ఉందో..

ఇందులో అదే పాత 1.5 లీటర్, నేచురల్లీ ఆస్పిరేటెడ్, ఇన్‌లైన్-4, కార్బోరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించినట్లు సమాచారం. ఈ ఇంజన్‌కు 4-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 55 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ శక్తి వెనుక చక్రాలకు పంపిణీ అవుతుంది.

Most Read Articles

English summary
Modified HM Ambassador In Blue Color Looks Stunning, Details. Read In Telugu.
Story first published: Sunday, February 14, 2021, 9:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X