ఆటోమొబైల్ రంగంపై 5G నెట్‌వర్క్ ప్రభావం ఎలా ఉండబోతోంది..?

భారతదేశంలో ఇటీవలే 5G నెట్‌వర్క్ అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. ఈ లేటెస్ట్ టెక్నాలజీ వేగవంతమైన డౌన్‌లోడ్ మరియు అప్‌లోడ్ వేగాన్ని అందించడమే కాకుండా, మునుపటి తరం నెట్‌వర్క్‌ల కన్నా తక్కువ జాప్యంతో కూడా వస్తుంది. ఈ వేగవంతమైన 5జి టెక్నాలజీతో మొబైల్ ఫోన్‌లో ఇంటర్నెట్‌ను ఉపయోగించే అనుభవం సరికొత్త స్థాయిలో ఉంటుంది, ఇప్పుడు అదే వేగవంతమైన సాంకేతికతను ఆటోమోటివ్ టెక్నాలజీ భవిష్యత్తును మార్చడానికి కూడా ఉపయోగించవచ్చు.

ఆటోమొబైల్ రంగంపై 5G నెట్‌వర్క్ ప్రభావం ఎలా ఉండబోతోంది..?

మొబైల్ ఇంటర్నెట్ విషయంలో మనం జిపిఆర్ఎస్ టెక్నాలజీ నుండి 5జి టెక్నాలజీకి చేరుకున్నాం. ఈ అధునాతన 5G సాంకేతికత సహాయంతో, వాహన తయారీదారులు రూపొందించే అధునాతన వాహనాలలో మనం నావిగేట్ చేసే విధానాన్ని సమర్థవంతంగా మార్చగల సరికొత్త కనెక్టింగ్ టెక్నాలజీ ఫీచర్లను అందించడం సాధ్యమవుతుంది. అంతేకాకుండా, సెల్యులార్ వెహికల్-టు-ఎవ్రీథింగ్ (C-V2X) మరియు కోఆపరేటివ్ ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్స్ (C-ITS) సహాయంతో 5G సాంకేతికత అనేక సందర్భాల్లో లైఫ్‌సేవర్‌గా ఉంటుంది.

ఆటోమొబైల్ రంగంపై 5G నెట్‌వర్క్ ప్రభావం ఎలా ఉండబోతోంది..?

అధునాతన 5G నెట్‌వర్క్ ద్వారా అమలు చేయబడే పైన పేర్కొన్న సాంకేతికతలు ట్రాఫిక్ జామ్‌లను నివారించడానికి మరియు అత్యవసర పరిస్థితుల్లో వాహనాలకు మార్గం కల్పించడానికి నిజ సమయంలో రహదారి మౌలిక సదుపాయాల సాంకేతికతతో కమ్యూనికేట్ చేయడంలో సహాయపడతాయి.

ఆటోమొబైల్ రంగంపై 5G నెట్‌వర్క్ ప్రభావం ఎలా ఉండబోతోంది..?

గార్ట్‌నర్ (Gartner) అంచనా ప్రకారం 5G టెక్నాలజీతో కూడిన కార్లు 2020లో 15 శాతం నుండి 2023లో 74 శాతానికి మరియు 2028లో 94 శాతానికి పెరుగుతాయని భావిస్తున్నారు. వాస్తవానికి, ఆటోమోటివ్ పరిశ్రమ 5G IoT (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) పరిష్కారాల కోసం అతిపెద్ద మార్కెట్‌గా మారుతుంది. మొత్తం 5G IoT ఎండ్‌పాయింట్ అవకాశంలో 53 శాతానికి పైగా ప్రాతినిధ్యం వహిస్తుంది.

ఆటోమొబైల్ రంగంపై 5G నెట్‌వర్క్ ప్రభావం ఎలా ఉండబోతోంది..?

లేటెస్ట్ 5జి టెక్నాలజీ యొక్క వేగవంతమైన ప్రతిస్పందన (ఫాస్టెస్ట్ రెస్పాన్స్) మరియు అధిక బ్యాండ్‌విడ్త్‌ కారణంగా, విశ్వసనీయ కనెక్షన్‌తో మెషిన్-టు-మెషిన్ కమ్యూనికేషన్‌ను మెరుగుపరచడం ద్వారా ఫిల్లీ అటానమస్ మరియు నాన్-అటానమస్ కార్లను చాలా సురక్షితంగా మార్చవచ్చు. అంతేకాకుండా, ఇది అధిక బిట్ రేట్ అధిక హైస్పీడ్ డేటా ట్రాన్స్‌ఫర్‌ను అనుమతిస్తుంది, తద్వారా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లలో సందర్భోచిత అవగాహనను మెరుగుపరుస్తుంది మరియు ఈ ప్రక్రియలో వాటిని మరింత సురక్షితంగా చేస్తుంది.

