అభిమానికి తన జీవితంలో మర్చిపోలేని బహుమతి ఇచ్చిన 'ది రాక్'.. అదేంటో చూడండి..!

ప్రముఖ హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్‌ (Dwayne Johnson) గురించి సినీ ప్రియులకి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అభిమానులంతా ముద్దుగా 'ది రాక్' అని పిలుచుకునే డ్వేన్ జాన్సన్ , ఒకప్పుడు WWEలో రెజ్లర్‌గా ఉండేవాడు, ఇప్పుడు హాలీవుడ్ పరిశ్రమలో ఓ ప్రముఖ నటుడిగా అనేక చిత్రాలలో పనిచేశాడు. డ్వేన్ జాన్సన్ కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు ఉన్నట్లే, అతని గ్యారేజ్‌లో కూడా ఎన్నో అద్భుతమైన కార్లు ఉన్నాయి.

అభిమానికి తన జీవితంలో మర్చిపోలేని బహుమతి ఇచ్చిన 'ది రాక్'.. అదేంటో చూడండి..!

డ్వేన్ జాన్సన్ కార్ కలెక్షన్ లో సాధారణ కార్ల నుంచి ప్రత్యేకంగా కస్టమైజ్ చేసిన వాహనాల వరకూ చాలానే ఉన్నాయి. వాటిలో కొన్ని ఫారిన్ కార్లు కూడా ఉన్నాయి. తాజాగా, డ్వేన్ జాన్సన్ తాను ఎంతో ఇష్టపడి తయారు చేయించుకున్న ఓ కారును తన అపర అభిమాని అయిన ఆస్కార్ రోడ్రిగేజ్ (Oscar Rodriguez) కి బహుమతిగా ఇచ్చి, అతడిని భావోద్వేగానికి గురయ్యేలా చేశాడు. ఆస్కార్ రోడ్రిగేజ్ లాస్ ఏంజిల్స్‌లో నివసిస్తున్న ఓ నేవీ వెటరన్ మరియు 'ది రాక్'కు వీరాభిమాని.

అభిమానికి తన జీవితంలో మర్చిపోలేని బహుమతి ఇచ్చిన 'ది రాక్'.. అదేంటో చూడండి..!

ఆస్కార్ రోడ్రిగేజ్ పర్సనల్ ట్రైనర్ గా పనిచేస్తుంటాడు, ఓ స్థానిక చర్చిలో లీడర్ గా ఉంటున్నాడు. అంతేకాదు, గృహ హింస వలన బాధింపబడిన మహిళలకు అండగా ఉంటున్నాడు, వారికి భోజన సదుపాయాలు కల్పిస్తున్నాడు. వీటన్నింటితో పాటుగా తమ 75 ఏళ్ల తల్లిని కూడా చూసుకుంటున్నాడు. ఇంతటి ప్రత్యేక లక్షణాలే ఆస్కార్ రోడ్రిగేజ్‌ను డ్వేన్ జాన్సన్ దృష్టికి తీసుకువచ్చాయి. అందుకే, తాను నిత్యం డ్రైవ్ చేసే ప్రత్యేకమైన మరియు వ్యక్తిగత ఫోర్డ్ ఎఫ్150 రాప్టర్ పికప్ ట్రక్కును అతనికి బహుమతిగా ఇచ్చి సర్‌ప్రైజ్ చేశాడు.

అభిమానికి తన జీవితంలో మర్చిపోలేని బహుమతి ఇచ్చిన 'ది రాక్'.. అదేంటో చూడండి..!

ఇందుకు సంబంధించిన ఓ వీడియోని డ్వేన్ జాన్సన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అభిమానాలతో పంచుకున్నారు. డ్వేన్ జాన్సన్ ఔదర్యానికి నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. డ్వేన్ జాన్సన్ నటించిన రెడ్ నోటీస్ అనే చిత్రం ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శించబడుతోంది. అమెరికాలోని ఓ థియేటర్లో ఈ సినిమా ప్రదర్శిస్తున్న సమయంలో డ్వేన్ జాన్సన్ హఠాత్తుగా థియేటర్లో ప్రత్యక్షమై, వేదికపైకి ఆస్కార్ రోడ్రిగేజ్ ను ఆహ్వానించి, అతడి సేవల గురించి అభిమానులతో పంచుకున్నాడు.

అభిమానికి తన జీవితంలో మర్చిపోలేని బహుమతి ఇచ్చిన 'ది రాక్'.. అదేంటో చూడండి..!

