"బాబ్బాబు.. సీటు బెల్టు పెట్టుకోండి" అంటే సీరియస్‌గా తీసుకోరు కదా..! అలాంటి వాళ్లు ఈ వీడియో తప్పక చూడాల్సిందే!
ట్రావెలింగ్ సమయంలో, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సీటు బెల్టు పెట్టుకోవాల్సి ఉంటుంది. దీనిపై ట్రాఫిక్ పోలీసులే కాదు, ఇంట్లో వాళ్లు తమ కుటుంబ సభ్యులకు నిత్యం గుర్తు చేస్తూ ఉంటారు. అయితే చాలా మంది ఈ మాటను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఫలితంగా ప్రాణాలు కోల్పోయే పరిస్థితిని తెచ్చుకుంటారు. ఇలాంటి ఒక ఘటన తాజాగా జరిగింది. సీటు బెల్టు ప్రాముఖ్యాన్ని తెలియజెప్పే ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో హోండా సిటీ, హ్యూందాయ్ వెర్నా కార్లు ఒకదానికొకటి ఎదురెదురుగా ఢీకొని పెద్ద ప్రమాదమే సంభవించింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
వెర్నా కారు కంట్రోల్ తప్పి ఎదురుగా వస్తున్న హోండా సిటీ కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. దీని కారణంగా రెండు కార్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే దీంట్లోని ప్రయాణికులకు పెద్ద గాయాలు మాత్రం కాలేదు. దీనికి కారణం ఏంటంటే వాళ్లు సీటు బెల్టులు ధరించి ఉండడమే. కొంతమంది వ్యక్తులు "నేను డ్రైవింగ్ నిదానంగానే చేస్తుంటాను. నాకు సీటు బెల్టు అవసరం లేదు" అని మొండిగా వాదిస్తుంటారు.

అలాంటి వాళ్లకు.. "మీరు డ్రైవింగ్ నిదానంగా చేసినా ఎదురుగా వచ్చే వ్యక్తి సరిగా నడపకపోతే మాత్రం నష్టపోయేది మీరే కదా" అని గుర్తు చేయాలి. కాబట్టి.. అలాంటి వాళ్లకు కచ్చితంగా సీటు బెల్టు పెట్టుకుంటే ప్రమాదాల నుంచి బయటపడే అవకాశం ఉంటుందని తెలియజేయాలి. మీరు ఎప్పుడైనా కారులో ప్రయాణిస్తున్నప్పుడు మీరు సీటు బెల్టు పెట్టుకోవడమే కాకుండా కారులో ఉన్న మిగతావారిని కూడా దాన్ని ధరించమని చెప్పండి.
సీటు బెల్టు పెట్టుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. అది మనల్ని సరిగ్గా సీటుకు పట్టి ఉంచేలా చూసుకోవాలి. మొదట మనం సీటులో సరిగ్గా కూర్చున్న తర్వాతే సీటు బెల్టు ధరించాలి. కొత్త వాహనాల్లోనైతే సీటు బెల్టు ప్లాస్టిక్ కవర్స్‌తో కప్పి ఉంటుంది. కాబట్టి.. వాటిని వినియోగించేముందు ఆ కవర్‌ను తొలగించాలి.

అలాగే కొత్తగా సీటు కవర్ వేయించుకునే ముందు కూడా సీటు బెల్టు హోల్ పూడుకుపోయేలా ఉండకుండా చూసుకోవాలి. గణాంకాలు, అధ్యయనాల ప్రకారం.. ఎక్కువ యాక్సిడెంట్లు ఉదయం 3 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య అవుతున్నట్లు తెలుస్తోంది. కాబట్టి.. ఈ టైంలో సీటు బెల్టు వాడడం తప్పనిసరి అని భావించాలి.
మన కాలర్ బోన్, భుజాన్ని కలిపేలా ఈ సీటు బెల్టును ధరించాలి. అలాగే దాన్ని మరీ గట్టిగా కూడా బిగించకూడదు. సౌకర్యవంతంగా ఉండేలా దాన్ని ధరించాలి. ఈ సీటు బెల్టే మీ జీవితాన్ని కాపాడుతుందనే విషయాన్ని మర్చిపోకూడదు. ఫ్రంట్, బ్యాక్ సీట్లలో కూర్చునే వారు తప్పనిసరిగా సీటు బెల్టులు ధరించాలి.

ప్రతి వాహనంలో సీటు బెల్టులు ఉండడం తప్పనిసరి అని చెబుతూ కేంద్ర రవాణా శాఖ మంత్రి సైతం ఇటీవలే ఆదేశాలు జారీ చేశారు. లారీల్లో ప్రయాణించినప్పుడు కూడా ముందు కూర్చున్న వ్యక్తులు తప్పకుండా సీటు బెల్టులు ధరించాలి. అలాగే బస్సులో కూడా క్యాబిన్‌లో కూర్చునే వారు సీటు బెల్టు ధరించాలి.
ఈ రోజుల్లో సీటు బెల్టులతో ప్రయాణికుల సేఫ్టీని మరింత మెరుగుపరిచేలా ఎప్పటికప్పుడు అడ్వాన్స్‌మెంట్స్‌తో వస్తున్నాయి. ప్రి-టెన్షనర్స్, లోడ్ లిమిటర్స్ వంటివి ప్రమాదాలు జరిగినప్పుడు టైట్ అయ్యి, బలాన్ని నియంత్రించి ప్రయాణికులను కాపాడుతాయి. అలాగే కొన్ని మోడర్న్ కార్లలో స్మార్ట్ సీటు బెల్టులు కూడా ఉంటున్నాయి. అవి ప్రమాదాన్ని సెన్సార్లతో గ్రహించి వాటంతంటవే టైట్‌గా మారి ప్రయాణికులను కాపాడుతున్నాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








