ఈ హోండా విమానంలో ప్రయాణం అంటే, స్వర్గంలో విహరించినట్లే..!

జపనీస్ ఆటోమోటివ్ బ్రాండ్ హోండా, కేవలం నేలపై నడిచే మోటార్‌సైకిళ్లు, కార్లను మాత్రమే కాకుండా గాలిలో ఎగిరే విమానాలను కూడా తయారు చేస్తుందని మీకు తెలుసా? గడచిన 2006లో హోండా విమానయాన రంగంలోకి ప్రవేశించింది. హోండా ఎయిర్‌క్రాఫ్ట్ కంపెనీ పేరుతో జెట్ విమానాల వ్యాపారాన్ని ప్రారంభించింది.

ఈ హోండా విమానంలో ప్రయాణం అంటే, స్వర్గంలో విహరించినట్లే..!

హోండా ఎయిర్‌క్రాఫ్ట్ కంపెనీ ప్రపంచంలోని బిగ్‌షాట్స్ కోసం ప్రైవేట్ జెట్ విమానాలను తయారు చేస్తుంది. ఈ సంస్థ తాజాగా అధునాత లగ్జరీ ఎయిర్‌క్రాఫ్ట్ విమానాన్ని ఆవిష్కరించింది. అమెరికాలోని లాస్ వెగాస్‌లో జరుగుతున్న 2021 ఎన్‌బిఏఏ బిజినెస్ ఏవియేషన్ కన్వెన్షన్ మరియు ఎగ్జిబిషన్ (NBAA - BACE) లో నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో హోండా ఎయిర్‌క్రాఫ్ట్ కంపెనీ తమ "హోండాజెట్ 2600 కాన్సెప్ట్" ను ఆవిష్కరించింది.

ఈ హోండా విమానంలో ప్రయాణం అంటే, స్వర్గంలో విహరించినట్లే..!

హోండా ఎయిర్‌క్రాఫ్ట్ కంపెనీ రూపొందించిన నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ జెట్ కోసం కస్టమర్ ఫీడ్‌బ్యాక్ ను సేకరించడానికి మరియు మార్కెట్ డిమాండ్‌ ను ధృవీకరించడానికి ఈ అధునాతనమైన మరియు ఆల్ట్రా-లగ్జరీ హోండాజెట్ 2600 కాన్సెప్ట్ యొక్క మోకప్‌ను ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు. ఈ హోండా జెట్ విమానం, ఈ విభాగంలోని ఇతర విమానాల కన్నా ఎక్కువ ఇంధనాన్ని ఆదా చేస్తుందని కంపెనీ చెబుతోంది.

ఈ హోండా విమానంలో ప్రయాణం అంటే, స్వర్గంలో విహరించినట్లే..!

ఈ విమానంలో ప్రయాణం స్వర్గంలో విహరిస్తున్నట్లే ఉంటుంది. హోండా కంపెనీ ఈ హోండాజెట్ 2600 విమానాన్ని వ్యక్తిగత ఉపయోగం కోసం డిజైన్ చేసింది. ఇటీవలి కాలంలో హోండా తన విమానాల ఉత్పత్తిని తీవ్రతరం చేస్తోంది. ఈ విమానం 2,625 నాటికల్ మైళ్ల పరిధిని కలిగి ఉంది. అంటే, ఫుల్ ట్యాంక్ ఇంధనంతో దాదాపు 4,800 కి.మీల దూరం ప్రయాణిస్తుందన్నమాట. సింపుల్‌గా చెప్పాలంటే, ఫుల్ ట్యాంక్ ఇంధనంతో అమెరికా మొత్తాన్ని ఒక రౌండ్ వేసి రావచ్చు.

ఈ హోండా విమానంలో ప్రయాణం అంటే, స్వర్గంలో విహరించినట్లే..!

ఈ ఫౌండేషన్ హోండాజెట్ టెక్నాలజీలను మరింత మెరుగుపరచడం ద్వారా, హోండాజెట్ 2600 కాన్సెప్ట్ యునైటెడ్ స్టేట్స్ అంతటా నాన్‌స్టాప్ ట్రాన్స్‌కాంటినెంటల్ ఫ్లైట్ చేయగల ప్రపంచంలోనే మొట్టమొదటి లైట్ జెట్ అవుతుంది. ఈ విమానంలో నిశ్శబ్దమైన మరియు విశాలమైన క్యాబిన్ ఉంటుంది. ఇది సుదూర ప్రయాణాలకు సైతం అనుకూలంగా ఉంటుంది మరియు ఇందులో 11 మంది ప్రయాణీకులు కూర్చునే సౌకర్యం ఉంటుంది.

