ఎంజీ గ్లోస్టర్ కొనుగోలుచేసిన హాకీ లెజండ్ ధన్‌రాజ్ పిళ్లై; వివరాలు

భారత హాకీ చరిత్రలో ప్రసిద్ధి చెందిన ప్రముఖ ఆటగాళ్లలో ఒకరు ధన్‌రాజ్ పిళ్లై. ఇతడు1989లో జరిగిన ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌తో భారత జట్టులో అడుగుపెట్టాడు. ఇండియా టీమ్ లో అడుగుపెట్టినప్పటి నుంచి మంచి ఫార్వర్డ్ మరియు అటాకింగ్ ప్లేయర్‌గా గుర్తింపు పొందిన పిళ్లై చైనాపై తొలి ఇంటర్నేషల్ మ్యాచ్‌ ఆడాడు. 2003 ఆసియా కప్ హాకీ ధన్‌రాజ్ పిళ్లై సారథ్యంలోని భారత జట్టు విజయం సాధించింది.

ఎంజీ గ్లోస్టర్ కొనుగోలుచేసిన హాకీ లెజండ్ ధన్‌రాజ్ పిళ్లై; వివరాలు

ధన్‌రాజ్ పిళ్ళై 1999-2000 సంవత్సరానికి భారతదేశ అత్యున్నత క్రీడా పురస్కారమైన రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న అవార్డును, మరియు 2000 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డును అందుకున్నాడు. భారతదేశానికి ఇంతటి ఘన కీర్తి తెచ్చిన పిళ్ళై తన పుట్టిన రోజు (16 జులై) సందర్భంగా ఎంజి గ్లోస్టర్ ఎస్‌యూవీని కొనుగోలు చేశారు.

ఎంజీ గ్లోస్టర్ కొనుగోలుచేసిన హాకీ లెజండ్ ధన్‌రాజ్ పిళ్లై; వివరాలు

ధన్‌రాజ్ పిళ్ళై కొనుగోలు చేసిన కొత్త ఎంజి గ్లోస్టర్ ఎస్‌యూవీతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో అతడు విలాసవంతమైన రెడ్ కలర్ ఎంజి గ్లోస్టర్ కారుతో కనిపిస్తాడు. పిళ్ళై ఎంజి యొక్క ముంబై షోరూమ్ నుండి కారు డెలివరీ తీసుకున్నాడు.

ఎంజీ గ్లోస్టర్ కొనుగోలుచేసిన హాకీ లెజండ్ ధన్‌రాజ్ పిళ్లై; వివరాలు

ఎంజి గ్లోస్టర్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 8 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, కూల్ అండ్ హీటెడ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, ఐస్‌మార్ట్ టెక్నాలజీ 2.0 వంటి ఫీచర్లు ఇవ్వబడ్డాయి. అంతే కాకుండా 3 డి మ్యాపింగ్, వాయిస్ సెర్చ్ మరియు యాంటీ-తెఫ్ట్ ఇమ్మొబిలైజేషన్ సిస్టమ్ కొత్త ఐస్మార్ట్ టెక్నాలజీతో ఇవ్వబడ్డాయి.

ఎంజీ గ్లోస్టర్ కొనుగోలుచేసిన హాకీ లెజండ్ ధన్‌రాజ్ పిళ్లై; వివరాలు

ఎంజి గ్లోస్టర్ లోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో లేటెస్ట్ డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్, ఆటో పార్క్ అసిస్ట్ ఫీచర్, ఫ్రంట్ కొలీషియన్ వార్ణింగ్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, లేన్ డిపార్చర్ వార్ణింగ్, ఆటోమేటిక్ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, టెర్రైన్ మోడ్ విత్ రోల్ ఓవర్ మిటిగేషన్ ఉంటాయి.

ఎంజీ గ్లోస్టర్ కొనుగోలుచేసిన హాకీ లెజండ్ ధన్‌రాజ్ పిళ్లై; వివరాలు

ఎంజి గ్లోస్టర్ నాలుగు డ్రైవింగ్ మోడ్స్ కలిగి ఉంటుంది. అవి రాక్, సాండ్, మడ్ మరియు స్నో మోడ్స్. ఇవి వివిధ రకాల రోడ్లపై ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. ఇంటీరియర్‌కు ప్రీమియం లుక్ ఇవ్వడానికి, బ్లాక్ అపోల్స్ట్రేతో కాంట్రాస్ట్ వైట్ స్టిచింగ్, లెదర్ సీట్ ఇవ్వబడింది.

ఎంజీ గ్లోస్టర్ కొనుగోలుచేసిన హాకీ లెజండ్ ధన్‌రాజ్ పిళ్లై; వివరాలు

ఎంజి గ్లోస్టర్ 2.0 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ తో పనిచేస్తుంది, ఇది 215 బిహెచ్‌పి పవర్ మరియు 480 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లో మాత్రమే అందుబాటులో ఉంచబడింది. దీనికి 4 ఎక్స్ 4 డ్రైవ్ సిస్టమ్ లభిస్తుంది. ఈ ఎస్‌యూవీ టయోటా ఫార్చ్యూనర్, ఫోర్డ్ ఎండీవర్, మహీంద్రా అల్టురాస్‌ల వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Dhanraj Pillay Ggifts Himself A MG Gloster On His Birthday. Read in Telugu.
Story first published: Friday, July 16, 2021, 18:16 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X