Just In
Don't Miss
- Lifestyle
సోమవారం దినఫలాలు : అనవసరమైన పనులకు ఎక్కువ డబ్బు ఖర్చు చేయవచ్చు...!
- News
వ్యవసాయ చట్టాల రద్దు తప్ప.. ఏదైనా అడగండి: కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్
- Movies
ట్రెండింగ్ : కొంచెం కూడా ఇంగితజ్ఞానం లేదా.. పైకి కనపడేది నిజం కాదు.. మళ్లీ బుక్కైన నాగబాబు
- Finance
పెట్రోల్, డీజిల్ వాడకం భారీగా తగ్గినా.. ఆదాయం అదుర్స్: ఎందుకంటే
- Sports
సెహ్వాగ్ చెప్పిన ప్రకారం గబ్బాలో భారత్‌దేనా విజయం..?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కొడుకు ఇచ్చిన ఐడియాతో తండ్రి సృష్టించిన ఎలక్ట్రిక్ సైకిల్ ; చూసారా..!
భారతదేశంలో రోజు రోజుకి ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ బాగా పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు నిరంతరం పెరగడమే దీనికి ఒక ప్రధాన కారణం. పర్యావరణం సమతుల్యంగా ఉండటానికి కూడా ఈ ఎలక్ట్రిక్ వాహనాలు బాగా ఉపయోగపడతాయి. ఇది ఒక రకంగా ఆరోగ్యంగా ఉండటానికి కూడా దోహదపడుతుంది.

ఈ కారణంగా దేశీయ మార్కెట్లో దాదాపు అన్ని ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని ప్రారంభించాయి. కానీ భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు పెద్ద సంఖ్యలో ఉపయోగించబడవు. హ్యుందాయ్, ఎంజి, టాటా, ఏథర్, బజాజ్ వంటి కొన్ని కంపెనీలు మాత్రమే ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయిస్తున్నాయి.

ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్నిపెంచడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాయి. ఇది రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచే అవకాశం ఉంది.
MOST READ:ఇండియాలో ఇప్పుడు అతి తక్కువ ఖర్చుతోనే హెలికాఫ్టర్ సర్వీస్.. ఎక్కడో తెలుసా ?

ఈలోపు కొందరు తమ పెట్రోల్, డీజిల్ వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మారుస్తున్నారు. ఇప్పుడు కృష్ణగిరి జిల్లాలోని హోసూర్‌కు చెందిన ఒక కార్మికుడు తన సైకిల్‌ను ఎలక్ట్రిక్ సైకిల్ గా మార్చిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.

ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ సైకిల్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. హోసూర్ అవలపల్లి అడ్కో ప్రాతంలో చాలా పెద్ద పరిశ్రమలు ఉన్నాయి. ఐటిఐ చదివిన పాండిరాజన్ అక్కడి ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు.
MOST READ:బిఎస్ 4 వాహనాల రిజిస్ట్రేషన్ రద్దుచేసిన సుప్రీంకోర్టు : ఎందుకో తెలుసా ?

అతను పనిచేస్తున్న ఫ్యాక్టరీ లాక్ డౌన్ సమయంలో మూసివేయబడింది. లాక్ డౌన్ సడలించిన తరువాత అతడు పని చేసే ఫ్యాక్టరీ పునః ప్రారంభించబడింది. కరోనా వైరస్ విజృంభించిన సమయంలో పాండిరాజన్ తన సైకిల్ ని ఎలక్ట్రిక్ సైకిల్ గా తయారుచేసాడు.

పాండిరాజన్ ఫ్యాక్టరీకి వెళ్లే దారి చదునుగా లేదు. అనేక హెచ్చు తగ్గులు ఉన్నాయి. ప్రతి రోజు సైకిల్ తొక్కిన తరువాత తనకి కీళ్ల నొప్పులు వచ్చేవి. పాండిరాజన్ కొడుకు ఎక్కువ ఎత్తులో ప్రయాణించేటప్పుడు పెడల్ కి బదులుగా యాక్సిలరేటర్ ఉపయోగించమని సూచించాడు.
MOST READ:కొత్త అవతారం దాల్చిన మోడిఫైడ్ ప్రీమియర్ పద్మిని కార్

అతని సూచన సరైనదని అనుకున్న తరువాత వారు తమ సైకిళ్లను ఎలక్ట్రిక్‌గా మార్చాలని నిర్ణయించుకున్నారు. సైకిల్‌కు 250W మోటారు అమర్చారు. దీని కోసం పాండిరాజన్ రూ. 12000 రూపాయలు ఖర్చు చేసాడు.
ఎలక్ట్రిక్ సైకిల్‌ను తయారుచేయడం వల్ల పాండిరాజన్ ను చాలామంది ప్రశంసించారు. దీనిపై సన్ న్యూస్ తమిళం ప్రత్యేక కథనాన్ని నివేదించింది.
MOST READ:భారత మార్కెట్లో విడుదల కానున్న బిఎస్ 6 సిఎఫ్‌మోటో బైక్‌లు

పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటం వల్ల వాహనదారులు చాల వరకు ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించడంపై మొగ్గు చూపుతున్నారు. అంతే కాకుండా బహిరంగ ప్రదేశాలకు వెళ్తే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందనే భయం కూడా ఒక కారణం అయింది. సాధారణంగా ఎత్తైన ప్రదేశాలలో సైక్లింగ్ చేయడం అంత సులభం కాదు. ఈ కారణంగా పాండిరాజన్ ఎలక్ట్రిక్ సైకిల్ అభివృద్ధి చేయవలసి వచ్చింది. ఈ విధంగా పుట్టుకొచ్చినదే ఈ ఎలక్ట్రిక్ సైకిల్
Image Courtesy: Sun News Tamil