ఈ హోండా విమానంలో ప్రయాణం అంటే, స్వర్గంలో విహరించినట్లే..!

ప్రైవేట్ జెట్ విభాగంలో అసమానమైన ఇంధన సామర్థ్యాన్ని అందించాలని లక్ష్యంతో హోండా ఈ హోండాజెట్ 2600 కాన్సెప్ట్ ను రూపొందించింది. దీని తేలికపాటి నిర్మాణం కారణంగా, ఇది తక్కువ ఇంధనాన్ని ఉపయోగిస్తుంది మరియు చాలా ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. ఇది 450 నాట్ల హై స్పీడ్ వేగంతో క్రూయిజ్ చేయగలదు మరియు 47,000 అడుగుల క్లాస్ లీడింగ్ సీలింగ్‌ని కలిగి ఉంటుంది.

ఈ హోండా విమానంలో ప్రయాణం అంటే, స్వర్గంలో విహరించినట్లే..!

హోండాజెట్ 2600 బిజినెస్ జెట్ విమానం, ప్రస్తుతం ఉపయోగిస్తున్న లైట్ జెట్‌ల కంటే 20 శాతం ఎక్కువ ఇంధనాన్ని ఆదా చేస్తుందని కంపెనీ తలెలిపింది. విమానం యొక్క గరిష్ట క్రూయిజ్ వేగం 422KTAS, గరిష్ట క్రూయిజ్ ఎత్తు FL430, NBAA IFR పరిధి 1437nm మరియు ప్యాకేజీ స్థలం 66 క్యూబిక్ అడుగులు. కొత్త హోండా జెట్ ఎలైట్ ఎస్ లగ్జరీ విమానం అద్భుతమైన ఫీచర్లతో అభివృద్ధి చేయబడింది. హోండాజెట్ ఈ విమానాన్ని ప్రపంచంలోనే అత్యంత అధునాతన లైట్ జెట్‌గా సూచిస్తుంది.

ఈ హోండా విమానంలో ప్రయాణం అంటే, స్వర్గంలో విహరించినట్లే..!

హోండాజెట్ మూడు రకాల క్యాబిన్ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంటుంది. కస్టమర్లు తమ అవసరాలకు అనుగుణంగా దీనిని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇందులో ఫోర్-సీటర్, టూ-సీటర్ మరియు కోచ్-టైప్ ఫోర్-సీటర్ ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో మొదటి నాలుగు సీట్లు ఒకదానికొకటి ఎదురుగా ఉంటాయి. రెండవ వరుసలోని రెండు సీట్లు గరిష్ట సౌకర్యంతో అందుబాటులో ఉండగా, మూడవ వరుసలోని నాలుగు సీట్లు సౌకర్యవంతమైన బెడ్‌ తో లభిస్తాయి.

ఈ హోండా విమానంలో ప్రయాణం అంటే, స్వర్గంలో విహరించినట్లే..!

హోండాజెట్ 2600 కాన్సెప్ట్ అధునాతన సాంకేతికతను కలిగి ఉంటుంది. ఇదొక సింగిల్-పైలట్ ఆపరేషన్ కోసం రూపొందించిన మొట్టమొదటి ఖండాంతర జెట్. ఇందులో అధునాతన కాక్‌పిట్ ఎలక్ట్రోఫికేషన్ మరియు ఆటోమేటెడ్ సిస్టమ్స్ వంటి వినూత్న సాంకేతికతలు ఉన్నాయి. ఇంకా ఇందులో ఆటోథ్రోటిల్ మరియు ఆటోబ్రేక్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. సహజమైన, హైటెక్ ఇంటర్‌ఫేస్ సాయంతో పైలట్ పనిభారాన్ని తగ్గించడం ద్వారా ఇది అత్యంత కార్యాచరణ భద్రతను అందిస్తుంది.

ఈ హోండా విమానంలో ప్రయాణం అంటే, స్వర్గంలో విహరించినట్లే..!

హోండాజెట్ 2600 కాన్సెప్ట్ అతి త్వరలోనే ఉత్పత్తి దశకు చేరుకోవచ్చని భావిస్తున్నారు. అమ్మకాల విషయానికి వస్తే, ఇది ప్రపంచంలో అత్యంత చౌకైన మరియు అత్యంత సమర్థవంతమైన ప్రైవేట్ జెట్ విమానంగా చెబుతున్నారు. కాబట్టి, ఈ విమానం భవిష్యత్తులో విమానయాన మార్కెట్‌ లో కొత్త విప్లవాలకు నాంది పలికే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Most Read Articles

English summary
Honda aircraft company unveils hondajjet 2600 concept details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X