ఆ తర్వాత తన ముద్దుల కారును ఆస్కార్ కి బహుమతిగా ఇవ్వడం, ఆస్కార్ ఒక్కసారిగా షాక్ గురై భావోద్వేగానికి లోనయ్యాడు. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఫోర్డ్ కంపెనీ సీఈఓ జిమ్ ఫార్లీ ఈ కూడా వీడియో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ డ్వేన్ జాన్సన్ ను మెచ్చుకున్నారు. నిజానికి డ్వేన్ జాన్సన్ రెడ్ నోటీస్ చిత్రంలో తాను డ్రైవ్ చేసిన పోర్ష్ టైకాన్‌ని కారును ఆస్కార్ రోడ్రిగేజ్ కు కానుకగా ఇవ్వాలనుకున్నాడు.

ఇందుకోసం డ్వేన్ జాన్సన్ పోర్ష్ కంపెనీని కూడా ఆశ్రయించాడు, అయితే దీనికి పోర్ష్ కంపెనీ ఓప్పుకోలేదు. దీంతో నిరాశతో వెనుదిరిగిన డ్వేన్ జాన్సన్, తన స్వంత ఫోర్డ్ ఎఫ్150 రాప్టర్ పికప్ ట్రక్కును ఆస్కార్ కు బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ప్రేక్షకులలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి తాను వీలైనంత ఎక్కువ సమాచారాన్ని సేకరించానని, చివరికి ఆస్కార్ కథ తనని ఎంతగానో కదిలించిందని డ్వేన్ జాన్సన్ తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.

అభిమానికి తన జీవితంలో మర్చిపోలేని బహుమతి ఇచ్చిన 'ది రాక్'.. అదేంటో చూడండి..!

ఆస్కార్ రోడ్రిగేజ్ తన 75 ఏళ్ల తల్లిని చూసుకుంటున్నాడు, వ్యక్తిగత శిక్షకుడు, చర్చిలో నాయకుడు, గృహ హింసకు గురైన మహిళలకు మద్దతు మరియు భోజనాన్ని అందిస్తున్నాడు, గర్వించదగిన మరియు వినయపూర్వకమైన నేవీ అనుభవజ్ఞుడు మరియు దయగల మానవుడు అంటూ అతడిని డ్వేన్ జాన్సన్ ప్రశంసలతో ముంచెత్తాడు. అంతేకాడు, దేశానికి ఆస్కార్ రోడ్రిగేజ్ లాంటి వ్యక్తుల అవసరం చాలా ఉందని ఈ సందర్భంగా రాక్ చెప్పుకొచ్చాడు.

అభిమానికి తన జీవితంలో మర్చిపోలేని బహుమతి ఇచ్చిన 'ది రాక్'.. అదేంటో చూడండి..!

అమెరికన్ మార్కెట్లో ఫోర్డ్ పికప్ ట్రక్కులకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది, అందులోనూ ఫోర్డ్ ఎఫ్-150 పికప్ ట్రక్ అంటే మాములు క్రేజ్ కాదు. ఇది అమెరికాలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న నెంబర్ వన్ పికప్ ట్రక్కు. కంపెనీ ఇందులో ఇటీవలే ఓ పూర్తి ఎలక్ట్రిక్ వెర్షన్ ను కూడా ఆవిష్కరించింది. ఇది ఈ విభాగలో టెస్లా సైబర్ ట్రక్కుకి పోటీగా ఉంటుంది. ఫోర్డ్ ఎఫ్150 విషయానికి వస్తే, ఇది మూడు వేరియంట్‌లలో విక్రయించబడుతోంది. వీటిలో రెగ్యులా పిక్-అప్, సూపర్‌క్రూ మరియు సూపర్‌క్యాబ్ వేరియంట్లు ఉన్నాయి.

అభిమానికి తన జీవితంలో మర్చిపోలేని బహుమతి ఇచ్చిన 'ది రాక్'.. అదేంటో చూడండి..!

యూస్ మార్కెట్లో ఫోర్డ్ ఎఫ్-150 ప్రారంభ ధర 29,290 డాలర్లు, ఇది న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్, డీజిల్ ఇంజన్ మరియు టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌తో సహా వివిధ రకాల ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఈ ఇంజన్ ఆప్షన్లలో ఒకటి గరిష్టంగా 285 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేసే 3.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. డ్వేన్ జాన్సన్ ఒకరికి ఇలాంటి బహుమతి ఇవ్వడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో డ్వేన్ తన మామయ్యకు మరో ఫోర్డ్ ఎఫ్-150 ట్రక్కుని బహుమతిగా ఇచ్చాడు. అలాగే, 2018 లో డ్వేన్ తన తల్లికి క్రిస్మస్ కానుకగా ఒక ఇంటిని బహుమతిగా ఇచ్చాడు. ది రాక్ అతని కుటుంబానికి సహాయకురాలిగా ఉంటున్న ఎస్పెరాన్జాకు ఫోర్డ్ ఎడ్జ్‌ను బహుమతిగా ఇచ్చాడు.

Most Read Articles

English summary
Hollywood actor dwayne johnson gifts his custom built ford f 150 raptor to his best fan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X