గంటకు 209 కి.మీ. వేగంతో పరుగులు తీసే ట్రాక్టర్
సాధారణంగా సాంప్రదాయం ట్రాక్టర్లు గరిష్టంగా గంటకు 60 కిలోమీటర్లు మహా అయితే 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. (వీటిపై అంతకు మించిన వేగంతో ప్రయాణిస్తే, ప్రాణాలను గాలిలో పెట్టినట్లే అవుతుంది). కానీ మీరెప్పుడు గంటకు 209 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ట్రాక్టర్ గురించి విన్నారా..?
టాప్ గేర్ యూకే వాళ్లు ఒకానొక సందర్భంలో అత్యంత వేగంగా వెళ్లే లాన్ మోవర్‌ను డ్రైవ్ చేయాలని తలంచారు. ఆ తలంపు వచ్చిన తక్షణమే వారు హోండాను ఆశ్రయించారు. దీంతో హోండా వారిని తమ టూరింగ్ కార్ ఛాంపియన్‌షిప్ పార్‌నర్స్ వద్దకు వెళ్లమని సూచించింది. ఈ విధంగా పుట్టుకొచ్చిందే ఈ హోండా లాన్ మోవర్.
ఇది దాదాపు ఓ మీడియం సూపర్ కారు వేగంతో ప్రయాణించే ఓ సూపర్ ట్రాక్టర్. అంతేకాదండోయ్.. ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు తీసే లాన్ మోవర్‌గా కూడా రికార్డు దక్కించుకుంది. నిజం చెప్పాలంటే, ఇది కొన్ని రకాల ఫెరారీ, పోర్షే వంటి స్పోర్ట్స్ కార్లను సైతం ఓవర్‌టేక్ చేయగలదు. మరి ఈ ఫాస్టెస్ట్ ట్రాక్టర్ విశేషాంలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

పేరు
దీని పూర్తి పేరు హోండా మీన్ మోవర్ (Honda Mean Mower). దీనిని స్టాండర్డ్ హోండా హెచ్ఎఫ్2620 లాన్ మోవర్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని డిజైన్ చేశారు.

తయారీ
టీమ్ డైనమిక్స్, హోండాకు చెందిన బ్రిటీష్ టూరింగ్ కార్ ఛాంపియన్‌షిప్‌లు భాగస్వామ్యంగా ఏర్పడి హోండా మీన్ మోవర్‌ను సృష్టించారు. హోండా మీన్ మోవర్‌ను తేలికగా ఉంచేందుకు దీని తయారీలో ప్లాస్టిక్ బాడీ ప్యానెల్స్‌ను ఉపయోగించారు.

ఇంజన్
హోండా మీన్ మోవర్‌లో ఉపయోగించిన ఇంజన్‌ను హోండా విటిఆర్ ఫైర్‌స్టోర్మ్ స్పోర్ట్స్ బైక్ నుంచి గ్రహించారు.

పవర్, టార్క్, ట్రాన్సిమిషన్
ఇందులో ఉపయోగించిన 100సీసీ ఇంజన్ గరిష్టంగా 109 హార్స్ పవర్‌ల శక్తిని, 96 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని పవర్ టూ వెయిట్ (పిటిడబ్ల్యూ) రేషియో ప్రతి టన్నుకు 520 హార్స్ పవర్లు. ఈ ఇంజన్ 6-స్పీడ్ పెడల్ షిఫ్ట్ గేర్‌బాక్సుతో జతచేయబడి ఉంటుంది.

పెర్ఫామెన్స్
హోండా మీన్ మోవర్ కేవలం 4 సెకండ్లలో 0-60 మైళ్ల (96 కి.మీ) వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 2069 కిలోమీటర్లు.

శబ్ధం
హోండా మీన్ మోవర్ చెవులు చిల్లులుపడేలా శబ్ధం చేస్తుంది. డెసిపబల్ మీటర్‌పై దీని శబ్ధ తీవ్రత 130డిబి లుగా నమోదైంది.

ఆల్ టెర్రైన్ వెహికల్
సింపుల్‌గా చెప్పాలంటే హోండా మీన్ మోవర్ ఏటివి (ఆల్ టెర్రైన్ వెహికల్) మాదిరిగా ఉంటుంది. అయితే, దీనికి క్రిందివైపు గడ్డి కత్తిరించే యంత్రాలు ఉంటాయి. ఇందులో ఉపయోగించిన సస్పెన్షన్, చక్రాలను ఏటివిల నుంచి గ్రహించారు.

ఇందులో ఉపయోగించిన స్టీరింగ్ ర్యాక్‌ను మోరిస్ మైనర్ (ఇండియన్ వెర్షన్ హిందుస్థాన్ మోటార్స్ అంబాసిడర్ లాంటింది) కారును గ్రహించారు.

లాన్‌లో గడ్డిని కట్ చేయటం కోసం దీనికి క్రింది భాగంలో రెండు బ్లేడ్లు ఉంటాయి. ఇవి రెండు ఎలక్ట్రిక్ మోటార్ల సాయంతో పనిచేస్తాయి. గంటకు 24 కి.మీ. వేగం వద్ద కూడా ఇవి గడ్డిని కత్తిరించగలవు. రెగ్యులర్ లాన్ గ్రాస్ కట్టర్ యంత్రాల వేగం కన్నా ఇది రెండు రెట్లు అధికం.
వీడియో
మరి హోండా మీన్ మోవర్ వేగాన్ని ఈ వీడియోలో వీక్షించండి.


Click it and Unblock the Notifications








