Just In
- 27 min ago
కొత్త హోండా వెజెల్ ఎస్యూవీ టీజర్ విడుదల
- 49 min ago
సైనికుల కోసం బుల్లెట్ బైక్‌లనే మొబైల్ అంబులెన్స్‌లుగా మార్చేశారు..
- 2 hrs ago
3 కి.మీ ట్రక్కుని రివర్స్ గేర్‌లో నడిపిన డ్రైవర్.. ఎందుకనుకుంటున్నారా, అయితే ఇది చూడండి
- 2 hrs ago
దేశంలోనే అతిపెద్ద మల్టీ-బ్రాండ్ కార్ సర్వీస్ సెంటర్‌ను ఓపెన్ చేసిన బాష్
Don't Miss
- Movies
Box office: 5వ రోజు రెడ్, అల్లుడు అదుర్స్ కలెక్షన్స్.. రామ్ టార్గెట్ ఫినిష్.. ఇంకా పైకిరాని బెల్లంకొండ
- Sports
Brisbane Test: పంత్ హాఫ్ సెంచరీ.. విజయం దిశగా భారత్!! కొట్టాల్సింది 59 పరుగులే!
- News
బీజేపీ రథయాత్ర సవాల్- కౌంటర్ వ్యూహానికి పదును పెడుతున్న జగన్- అమిత్‌షా దృష్టికి ?
- Finance
సెన్సెక్స్ 660 పాయింట్ల భారీ జంప్, రిలయన్స్ రూ.2000 మార్క్ క్రాస్
- Lifestyle
మీరు వాడే షాంపూ మంచిది కాకపోతే మీ జుట్టు ఏమి సూచిస్తుంది, తప్పకుండా తెలుసుకోండి..
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
టాటా నానో కారును ఢీ కొట్టి దెబ్బతిన్న హోండా సిటీ కార్ ; [వీడియో]
భారతదేశంలో రహదారులు చాలా ప్రమాదభరితంగా ఉంటాయి. ఈ కారణంగా ప్రతిరోజూ లెక్కకు మించిన ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక పెద్ద కారు చిన్న కారును తాకినప్పుడు చిన్న కారుకు నష్టం జరగటం సాధారణం. కానీ ఇటీవల ఒక విచిత్ర సంఘటన వెలుగులోకి వచ్చింది. రెండు కార్ల మధ్య చిక్కిన ఒక చిన్న కారు చాలా ప్రమాదానికి గురైంది.
![టాటా నానో కారును ఢీ కొట్టి దెబ్బతిన్న హోండా సిటీ కార్ ; [వీడియో]](/img/2020/07/car-crash1-1594357242.jpg)
కేరళలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రెండు హోండా సిటీ కార్ల మధ్య చిక్కుకున్న నానో కారును చూడవచ్చు. స్పీడ్ బ్రేకర్ కారణంగా హ్యుందాయ్ సాంట్రో కొంత నిదానంగా కదులుతోంది. దాని వెనుక నానో కారు ఉంది, అదే సమయంలో నానో వెనుక హోండా సిటీ కూడా వస్తుంది.
![టాటా నానో కారును ఢీ కొట్టి దెబ్బతిన్న హోండా సిటీ కార్ ; [వీడియో]](/img/2020/07/car-crash3-1594357256.jpg)
టాటా నానో వెనుక ఉన్న హోండా సిటీ కారు టాటా నానోను ఢీ కొట్టింది. అదే సమయంలో దాని ముందు ఉన్న హోండా సిటీ కారును నానో ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండు హోండా సిటీ కార్లు దెబ్బతిన్నాయి. నానో వెనుక హోండా సిటీ యొక్క ముందు బంపర్ మరియు బూట్ లోడ్లు దెబ్బతినగా, హోండా సిటీ కారు ముందు బంపర్ దెబ్బతింది.
MOST READ:15 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న వాహనాలు తిరగటం నిషేధించిన NGT ; ఎందుకంటే ?
![టాటా నానో కారును ఢీ కొట్టి దెబ్బతిన్న హోండా సిటీ కార్ ; [వీడియో]](/img/2020/07/car-crash6-1594357279.jpg)
ఆశ్చర్యకరంగా, ఈ రెండు కార్ల మధ్య చిక్కుకున్న టాటా నానోకు ఎటువంటి నష్టం జరగలేదు. నెంబర్ ప్లేట్ కి మాత్రం కొంత నష్టం జరిగింది. టాటా మోటార్స్ యొక్క నానో కార్ చాలా బలంగా ఉంది.
![టాటా నానో కారును ఢీ కొట్టి దెబ్బతిన్న హోండా సిటీ కార్ ; [వీడియో]](/img/2020/07/car-crash8-1594357297.jpg)
ఈ సంఘటనకు నానో వెనుక ఉన్న హోండా సిటీ కారు డ్రైవర్ కారణమని స్పష్టమైంది. డ్రైవర్ కారు వేగాన్ని తగ్గించకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. బ్రేకింగ్ చేయడానికి బదులుగా, అతను యాక్సిలరేటర్ కొట్టాడు.
MOST READ:మార్చి 31 తర్వాత అమ్మిన బిఎస్ 4 వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయనున్నారా.. లేదా ?
![టాటా నానో కారును ఢీ కొట్టి దెబ్బతిన్న హోండా సిటీ కార్ ; [వీడియో]](/img/2020/07/car-crash5-1594357271.jpg)
భారతదేశంలో ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా జరుగుతూనే ఉన్నాయి. మన దేశంలో వాహనదారులు ట్రాఫిక్ నియమాలను నిర్లక్ష్యం చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వాలు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు ప్రారంభించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోతోంది.
రెండు హోండా సిటీ కార్లను టాటా నానో స్థానంలో ఉంచినట్లయితే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇక్కడ మనం వీడియోలో గమనించినట్లయితే టాటా నానో పెద్దగా ప్రమాదానికి గురి కాలేదు.
MOST READ:త్వరలో అందుబాటులోకి రానున్న ఎగిరే కార్లు, చూసారా !
![టాటా నానో కారును ఢీ కొట్టి దెబ్బతిన్న హోండా సిటీ కార్ ; [వీడియో]](/img/2020/07/car-crash3-1594357081.jpg)
దేశీయ మార్కెట్లో టాటా మోటార్స్ కార్లు వాహనదారుల భద్రతకు ప్రసిద్ధి చెందాయి. టాటా ఆల్ట్రోజ్ మరియు టాటా నెక్సాన్ వంటి కార్లు దేశంలో అత్యంత సురక్షితమైన కార్ల లిస్ట్ లో ఉన్నాయి. టాటా మోటార్స్ ఇటీవల కాలంలో కూడా కొత్త కార్లని తయారు చేయడంలో నిమగ్నమై ఉంది. ఈ కార్లలో కూడా అనేక రకాల భద్రతా లక్షణాలను కూడా ప్రవేశపెడుతోంది. టాటా కార్లు భద్రత నిదర్శనం అని ఈ సంఘటన ద్వారా మరోసారి ఋజువయింది.