తేనెటీగలకే తలొగ్గిన అమెరికా అత్యంత శక్తివంతమైన ఎఫ్-22 రాప్తర్
అమెరికా రూపొందించిన ఎఫ్-22 ఫైటర్ విమానం వ్యూహాత్మక దాడులను మరియు యుద్దాలను ఎదుర్కోడానికి బాగా పేరుగాంచింది. కాని ఒక తేనెటీగల గుంపు చేసిన దాడికి ఆగిపోయింది. సుమారుగా 20,000 తేనిటీగల సముహం ఈ ఎఫ్-22 రాప్తర్ ఫైటర్ జెట్‌ను ముట్టడించి ఆపేసాయి.

ఎఫ్-22 రాప్తర్ ఫైటర్ జెట్ విమానం యొక్క ఎగ్జాస్ట్ నాజిల్‌ను ఒక తేనెటీగల గుంపు మూసేసింది. తద్వారా ఎగ్జాస్ట్ సిస్టమ్‌లో సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది.

ఎయిర్ క్రాప్ట్ మెయింటెనెన్స్ స్వ్కాడ్రన్ కు చెందిన ఎయిర్ మెన్‌కు ఎన్నడూ జరగని ఇలాంటి సంఘటనకు ఏం చేయాలో పాలు పోలేదు.

అయితే ఆ తరువాత తన కమాండింగ్ అధికారితో మాట్లాడిన తరువాత వాటిని తొలగించడానికి తేనెటీగలను పట్టే వ్యక్తిని సంప్రదించాడు.

వెస్ట్రిచ్ అనే ఆ తేనెటీగలను పట్టే వ్యక్తి వ్యాక్యూమ్ క్లీనర్ ద్వారా ఎఫ్-22 రాప్తర్‌కు అంటిపెట్టుకున్న తేనెటీగలను సేకరించి దూరంగా వదిలివేశాడు.

మెయింటెన్స్ గ్రూప్‌లో ఉన్న ముఖ్య అధికారి మాట్లాడుతూ, ప్రారంభంలో కొన్ని తేనీగలు మాత్రమే వచ్చాయి, తరువాత ఒక ఆడ తేనీగ వచ్చి అక్కడ వాలడం వలన మొత్తం గుంపు విమానం యొక్క ఎగ్జాస్ట్ భాగాన్ని మొహరించాయి. తద్వారా అనతి కాలంలో తేనె తుట్టు తయారు చేసుకున్నాయి. అయితే వాటన్నింటి జాగ్రత్త సేకరించి దూరంగా వదిలినట్లు తెలిపాడు.

కొన్ని దేశాలనే తుడిచి పెట్టే సామర్థ్యం ఉన్న ఈ ఎఫ్-22 రాప్తర్ పైటర్ జెట్ కేవలం తేనెటీగల మొహరింపు కారణంగా ఆగిపోయింది. అయితే వాటిని తొలగించిన తరువాత ఈ జెట్ యథావిధంగా ప్రయాణించింది.

మేడిన్ ఇండియానే కాని అంతర్జాతీయంగా వీటికున్న డిమాండే వేరు
రియల్ లైఫ్ సుల్తాన్: బంగారపు విమానాన్ని కలిగి ఉన్న సుల్తాన్ ఆఫ్ జోహార్


Click it and Unblock the Notifications








