హోండా నుంచి విడుదల కానున్న 5 స్కూటర్లు, మోటార్‌ సైకిళ్లు..!!

భారత ఆటోమొబైల్‌ మార్కెట్‌లోకి తన ఉత్పత్తులను వరుసగా లాంచ్‌ చేసేందుకు హోండా తీవ్ర కృషిచేస్తోంది. ఇటీవల హోండా తన 100cc బైక్‌ షైన్‌ను మరోసారి విడుదల చేసింది. ఈ సెగ్మెంట్‌లో హీరోకి పోటీ ఇచ్చేలా ప్లాన్‌ చేసింది. అంతేకాకుండా త్వరలో విడుదల కానున్న వాహనాలపైనా భారీ ప్లాన్‌ చేసింది.

హోండా షైన్‌ 100cc లాంచ్‌ చేసిన సమయంలోనే.. హోండో కీలక ప్రకటన చేసింది. త్వరలో తమ సంస్థ నుంచి అనేక రకాల కొత్త వాహనాలు విడుదల అవుతాయని తెలిపింది. వీటిలో వివిధ వేరియంట్ల ఎలక్ట్రిక్‌ వాహనాలు ఉంటాయని పేర్కొంది. ఈ వివరాలు మీ కోసం.

Honda upcoming bikes and scooters

హోండా 350cc క్రూయిజర్‌ బైక్‌ : హోండా CB350 ప్లాట్‌ఫాం ప్రస్తుతం H'ness రెట్రో మోటార్‌ సైకిల్‌ మరియు CB350RSలను అందిస్తోంది. ఇది కొంచెం కేఫ్‌ రేసర్‌ వైబ్‌ను పోలి ఉంటుంది. ఈ బైక్‌లు హోండాను రాయల్‌ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్‌ 350 మరియు హంటర్‌ 350తో పోటీపడనున్నాయి.

హోండా 350cc మోటార్‌సైకిల్‌ను ఈ సంవత్సరం దీపావళికి విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటన చేసింది. ఇప్పటికే ఉన్న 348cc లాంగ్‌ స్ట్రోక్‌ సింగిల్‌ ఇంజిన్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. హోండా గేరింగ్‌, స్ప్రాకెట్‌లతో మిగిలిన వాటిని భర్తీ చేయవచ్చు.

ఈ బైక్‌ సేల్‌లో దూసుకుపోవాలంటే అదే తరహాలో ధరలు నిర్ణయించాల్సి ఉంటుంది. అంటే ధర సుమారుగా రూ.2 లక్షల నుంచి 2.2 లక్షల రూపాయల్లో (ఎక్స్‌ షోరూం) ఉండే అవకాశం ఉంది. దీపావళి కంటే ముందుగానే ఈ బైక్‌ కొనుగోలుదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Honda upcoming bikes and scooters

హోండా ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు ఎలక్ట్రిక్‌ ద్విచక్రవాహనాలను విడుదల చేయనుంది. అయితే రెండు ఎలక్ట్రిక్‌ స్కూటర్లలో కొద్దిపాటి తేడాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఒక స్కూటర్‌ ఫిక్సిడ్‌ బ్యాటరీ ప్యాక్‌ను మరో స్కూటర్‌ రిమువబుల్ బ్యాటరీ ప్యా‌క్‌తో రానున్నట్లు తెలుస్తోంది. అలాగే యాక్టివా యొక్క బ్రాండ్‌ విలువను హోండా ఈ- స్కూటర్ల కోసం వినియోగించుకోనే అవకాశం ఉంది. ఈ- యాక్టివా లేదా ఎలక్ట్రిక్‌ యాక్టివాగా పేరు పెట్టే అవకాశం ఉంది.

ఎలక్ట్రిక్‌ వాహనాలతో పాటు పెట్రోల్‌ వాహనాలను కూడా విడుదలకు హోండా ప్లాన్‌ చేస్తోంది. ఇందులో 125cc స్కూటర్‌ మరియు 160cc మోటార్‌సైకిల్‌ కూడా ఉన్నాయి. స్కూటర్‌.. యాక్టివా 125 తరహా ఫీచర్లతో స్పోర్ట్‌ మోడల్‌ వాహనం లాంచ్‌ చేసే అవకాశం ఉంది.

Honda upcoming bikes and scooters

ఫలితంగా టీవీఎస్‌ NTorq మరియు సుజుకి Avenis వాహనాలకు పోటీ పడే అవకాశం ఉంటుంది. 160cc మోటార్‌ సైకిల్ ఇంజిన్‌ ఎక్స్ బ్లేడ్‌ మరియు యూనికార్న్ నుంచి తీసుకొనే అవకాశం ఉంది. అయితే పూర్తిగా ఎలాంటి ఇంజిన్‌, డిజైన్‌తో వస్తుందనే సమాచారాన్ని హోండా పంచుకోలేదు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, May 31, 2023, 19:11 [IST]
English summary
Honda bikes and scooters which will launch in india soon
Read more on: #హోండా #honda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+