కార్ రేస్‌లో అపశృతి: గోడను ఢీకొట్టిన లాంబోర్గినీ కార్
సూపర్‌కార్ రేస్‌లు ఎంత సరదాగా ఉంటాయో, అంతే ప్రమాదకరంగా ఉంటాయి. ఇదిగో ఈ వీడియోలో చూడండి, ఓ రేసులో పాల్గొన్న లాంబోర్గినీ గల్లార్డో కారు అదుపుతప్పి ఎలా మంటల్లో చిక్కుకుపోయిందో..! (బలహీనమైన హృదయం ఉన్న వాళ్లు ఈ వీడినియో వీక్షించకపోవటమే ఉత్తమం).
లాంబోర్గినీ బ్లాంక్‌పెయిన్ సూపర్ ట్రోఫియో రేస్ కార్యక్రమంలో పాల్గొన్న లాంబోర్గినీ గల్లార్డో ఎల్‌పి560-4 డ్రైవర్ కంట్రోల్ తప్పి, రేస్ ట్రాక్‌కు పక్కగా ఉన్న గోడను బలంగా ఢీకొట్టడంతో కారు అక్కడికక్కడే ముక్కలు కావటం, పెట్రోల్ ట్యాంక్ బ్లాస్ట్ కావటంతో, కారులో ఒక్కసారిగా మంటలు అలముకున్నాయి.
రేస్ డ్రైవర్ కూడా ఆ కారులోనే ఇరుక్కుపోయాడు. మంటలు ఆర్పేందుకు రేస్ మార్షల్స్ పరుగు పరుగున వచ్చారు. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో డ్రైవర్‌కు బలమైన గాయాలే తగిలాయి. అతని కాలి ఎముకలు విరగటంతో పాటుగా, శరీరం మొత్తం దాదాపు 40 శాతం వరకు కాలిపోయింది.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/hx_AmbDClYs?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








