ఫెరారీ కారు చుట్టూ ఇంటిని కట్టేసిన కార్ ప్రియుడు..
మనషులు నివసించడానికి ఇళ్లు ఇరుకుగా మారుతున్న నేటి రోజుల్లో ఎవరైనా కారు కోసం ఇళ్లు కడతారా..? కారుపై ఎంత ప్రేమ ఉంటే మాత్రం దానికి ఓ మంచి షెడ్డును కడతాం కాని, అత్యంత విలాసతమైన ఇంట్లో కారును పెడతామా చెప్పండి. అలాంటి ఓ సంఘటన ఈ కథనం. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌కు చెందిన ఆర్కిటెక్ట్ హోల్గర్ స్కుబెర్ట్ వద్ద ఓ అందమైన ఫెరారీ 512 బిబిఐ కారు ఉంది.
కార్ ప్రియులందరి మాదిరిగానే హోల్గర్‌కు కూడా తన ఫెరారీ 512 బిబిఐ కారంటే కూడా చాలా ఇష్టం. కానీ ఎంత ఇష్టమంటే ఈ కారు కోసం ఓ విలాసవంతమైన ఇంటిని కట్టించేంత ఇష్టం. లివింగ్ క్వార్టర్, ఆఫీస్, గ్యారేజ్ మరియు ఆర్ట్ గ్యాలరీలా ఉండేలా ఈ ఇంటిని డిజైన్ చేశారు. ఈ ఫెరారీ కారు చాలా అరుదైనది, ఆర్ట్ పీస్ వంటిది. ఈ ఇంటి మొత్తానికి ఈ ఫెరారీ 512 బిబిఐ కారు ప్రధాన ఆకర్షనగా నిలుస్తుంది.
క్రిస్టల్ క్లియర్ గ్లాస్ వాల్స్, ఆకర్షనీయమైన ఇంటీరియర్ లైటింగ్, ప్రీమియం ఫర్నిచర్ ఈ ఇంటిలో గమనించవచ్చు. సూర్యకాంతి నేరుగా కారుపై పడుతుంటే, అప్పుడు ఆ కారు అందాన్ని చూసి ఎవ్వరైనా మైమరచిపోవాల్సిందే. ఈ కారును బయటకు తీసుకువచ్చేందుకు రోడ్‌ను కనెక్ట్ చేస్తూ ఓ బ్రిడ్జ్‌ను ఏర్పాటు చేశారు. ఈ అందమైన ఫెరారీకారు మరియు ఆ కారు ఇంటి గురించి హోల్గర్ ఏం చెబుతున్నాడో ఈ క్రింది వీడియోలో గమనించండి.

ఫెరారీ కారు చుట్టూ ఇళ్లు
కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌కు చెందిన ఆర్కిటెక్ట్ హోల్గర్ స్కుబెర్ట్ వద్ద ఓ అందమైన ఫెరారీ 512 బిబిఐ కారు ఉంది. కార్ ప్రియులందరి మాదిరిగానే హోల్గర్‌కు కూడా తన ఫెరారీ 512 బిబిఐ కారంటే కూడా చాలా ఇష్టం. కానీ ఎంత ఇష్టమంటే ఈ కారు కోసం ఓ విలాసవంతమైన ఇంటిని కట్టించేంత ఇష్టం.

హౌస్ ఎక్స్టీరియర్
లివింగ్ క్వార్టర్, ఆఫీస్, గ్యారేజ్ మరియు ఆర్ట్ గ్యాలరీలా ఉండేలా ఈ ఇంటిని డిజైన్ చేశారు.

హౌస్ ఇంటీరియర్
ఈ ఫెరారీ కారు చాలా అరుదైనది, ఆర్ట్ పీస్ వంటిది. ఈ ఇంటి మొత్తానికి ఈ ఫెరారీ 512 బిబిఐ కారు ప్రధాన ఆకర్షనగా నిలుస్తుంది.

ఫెరారీ 512 బిబిఐ కారు
క్రిస్టల్ క్లియర్ గ్లాస్ వాల్స్, ఆకర్షనీయమైన ఇంటీరియర్ లైటింగ్, ప్రీమియం ఫర్నిచర్ ఈ ఇంటిలో గమనించవచ్చు. సూర్యకాంతి నేరుగా కారుపై పడుతుంటే, అప్పుడు ఆ కారు అందాన్ని చూసి ఎవ్వరైనా మైమరచిపోవాల్సిందే.

రోడ్డును కలుపుతూ బ్రిడ్జ్
ఈ కారును బయటకు తీసుకువచ్చేందుకు రోడ్‌ను కనెక్ట్ చేస్తూ ఓ బ్రిడ్జ్‌ను ఏర్పాటు చేశారు.
వీడియో
ఈ అందమైన ఫెరారీకారు మరియు ఆ కారు ఇంటి గురించి హోల్గర్ ఏం చెబుతున్నాడో ఈ క్రింది వీడియోలో చూడండి.


Click it and Unblock the Notifications








