స్మార్ట్‌ఫోన్‌ చూస్తూ డ్రైవింగ్‌.. కారును ఢీకొట్టిన రైడర్‌.. డ్యాష్‌క్యామ్ వీడియో వైరల్‌!

ప్రస్తుతం చాలా మంది ఫోన్లు మాట్లాడుతూ, వినియోగిస్తూ రోడ్లపై ఇష్టారీతిన డ్రైవింగ్‌ చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. భారత్‌లో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా ఉంటోంది. ఇందుకు అతివేగం సహా నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ కూడా కారణం. రోడ్లపై డ్రైవింగ్‌ సమయంలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించినా మూల్యం చెల్లించుకోక తప్పదు.

ఇలాంటి డ్రైవింగ్‌ ఎప్పుడూ ప్రమాదం: నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో తాజాగా ఓ ఘటన ఉదాహరణగా నిలిచింది. ఫోన్‌ చూస్తూ డ్రైవింగ్ చేసిన ఓ స్కూటీ రైడర్‌, కారును ఢీకొట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇటువంటి ప్రమాదాలకు యువతే ఎక్కువగా కారణం అవుతున్నారు.

Honda activa and kia seltos accident live video

హోండా యాక్టివా రైడర్‌ (Honda Activa) రోడ్డుపై డ్రైవింగ్‌ చేస్తూ స్మార్ట్‌ఫోన్‌లో నిమగ్నం అవ్వడం వీడియోలో గమనించవచ్చు. కనీసం ముందు వెళ్తున్న వాహనాలను కూడా గుర్తించకుండా డ్రైవింగ్‌ చేయడం కియా సెల్టోస్‌ కారు (Kia seltos) డ్యాష్‌ క్యామ్‌లో రికార్డు అయింది. కారు డ్రైవర్‌ కుడివైపునకు మళ్లించడంతో.. పూర్తిగా ఫోన్‌నే చూస్తు డ్రైవింగ్‌ చేస్తున్న యాక్టివా డ్రైవర్‌ దానిని గమనించలేదు.

రైడర్‌ నిర్లక్ష్యమా? : ఫలితంగా సెల్టోస్‌ కారును వెనుక నుంచి ఢీకొట్టాడు (Honda activa rider hits kia seltos). అనంతరం రోడ్డుమీద పడిపోయాడు. ప్రమాద సమయంలో యాక్టివా రైడర్‌ హెల్మెట్ ధరించడంతో చిన్న గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది. కారు డ్యాష్‌క్యామ్ వీడియో ఆధారంగా.. స్కూటీ రైడర్‌ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

distracted by smartphone Honda activa rider causes accident

అయితే సెల్టోస్‌ కారు డ్రైవర్‌ కూడా స్కూటీని ఓవర్‌టేక్ చేసి, అనంతరం టర్న్‌ తీసుకొనే ప్రయత్నం చేసింది. అయితే యాక్టివా రైడర్‌ను ముందుగా వెళ్లిపోయేందుకు అనుమతి ఇచ్చి ఉండాల్సింది. ఆ తర్వాత టర్న్‌ తీసుకుంటే ప్రమాదం జరిగి ఉండేది కాదు. అయితే స్మార్ట్‌ఫోన్‌ వినియోగిస్తూ రైడింగ్‌ చేయడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం.

వాహనాలు అతివేగంగా ప్రయాణం చేసి ఉంటే : కారు టర్న్‌ తీసుకున్న సమయంలో వేగం తక్కువగా ఉంటుంది కనుక ప్రమాద తీవ్రత కూడా తగ్గింది. అతివేగంగా వచ్చిన వాహనం ఎదురైతే.. ప్రమాద తీ‌వ్రత ఎక్కువగా భారీగా పెరిగేది. ఈ ఘటనలో రెండు వాహనాలు తక్కువ వేగంతో ప్రయాణం చేస్తున్నాయి కనుక చిన్న గాయాలతో స్కూటర్‌ రైడర్‌ బయటపడ్డాడు.

Honda activa and kia seltos accident dashcamvideo

భారత్‌లో రోడ్డు ప్రమాదాలకు నిర్లక్ష్యం ఎక్కువగా కారణం అవుతుంది. డ్రైవింగ్‌ చేస్తున్న సమయంలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. వెనుక, ఎదురుగా వస్తున్న వాహనాలను గమనిస్తూ డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. రోడ్డుపై అనుమతించిన వేగంతో ప్రయాణించడం ఉత్తమం. మరియు రోడ్డు భద్రతా నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Tuesday, October 31, 2023, 9:25 [IST]
English summary
Honda activa rider crashed kia seltos dashcam captured video viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+