ఆటోమొబైల్ రంగంపై 5G నెట్‌వర్క్ ప్రభావం ఎలా ఉండబోతోంది..?

సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల విషయానికి వస్తే, 5జి టెక్నాలజీ ఆటోమొబైల్ తయారీదారులు కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), IoT (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) మరియు వర్చువల్ రియాలిటీతో కూడిన అధునాతన CASE (కనెక్ట్, అటానమస్, షేర్ మరియు ఎలక్ట్రిఫైడ్) టెక్నాలజీలను పూర్తిగా ఉపయోగించుకోవడానికి అనుమతిస్తుంది.

ఆటోమొబైల్ రంగంపై 5G నెట్‌వర్క్ ప్రభావం ఎలా ఉండబోతోంది..?

ఈ టెక్నాలజీ ఇప్పుడు దశల వారీగా అమలులోకి వస్తున్న నేపథ్యంలో, అనేక ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాల సామర్థ్యాన్ని మరియు భద్రతను మరింత మెరుగుపరచడానికి 5G టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి. వాస్తవానికి, ఎరిక్సన్ నేతృత్వంలోని ఐరోపాలోని 5GCAR ప్రాజెక్ట్ 5G సిస్టమ్ నిర్మాణాన్ని అభివృద్ధి చేస్తోంది. కంపెనీ చేసిన విస్తృతమైన పరిశోధనలతో, ఈ బృందం ఇప్పుడు 5G సాంకేతికత సమర్థవంతంగా మరియు సరిగ్గా పని చేయడానికి అవసరమైన అనేక కొత్త కేసులను గుర్తించింది. ఇందులో పాదచారుల రక్షణ కోసం దీర్ఘ-శ్రేణి సెన్సార్ షేరింగ్ కూడా ఉంటుంది.

ఆటోమొబైల్ రంగంపై 5G నెట్‌వర్క్ ప్రభావం ఎలా ఉండబోతోంది..?

అలాగే, జర్మన్ లగ్జరీ కార్ తయారీదారైన మెర్సిడెస్-బెంజ్ కూడా 5G టెక్నాలజీతో కొత్త విషయాలను ప్రయత్నిస్తోంది మరియు వాటిలో ఒకటి ఆటోమోటివ్ తయారీలో 5G సాంకేతికతను అమలు చేయడం. దీని కోసం, ఎరిక్సన్ మరియు టెలిఫోనికా జర్మనీ కంపెనీలు జర్మనీలోని సిండెల్‌ఫింజెన్‌లోని మెర్సిడెస్-బెంజ్ తయారీ ప్లాంట్‌లో ప్రైవేట్ 5G నెట్‌వర్క్ ద్వారా 5G కార్ ఉత్పత్తిని ప్రారంభించాయి.

ఆటోమొబైల్ రంగంపై 5G నెట్‌వర్క్ ప్రభావం ఎలా ఉండబోతోంది..?

ఈ విషయం గురించి మెర్సిడెస్-బెంజ్ కార్స్ ప్రొడక్షన్ అండ్ సప్లై చైన్ యొక్క డివిజనల్ బోర్డ్ ఆఫ్ మేనేజ్‌మెంట్ సభ్యుడు జోర్గ్ బర్జర్ మాట్లాడుతూ, "స్థానిక 5G నెట్‌వర్క్‌ను ఇన్‌స్టాల్ చేయడంతో, మెర్సిడెస్-బెంజ్‌లోని అన్ని ఉత్పత్తి వ్యవస్థలు మరియు యంత్రాల నెట్‌వర్కింగ్ కార్ల ఫ్యాక్టరీలు భవిష్యత్తులో మరింత తెలివిగా మరియు మరింత సమర్థవంతంగా మారతాయి. ఇది పూర్తిగా కొత్త ఉత్పత్తి అవకాశాలను తెరుస్తుంది" అని చెప్పారు.

ఆటోమొబైల్ రంగంపై 5G నెట్‌వర్క్ ప్రభావం ఎలా ఉండబోతోంది..?

కార్ల తయారీ మరియు కారులోని ఫీచర్ల కోసం ఈ 5జి టెక్నాలజీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లయితే, మనం భవిష్యత్తులో చూడబోయే కార్లు సైన్ ఫిక్షన్ లేదా జేమ్స్ బాండ్ చిత్రాలలో కనిపించిన వాహనాల మాదిరిగా చాలా ఫ్యూచరిస్టిక్‌గా మారే అవకాశం ఉంది. మన దేశంలో ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్లు మరియు హై-ఎండ్ కార్లలో అనేక అధునాతన సేఫ్టీ అండ్ కంఫర్ట్ ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ కొత్త టెక్నాలజీ రాకతో ఈ ఫీచర్లు మరింత సమర్థవంతంగా మారే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Tuesday, October 11, 2022, 10:05 [IST]
English summary
How 5g technology can reshape the future of automotive industry
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+