కారు, బైక్ ఉందా? మీ కోసమే ఈ ఆర్టికల్.. లైట్ తీసుకుంటే అంతే సంగతి! ముందే సిద్ధం అవ్వండి!

భారతదేశం అంటే పండుగల పర్వదినాల దేశం. సంస్కృతి, సంప్రదాయాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ప్రతి పండుగను ఘనంగా, ఆనందంగా జరుపుకోవడం భారతీయుల ప్రత్యేకత. అలాంటి ప్రధాన పండుగల్లో ఒకటి హోలీ (Holi). రంగుల పండుగగా ప్రసిద్ధి చెందిన ఈ వేడుకలో చిన్నా పెద్దా, ఆడ మగ అనే తేడా లేకుండా అందరూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా పాల్గొంటారు. వీధులు, కాలనీలు, అపార్ట్‌మెంట్లు అన్నిచోట్లా నవ్వులు, రంగులు, సంబరాల వాతావరణం కనిపిస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు మొదలయ్యాయి. అయితే ఈ ఆనంద వేడుకల మధ్య వాహనాదారులు ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోవద్దు. రంగుల పండుగలో కార్లు, బైకులు కూడా రంగుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ముఖ్యంగా రసాయనాలు కలిగిన రంగుల పొడి లేదా నీటితో కలిపిన రంగులు వాహనాల పెయింట్‌పై పడితే మచ్చలు పడే ప్రమాదం ఉంది. కొన్ని సందర్భాల్లో అవి పెయింట్ పొరను దెబ్బతీసి వాహనం అందాన్ని తగ్గించవచ్చు. కేవలం పెయింట్ మాత్రమే కాదు, బైక్‌ల మెటల్ భాగాలు, ప్లాస్టిక్ ప్యానెల్స్, రబ్బర్ పార్ట్స్ కూడా ప్రభావితమవుతాయి. వాహనం మీద రంగులు ఎక్కువసేపు ఉండిపోతే అవి గట్టిపడి శుభ్రం చేయడం కష్టమవుతుంది.

Holi Special Tips To Keep Your Car And Bike Safe From Colours Details

దీనివల్ల స్క్రాచ్‌లు పడే అవకాశం కూడా ఉంటుంది. అందుకే వాహనాదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. హోలీ రోజుల్లో వీలైనంత వరకు వాహనాలను కవర్‌తో కప్పడం, షేడ్ లేదా గ్యారేజ్‌లో పార్క్ చేయడం మంచిది. బయట పార్క్ చేయాల్సి వచ్చినా, ముందుగా కార్ లేదా బైక్‌పై వాక్స్ పాలిష్ చేయడం వల్ల రంగులు సులభంగా తొలగించవచ్చు. అలాగే పండుగ ముగిసిన వెంటనే శుభ్రమైన నీటితో వాహనాన్ని కడగడం మంచిది.

ఎక్కువసేపు వేచి ఉంటే రంగులు గట్టిపడి పెయింట్‌కు హాని కలిగించే అవకాశం ఉంటుంది. పండుగ ఆనందం అందరికీ అవసరమే. కానీ ఆనందం కారణంగా మన వాహనాలకు నష్టం కలగకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. హోలీ సమయంలో బయటకు వెళ్లాల్సిన అవసరం ఉంటే వాహనం ఎంపిక విషయంలో కాస్త జాగ్రత్తగా ఆలోచించడం మంచిది. ఈ సమయంలో సాధ్యమైనంత వరకు బైక్ లేదా స్కూటర్ వంటి టూవీలర్ వాహనాన్ని వాడటం ఉత్తమం.

Holi Special Tips To Keep Your Car And Bike Safe From Colours Details

ముఖ్యంగా స్కూటర్ ఉంటే అది మరింత అనుకూలంగా ఉంటుంది. కార్లపై రంగుల పొడి, కెమికల్ కలర్స్ పడితే పెయింట్‌పై మచ్చలు పడే అవకాశం ఎక్కువ. కొన్ని రంగులు పెయింట్ కోటింగ్‌ను దెబ్బతీయగలవు కూడా. అలాంటి పరిస్థితుల్లో కారును కాపాడుకోవడం కాస్త కష్టమే. అదే సమయంలో స్కూటర్ లేదా బైక్ అయితే చిన్న వాహనం కావడం వల్ల రద్దీ ప్రాంతాల్లో సులభంగా నడిపించవచ్చు.

హోలీ సమయంలో కారు భద్రతలో అత్యంత ముఖ్యమైన విషయం విండోస్‌ను సరిగ్గా మూసి ఉంచడం. ముఖ్యంగా మీ కారును బయట పార్క్ చేసినప్పుడు గానీ, రోడ్డుపై డ్రైవ్ చేస్తున్నప్పుడు గానీ విండోస్ పూర్తిగా మూసి ఉన్నాయా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోవడం తప్పనిసరి. చిన్న నిర్లక్ష్యం వల్లే రంగులు కారు లోపలికి చేరే ప్రమాదం ఉంటుంది. హోలీ రోజుల్లో గాలిలోనే రంగుల పొడి ఎగిరిపోతూ ఉంటుంది.

కొన్ని చోట్ల నీటితో కలిపిన రంగులు చల్లుతుంటారు. విండోస్ ఓపెన్‌గా ఉంటే రంగులు సీట్లు, డ్యాష్‌బోర్డ్, డోర్ ప్యానెల్స్‌పై పడే అవకాశం ఉంది. ఒకసారి లోపల మచ్చలు పడితే వాటిని పూర్తిగా తొలగించడం కష్టమవుతుంది. ముఖ్యంగా ఫ్యాబ్రిక్ సీట్లు ఉన్న కార్లలో రంగు మచ్చలు త్వరగా పడిపోతాయి. అందుకే విండోస్ మాత్రమే కాదు, అవసరమైతే సన్‌రూఫ్ పూర్తిగా మూసి ఉంచడం మంచిది. ఇవే కాకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

More from DriveSpark

Article Published On: Monday, March 2, 2026, 10:47 [IST]
English summary
Holi special tips to keep your car and bike safe from colours details
Read more on: #tips #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+