Live Video టైర్‌ పేలడంతో Honda Jazz కారును ఢీకొట్టిన హోండా సిటీ.. ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలి?

ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు అత్యధికంగా జరుగుతున్న ప్రాంతాల్లో భారత్‌ ఒకటిగా ఉంది. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. నిర్లక్ష్యపు డ్రైవింగ్‌, అతివేగం సహా వాహనాల నిర్వహణ సక్రమంగా లేకపోవడమూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. టైర్లను సరిగా తనిఖీ చేయని కారణంగా తాజా ప్రమాదం జరిగింది. ఈ వీడియో ఘటన స్థలంలోని మరో కారు డ్యాష్‌బోర్డులో రికార్డు అయింది.

లక్నో- ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వే పైన ప్రమాదం జరిగింది. ఈ రోడ్డుపై హోండా జాజ్‌ హ్యాచ్‌బ్యాక్‌ (Honda jazz) సరైన మార్గంలో అనుమతించిన వేగంతో ప్రయాణం చేస్తోంది. అయితే ఆ సమయంలో హోండా సిటీ కారు.. జాజ్‌ హ్యాచ్‌బ్యాక్‌ను ఓవర్‌టేక్‌ చేసేందుకు ప్రయత్నం చేసింది. అయితే ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయింది.

Honda city car crashed honda jazz hatchback

లైవ్‌ వీడియో : దీంతో పక్కన ప్రయాణిస్తున్న హోండా జాజ్‌ హ్యా్చ్‌బ్యాక్‌ను ఢీకొట్టగా.. జాజ్‌ కారు రోడ్డుపక్కనున్న రెయిలింగ్‌ను ఢీకొట్టింది. అప్పటికి నియంత్రణలోకి రాలేకపోయిన హోండాసిటీ మరోసారి జాజ్‌ హ్యాచ్‌బ్యాక్‌ను ఢీకొట్టింది. అనంతరం రోడ్డుపక్కనున్న డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ వీడియో జాజ్‌ హ్యాచ్‌బ్యాక్‌ డ్యాష్‌క్యామ్‌లో రికార్డు అయింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు డ్యామేజీ అయ్యాయి.

టైర్‌ పేలిపోవడం కారణంగానే కారు నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది. టైర్ పేలిపోయేందుకు.. టైర్ పరిస్థితి మరియు టైర్ ప్రెజర్‌ కారణం కావచ్చు. పాత టైర్లు లేదా టైర్ల నిర్వహణ సక్రమంగా లేకుంటే ఇటువంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది, హోండా జాజ్‌, హోండా సిటీ కార్ల బిల్డ్‌ క్వాలిటీ సహా ఇతర భద్రతా ఫీచర్ల కారణంగా రెండు వాహనాల్లో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది.

Honda city car tyre burst

రోడ్లపై డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు వాహనాల టైర్లు పేలిపోవడం వల్ల నియంత్రణ కోల్పోతాయి. ఫలితంగా ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో వాహనాన్ని నియంత్రణలోకి తీసుకొచ్చేంత సమయం ఉండే అవకాశం తక్కువగా ఉంటుంది. వాహనం బోల్తాపడడం సహా ఇతర వాహనాలను ఢీకొట్టే అవకాశం ఉంటుంది. ఫలితంగా తీవ్రంగా గాయపడడం సహా ప్రాణాపాయం కూడా ఉంటుంది.

టైర్‌ పేలుళ్లను ఎలా నియంత్రించాలి: వాహనం టైర్లను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. సాధారణంగా టైర్లు కనిష్ఠంగా 1.5 మి.మీ ట్రెడ్‌ డెప్త్‌ ఉండాలి. ఇలా ఉంటేనే వాహనం రోడ్డుపై ట్రాక్షన్‌ కోల్పోకుండా ఉంటుంది. రోడ్లపై ప్రయాణిస్తున్న సమయంలో స్పీడ్‌ లిమిట్‌ను చూసుకొని ప్రయాణించడం ఉత్తమం. ఇతర రోడ్లు కంటే కాంక్రీట్‌ రోడ్లు త్వరగా టైర్ల ఉష్ణోగ్రతను పెంచుతాయి.

honda jazz

సరైన టైర్‌ ప్రెజర్‌ : టైర్ల తయారీ సంస్థలు నిర్దేశించిన విధంగా టైర్‌ ప్రెజర్‌ ఉండేలా చూసుకోండి. టైర్‌ ప్రెజర్‌ తక్కువ లేదా ఎక్కువగా ఉంటే.. టైర్లు సరైన పనితీరును కనబరచవు. ఫలితంగా స్కిడ్డింగ్‌ సహా ఇతర ప్రమాదాలు పొంచి ఉంటాయి.

ఓవర్‌ లోడ్‌ : వాహనం తయారీ సంస్థ నిర్దేశించిన బరువు కంటే ఎక్కువ బరువులు ఉంచడం వల్ల టైర్లు పేలిపోయే ప్రమాదం ఉంటుంది. దూర ప్రాంతాలకు ప్రయాణించినప్పుడు కొంత సమయం టైర్లు, ఇంజిన్‌కు విశ్రాంతి ఇవ్వడం అవసరం. లేకుంటే టైర్ల ఉష్ణోగ్రత పెరిగి.. టైర్లు పేలిపోయే అవకాశం ఉంటుంది.

టైర్‌ పేలినప్పుడు ఎం చేయాలి : టైర్‌ పేలినప్పుడు వాహనం సాధారణంగానే నియంత్రణ కోల్పోతుంది. అటువంటి సందర్భాల్లో ఒక్కసారిగా బ్రేకులు వేయడం వల్ల ప్రమాద తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల కారు సరళ రేఖ మార్గంలో వెళ్లేలా డ్రైవింగ్‌ ఉండాలి. అదే విధంగా బ్రేకులను నెమ్మదిగా వేయాల్సి ఉంటుంది. ఆందోళన చెందకుండా కారును నిలిపేసేలా ప్రయత్నం చేయాలి.

More from DriveSpark

Article Published On: Friday, November 3, 2023, 9:37 [IST]
English summary
Honda city car crashed honda jazz live video goes viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+