చిన్న తప్పు ఎంత ప్రమాదాన్ని కలిగించిందో!.. వీడియో చూడండి

భారతదేశంలో సంతోషంగా జరుపుకునే పండుగలలో ఒకటి హోలీ. అయితే కొందరు ఆకతాయిలు చేసే పని వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఇటీవల జరిగిన హోలీ పండుగ సందర్భంగా వాటర్ బెలూన్ వల్ల ఆటో రిక్షా బోల్తా పడింది. మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో గమనించినట్లయితే.. రోడ్డు మీద వేగంగా వెళ్తున్న ఆటో రిక్షా మీదకి.. రోడ్డుపక్కన నిలబడి ఉన్న వారిలో ఒకరు వాటర్ బెలూన్ విసిరాడు. వేగంగా వెళ్తున్న ఆటో రిక్షాకు బెలూన్ తగలటం వల్ల బోల్తా పడింది. నిజానికి ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగినట్లు తెలుస్తోంది. దీన్ని క్రైమ్ రిపోర్ట్ ఇండియా తన ఎక్స్(ట్విటర్) ఖాతా ద్వారా షేర్ చేసింది.

Holi Water Balloon Impact Crashes Speeding Auto

నిజానికి ఇది చాలా రోజులకు ముందు జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఆటో బోల్తా పడిన సమయంలో.. అందులో జనాభా చాలామంది (ఓవర్ లోడ్) ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆటో డ్రైవర్ ప్రజలను హొలీ సందర్భంగా ఒక చోటు నుంచి, మరో చోటుకి తీసుకెళ్తున్నాడా.. లేకుండా వారందరూ అతని స్నేహితులా, కుటుంబ సభ్యులా అనేది తెలియదు. మొత్తానికి చాలామంది ఆటోలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఒక వాహనం ఓవర్ లోడ్ అయినప్పుడు దాన్ని అకస్మాత్తుగా కంట్రోల్ చేయడం చాలా కష్టం. వాటర్ బెలూన్ ఆటో రిక్షాలో నేరుగా ఎవరికీ తగిలింది అనేది స్పష్టంగా తెలియదు. బహుశా అది డ్రైవర్‌కు తగిలి ఉంటుందని తెలుస్తోంది. అందుకే అతడు ఆటోను కంట్రోల్ చేయలేకపోయాడని తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా? లేదా అనేది కూడా స్పష్టంగా తెలియడం లేదు.

Holi Water Balloon Impact Crashes Speeding Auto

ఆటో కిందికి పడిన వెంటనే.. ఆటో మీదికి వాటర్ బెలూన్ విసిరిన వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నించడం ఇక్కడ చూడవచ్చు. బహుశా అతడు పారిపోయి ఉంటాడని తెలుస్తోంది. ఈ ఘటనను స్థానిక పోలీసులు గమనించారా? ఈ ప్రమాదానికి కారణమైన వారి మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా అనే విషయాలు కూడా స్పష్టంగా వెలుగులోకి రాలేదు. అయితే పోలీసులు తప్పకుండా వారిపైన చర్యలు తీసుకుని ఉంటారనే భావిస్తున్నాము.

పండుగలు సంతోషంగా ఉండటానికి జరుపుకుంటారు. కానీ ఇలాంటి సంఘటనలు జరిగితే విషాద ఛాయలు అలుముకుంటాయి. హోలీ బంధువు, స్నేహితులతో కలిసి రంగులు పోసుకోవడం ఆనవాయితీ. అయితే రోడ్డు పక్కన నిలబడి, రోడ్డుపై వెళ్లే ప్రయాణికులను ఇబ్బంది పెట్టడం అనేది ఏ మాత్రం కరెక్ట్ కాదు. అలంటి వారిపైన తప్పకుండా పోలీసులు చర్య తీసుకోవాలి. లేకుంటే ఇలాంటి ఆగడాలు మరీ ఎక్కువయిపోతాయి.

ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో వైరల్ అయిన మరో రెండు వీడియోలలో అమ్మాయిలు హోలీ వేల రొమాన్స్ చేసుకోవడం కనిపిస్తుంది. ఒక వ్యక్తి స్కూటీ రైడ్ చేస్తూ ఉంటే వెనుక కూర్చున్న ఇద్దరమ్మాయిలు రంగులు పూసుకుని రొమాన్స్ చేసుకున్నారు. మరో వీడియోలో ఇద్దరమ్మాయిలో మెట్రో ట్రైన్‌లో రంగులు పూసుకుంటూ.. చుట్టూ జనాభా ఉన్నారనే ద్యాస కూడా లేకుండా బరితెగించారు.

ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతున్నాయి. నెటిజన్లు కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. కదులుతున్న స్కూటర్‌పై రొమాన్స్ చేసుకున్న అమ్మాయిలకు నోయిడా ట్రాఫిక్ పోలీసులు రూ. 33000 జరిమానా విధించారు. నిజానికి ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువయిపోతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడానికి కొందరు కనీస జ్ఞానం కోల్పోయి ప్రవరిస్తున్నారా అనే అనుమానం కూడా కలుగుతుంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Wednesday, March 27, 2024, 12:39 [IST]
English summary
Holi water balloon impact crashes auto on uttar pradesh road video
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+