షాన్ లిస్‌జాక్ హోండా సివిక్ స్క్రాచ్ ఆర్ట్
మనం ఎంతో ఇష్టంగా చూసుకునే కారుపై చిన్న గీత పడితేనే, తెగ బాధ పడిపోతాం. అలాంటింది కారుపై ఇనుప కడ్డీని తీసుకొని ఇష్టం వచ్చినట్లు గీకేస్తే ఇంకేమవుతుంది. ఇదిగో ఈ ఫొటోలను చూడండి, ఇది పెయింట్‌తో చేసిన ఆర్ట్ కాదు. పదునైన సూది ముల్లు కలిగిన మెషిన్‌తో కారుపై నగిషీలను చెక్కుతూ సృష్టించిన ఆర్ట్. సింపుల్‌గా చెప్పాలంటే స్క్రాచ్ ఆర్ట్.
'ఎక్సోటిగ్ ఇంగ్రావింగ్స్' (Exotic Engravings) పౌండర్ మరియు సీఈఓ షాన్ లిస్‌జాక్ (Shawn Lisjack) ఓ హోండా సివిక్ కారును తన స్క్రాచ్ ఆర్ట్‌తో ఇలా మార్చేశాడు. కారుపై గీతలు పడటంతో ఈ గీతల్నే ఆర్ట్‌గా మార్చాలని షాన్ నిర్ణయించుకున్నాడు. అంతే వెంటనే తనలోని సృజనాత్మకతకు పనిచెప్పి హోండా సివిక్ కారుకు ఓ సరికొత్త అందాన్ని తెచ్చిపెట్టాడు. ఈ ఆర్ట్‌ను పూర్తి చేయటానికి దాదాపు 5000 గంటలకు పైగా సమయం పట్టిందట.
కారులోని ప్రతి భాగంపై ఈ స్క్రాచ్ ఆర్ట్ కనిపిస్తుంది. చివరకు ఇంజన్, విడిభాగాలపై కూడా షాన్ నగిషీలను చెక్కి అందంగా మలచాడు. వాస్తవానికి షాన్ 2007లోనే చెక్కలపై నగిషీలను చెక్కటం ప్రారంభించాడు. ఇదే కాన్సెప్ట్‌ను కార్లకు ఎందు వర్తింప చేయకూడదని అతడి బుజ్జి బుర్రలో ఆలోచన రావటంతో వెంటనే పాత హోండా సివిక్ కారును తీసుకొని ఇలా మార్చేశాడు. ఈ స్క్రాచ్ ఆర్ట్‌ను మనం కూడా చూసొద్దాం రండి..!

Click it and Unblock the Notifications