ర్యాష్ డ్రైవింగ్‌తో సైక్లిస్ట్‌ను ఢీకొట్టిన కారు.. అనంతరం ఆగకుండా వెళ్లిపోయిన కారు డ్రైవర్, వీడియో వైరల్

దేశంలో రోడ్లపై ర్యాష్ డ్రైవింగ్ అనేది సాధారణమైపోయింది. రోడ్లు ఖాళీగా ఉన్నా రద్దీగా ఉన్నా.. కొందరు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి విచ్చలవిడిగా డ్రైవింగ్ చేస్తుంటారు. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసమూ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ర్యాష్ డ్రైవింగ్ వారికే కాకుండా ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు కలిగిస్తుంది.

ట్రాఫిక్ నిబంధనలు ఎంత కఠినంగా ఉన్నా ఇలా ర్యాష్ డ్రైవింగ్ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షేర్ చేసిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఈ వీడియోలో హోండా సిటీ సెడాన్‌ను నిర్లక్ష్యంగా నడుపుతూ, రోడ్డుపై వెళ్తున్న సైక్లిస్ట్‌ను ఢీకొట్టాడు.

Accident-Viral-Video

ఈ వీడియోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తమ యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేశారు. రోడ్డు ప్రమాదాలను నివారించడంలో భాగంగా సైబరాబాద్ పోలీసులు తరచూ అందుకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు. కాగా ఈ సంఘటన మాదాపూర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది.

ఈ వీడియోలో రోడ్డు పైన ట్రక్కులతో సహా వాహనాలు వెళ్తున్నాయి. ఈ క్రమంలో హెల్మెట్ ధరించి ఓ సైక్లిస్ట్‌ వెళ్తున్నాడు. సైక్లిస్టు వెనుక ఆటో రిక్షా ఉంది. ఈ సందర్భంలో ఆటోరిక్షా అతడిని ఓవర్‌టేక్ చేయబోతుండగా, అదే సమయంలో వేగంగా వస్తున్న హోండా సిటీ సెడాన్ వెనుక నుంచి వచ్చి ఎడమవైపు నుంచి ఆటోను ఓవర్‌టేక్ చేసేందుకు యత్నించింది. అయితే రోడ్డుపై ఉన్న సైక్లిస్ట్‌ని కారు డ్రైవర్ గమనించనట్లుగా అనిపిస్తుంది.

Accident-Viral-Video

దీంతో ఒక్కసారిగా కారు సైకిలిస్టును ఢీకొట్టింది. సైకిల్, దాని పైన వ్యక్తి ఒక్కసారిగా దూరంగా ఎగిరి కిందపడ్డారు. అదృష్టవశాత్తూ ఆ సమయంలో మరి ఏ ఇతర వాహనాలు రాకపోవడంతో.. బాధితుడికి ఎలాంటి గాయాలు కాలేదు. కానీ కారుకు స్వల్ప గాాయాలైనట్లుగా కనిపిస్తోంది.

హోండా సిటీ సెడాన్ ORVM (అవుట్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్) విరిగి వాహనం నుంచి ఎగిరిపడింది. ఇదంతా కొన్ని సెకన్ల వ్యవధిలో జరగడంతో ఏం జరిగిందో సైక్లిస్ట్ కు వెంటనే అర్థం కాలేదు. ప్రమాదం జరిగాక హోండా సిటీ డ్రైవర్ ఆగకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

Accident-Viral-Video

అయితే ఘటన అనంతరం నెక్సాన్ డ్రైవర్ అటుగా రావడంతో ప్రమాదం చూసి ఆగిపోయాడు. సైకిలిస్ట్ లేచి నిలబడి, అక్కడి నుంచి వచ్చి ఫుట్ పాత్ మీద కూర్చున్నాడు. పోలీసులకు సమాచారం అందించడంతో హోండా సిటీ యజమానిని గుర్తించి అతనిపై చర్యలు తీసుకున్నారు.

ప్రమాదంలో సైక్లిస్ట్ పెద్దగా గాయాలు కాకపోవడంతో సురక్షితంగా బయటపడ్డాడు. ఘటనను పూర్తిగా పరీశీలిస్తే ఇందులో కారు డ్రైవర్‌దే తప్పు ఉన్నట్లుగా అర్థమవుతోంది. కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఇలాంటి డ్రైవింగ్ కారణంగా ఇతరుల ప్రాణాలకు ముప్పు కలుగుతుంది.

రోడ్డుపై ప్రయాణించేటప్పుడు రోడ్డు మధ్యలో లేదా కుడి వైపు కాకుండా ఎడమ వైపు మాత్రమే నడపాలి. సైకిలిస్టులు సైకిల్ ట్రాక్‌లను ఉపయోగించడం ఉత్తమం. రోడ్డు మీద వాహనాలు ఎక్కువగా లేవనే ఉద్దేశంతోనే బహుశా సైకిలిస్టు రోడ్డు మధ్యలో ప్రయాణిస్తున్నట్లుగా అనుకోవచ్చు.

మీరు ఒకవేళ ఇలాంటి ప్రమాదాలకు గురైతే గాయాల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి సరైన గేర్ ఉపయోగించాలి. అయితే పైన చెప్పుకున్న ప్రమాద ఘటనను పరిశీలిస్తే.. కారు డ్రైవర్ ప్రమాదం జరిగిన వెంటనే బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సి ఉంది. ప్రమాదానికి గురైన వ్యక్తిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించాల్సిన అవసరం ఉంది.

More from DriveSpark

Article Published On: Saturday, September 9, 2023, 16:22 [IST]
English summary
Honda city driver hits a cyclist due to rash driving
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+