బస్సుపై కారు డ్రైవర్ దాడి.. కేవలం వీడియో తీస్తూ కూర్చున్న డ్రైవర్!!
ప్రస్తుతం ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఓ వాహనదారుడు బస్‌పై బేస్‌బాల్ బ్యాట్‌తో దాడిచేయడం ఈ వీడియోలో చూడొచ్చు. అయితే ఈ ఘటనలో బస్సులోని ప్రయాణికులు సహా డ్రైవర్ కూడా ప్రశాంతంగా చూస్తు తన ఫోన్‌లో వీడియో రికార్డు గమనార్హం.
బెస్ట్ బస్సు ముందు నిలిపి ఉన్న హోండా బ్రియా డ్రైవర్‌గా ఉన్న వ్యక్తి పదే పదే బస్సుపై దాడి చేయడం ఈ వీడియోలో చూడవచ్చు. బేస్‌బాల్ బ్యాట్‌తో బస్సు హెడ్‌లైట్లపై దాడిచేయడం వీడియో గమనించవచ్చు. మరియు ORVMని కూడా ధ్వంసం చేశాడు. హోండా కారు డ్రైవర్.. బస్సు విండ్ స్క్రీన్‌పై దాడి చేసి ధ్వంసం చేశాడు.

అయితే ఈ ఘటన జరుగుతున్న సమయంలో బస్సులు డ్రైవర్ సహా అందులోని ప్రయాణికులు నిశబ్దంగా ఉండడాన్ని గమనించవచ్చు. అయితే ఆ ఘటనను మాత్రం వారు రికార్డు చేస్తునే ఉన్నారు. ప్రయాణికులను పోలీసులకు సమాచారం ఇవ్వమని బస్సు డ్రైవర్ చెప్పడం గమనించవచ్చు.
అయితే సమాచారం ప్రకారం.. బెస్టు బస్సు డ్రైవర్.. ట్రాఫిక్ కారణంగా ముందున్న హోండా కారును వెనుక నుంచి ఢీకొట్టినట్లు సమాచారం. అనంతరం కారు నుండి బయటకు వచ్చిన డ్రైవర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే అసలు కారణం ఇదేనా కాదా అనేది అస్పష్టం.
బెస్ట్ బస్సులో ప్రయాణిస్తున్న అనిష్ బెనర్జీ అనే వ్యక్తి ఈ వీడియోను పోస్టు చేశాడు. రాత్రి సమయంలో ఓ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా తమ బస్సుపై బేస్‌బాల్ స్టిక్‌తో దాడిచేసినట్లు రాసుకొచ్చాడు. ముందు అద్దం, పక్క అద్దాన్ని సైతం కూడా ధ్వంసం చేసినట్లు రాశాడు. ఈ ఘటన కారణంగా రోడ్డుపైన ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిందని రాసుకొచ్చాడు. సదరు వాహనదారునిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు. ఈ పోస్ట్‌పై స్పందించిన ముంబయి పోలీసులు.. దగ్గరలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు.
అయితే ఇలాంటి ఘటనల సమయంలో ఎలా ప్రవర్తించాలో డ్రైవర్ అలానే ప్రవర్తించారు. మరియు ఎలాంటి కేసుల్లో ఇరుక్కోకుండా చూసుకున్నాడు. రోడ్లపై డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రశాంతంగా ప్రవర్తించడం చాలా ముఖ్యం. భారత్‌లోని అస్తవ్యస్తమైన రోడ్లపై ఇలాంటి ఘటనలను నివారించడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి.
రిలాక్స్‌గా ఉండండి: డ్రైవర్‌కు ఓదార్పు అనుభవంగా ఉండాలి. పాటలు ప్లే చేయడం, ఎయిర్ కండిషనర్ సర్దుబాటు చేయడం ద్వారా రిలాక్స్ వాతావరణాన్ని కల్పించండి. పాజిటివ్ దృక్పథంతో రోడ్డుపైకి చేరండి.
ట్రాఫిక్ నియమాలు పాటించండి: ఆ రోడ్లపై వేగానికి ఉన్న పరిమితులను తెలుసుకొని పాటించండి. రోడ్లపై లేన్లు మారుతున్నప్పుడు సిగ్నల్ లైట్లను వినియోగించండి. రివ్యూ మిర్రర్‌ను చూస్తు మీ పరిసర ప్రాంతాలను సరిగ్గా అవగాహన చేసుకోండి.
తప్పులను గుర్తించండి : ఇతర వాహన డ్రైవర్లు కూడా తప్పులు చేయవచ్చని, లేదా దూకుడుగా ప్రవర్తించవచ్చని గుర్తుపెట్టుకోండి.
ఏదైనా ఘటన జరిగినప్పుడు నెగెటివ్‌గా ప్రవర్తించకుండా, ఎదుటవారి తప్పులను క్షమించండి.
పైన చెప్పిన చిట్కాలు పాటించడం వల్ల సురక్షితమైన డ్రైవింగ్ వాతావరణానికి సహకరించవచ్చు. ఏదైనా ప్రమాదం జరిగినా పైన చిట్కాలు పాటించడం వల్ల ప్రభావం తగ్గుతుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








