నదిలో పడిపోయిన కొత్తగా పెళ్లి చేసుకున్న జంట ఉన్న హోండా సిటీ, తర్వాత ఏం జరిగిందంటే ?

భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. వాహనదారులు రోడ్డు నిబంధనలను పాటించకపోవడం వల్ల మరియు భారతదేశంలో సరైన రోడ్లు లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల జార్ఖండ్‌లో అనుకోకుండా ఒక నూతన వధూవరులతో వెళుతున్న హోండా సిటీ సెడాన్ ఆదివారం నదిలో పడిపోయింది.

నదిలో పడిపోయిన కొత్తగా పెళ్లి చేసుకున్న జంట ఉన్న హోండా సిటీ, తర్వాత ఏం జరిగిందంటే ?

కొత్తగా పెళ్లి చేసుకున్న ఒక కొత్త జంట మరియు మరో ముగ్గురితో కారు వంతెనపై నుంచి ప్రమాదవశాత్తు జారీ నదిలోకి పడిపోయింది. కారు నదిలో పడిపోయినప్పుడు దానిని గమనించిన స్థానికులు నదిలోకి దూకారు. అప్పటికే ఆ కారు దాదాపు 500 దూరం నదీ ప్రవాహంలో కొట్టుకుపోయింది.

నదిలో పడిపోయిన కొత్తగా పెళ్లి చేసుకున్న జంట ఉన్న హోండా సిటీ, తర్వాత ఏం జరిగిందంటే ?

వివాహం జరిగిన తర్వాత కుటుంబం తిరిగి వస్తున్న రోజు ఈ సంఘటన జరిగింది. కారు నదిలో ఎలా పడిపోయిందో ఖచ్చితంగా తెలియదు. కారు డ్రైవర్ నిద్రపోవడం వల్ల కావచ్చు లేదా అధిక వేగంతో ప్రయాణించడం వల్ల కారు అదుపు తప్పిపోవడం వల్ల కానీ ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చు.

నదిలో పడిపోయిన కొత్తగా పెళ్లి చేసుకున్న జంట ఉన్న హోండా సిటీ, తర్వాత ఏం జరిగిందంటే ?

జార్ఖండ్ ప్రాంతంల్లో భారీ వర్షపాతం కారణంగా నది ప్రవాహం సాధారణంగా కంటే బలంగా ఉంది. నదీ ప్రవాహం ఎక్కువగా ఉన్న కారణంగా కారు సుమారు 500 మీటర్ల దూరం కొట్టుకుపోయింది. స్థానిక గ్రామస్తులు వెంటనే కారుని గుర్తించి నదిలో దూకి కారులో ఉన్న వారిని రక్షించారు. కారులో ఉన్న వారిని రక్షించడానికి స్థానికులు కారు విండోస్ పగులగొట్టారు.

నదిలో పడిపోయిన కొత్తగా పెళ్లి చేసుకున్న జంట ఉన్న హోండా సిటీ, తర్వాత ఏం జరిగిందంటే ?

నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్న కారు వీడియో ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్‌గా మారింది. కారును నది నుంచి బయటికి లాగడానికి స్థానికులు తాళ్లను ఉపయోగించారు. స్థానికులు కారుని బయటికి తీసారా, లేదా అనేది కచ్చితంగా తెలియదు కానీ కారులో ఉన్న వ్యక్తులను రక్షించగలిగారు. ఏదేమైనా నదిలో పడిన కారు భారీగా దెబ్బతినింది.

ప్రపంచవ్యాప్తంగా కార్లు సాధారణంగా ఇలాంటి ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ ప్రమాదాలు చాలా కారణాల వల్ల జరగవచ్చు. నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న కారణంగా కారు లోపలి నుండి నీరు దూసుకుపోయే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితులలో వాహనంలో ఎలక్ట్రికల్ సిస్టమ్స్ పనిచేయడం మానేస్తాయి మరియు పవర్ విండోస్ ఓపెన్ కావు. అందువల్లనే ఒక చిన్న గ్లాస్ బ్రేకర్‌ను కారులో ఉంచడం చాలా మంచిది. ఇలాంటి అనుకోని ప్రమాద పరిస్థితులలో దీనిని ఉపయోగించవచ్చు.

నదిలో పడిపోయిన కొత్తగా పెళ్లి చేసుకున్న జంట ఉన్న హోండా సిటీ, తర్వాత ఏం జరిగిందంటే ?

వాహనదారులు వాహనాలను నడిపే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఏమరుపాటుగా ఉన్నట్లయితే ఇలాంటి అనుకోని ప్రమాదాలు జరుగుతాయి. ఈ విధంగా జరిగినప్పుడు వాహనదారులు చాలా నష్టాలను భరించవలసి వస్తుంది. అంతే కాకుండా ఇటువంటి ప్రమాదాలను స్థానికులు గుర్తించకపోతే ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉంది.

Image Courtesy: Live Hindustan/YouTube

More from DriveSpark

Article Published On: Tuesday, June 23, 2020, 12:10 [IST]
English summary
Honda City with newly wed couple plunges into a river: Watch locals save them [Video]. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+