Aditya L1 సూర్యుడిపై పరిశోధనలతో ఆటోమొబైల్ రంగంలో వచ్చే మార్పులేంటి..?
చంద్రయాన్-3 ఘన విజయంతో ఉత్సాహంగా ఉన్న ఇస్రో సూర్యుడిపైన కీలక పరిశోధనలు చేసేందుకు సర్వం సిద్ధం చేసింది. సెప్టెంబర్ 2 ఆదిత్య L1 ప్రాజెక్టును లాంచ్ చేయనుంది. ఇది భారత్ తొలి సౌర మిషన్. సెప్టెంబర్ ఉదయం 11.50 గంటలకు ఈ అంతరిక్ష నౌకను ప్రయోగించనుంది.
ఆదిత్య ఎల్ 1 మిషన్ ద్వారా లభించిన సమాచారంతో పునరుత్పాదక రంగంలో కీలక పరిణామాలు చోటుచేసుకొనే అవకాశం ఉంది. ముఖ్యంగా సోలార్ పవర్‌తో నడిచే సరికొత్త వాహనాల ఆవిష్కరణలకు మార్గం సుగమం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ కీలక సమాచారం ఆధారంగా సౌర వికిరణాన్ని అధ్యయనం చేసేందుకు ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. ఇది వాహనాల్లో ఉపయోగించే సోలార్ ప్యానల్ సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు ఈ సమాచారం చాలా కీలకమని భావిస్తున్నారు.

ఈ సౌర మిషన్ ద్వారా సేకరించిన సమాచారం ఎలక్ట్రిక్ వాహనాలకు కీలకమైన సౌర ఘటాలు, బ్యాటరీ అభివృద్ధికి దోహదపడుతుందని తెలుస్తోంది. ఫలితంగా ప్రస్తుతం ఉన్న బ్యాటరీలు, ప్యానళ్లు కంటే మరింత శక్తివంతమైన, సమర్థవంతమైన పరికరాలను తయారుచేసేందుకు అవకాశం ఉంటుందని సమాచారం. పునరుత్పాదక ఇంధన రంగంలో గణనీయమైన స్థాయిలో ప్రభావితం చేస్తుందని. ప్రపంచంలో అతిపెద్ద సోలార్ వాహనాల తయారీదారుగా అవతరించేందుకు అవకాశం ఉంటుందని సమాచారం.
ఆదిత్య ఎల్1 మిషన్ ద్వారా సూర్యుడిని మరింత కచ్చితత్వంతో అర్థం చేసుకోగలుగుతాం. ఈ మిషన్ నుంచి వచ్చే సమాచారం ఆధారంగా సోలార్ వాహనాల తయారీ ప్రమాణాలు, వాటి పాలసీలను నూతనంగా రూపొందించేందుకు అవకాశం ఉంటుంది. మరింత సమర్థవంతమైన సోలార్ వాహనాలను అభివృద్ధి చేయవచ్చును.

ఆదిత్య ఎల్1 మిషన్ ఆటోమొబైల్ పరిశ్రమలో పెను విప్లవం తీసుకొచ్చే అవకాశం ఉంది. సోలార్ కార్ల సామర్థ్యాన్ని మెరుగుపరచడం, ఖర్చు తగ్గించడం సహా ప్రజలకు అనువైన రీతిలో తయారీని ప్రోత్సహించవచ్చు. ఫలితంగా ఆటోమొబైల్స్ పరిశ్రమలో పునరుత్పాదక రంగం క్రమంగా అభివృద్ధి చెందుతుంది.
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి ఆదిత్య ఎల్1 అంతరిక్ష నౌకను ఉదయం 11.50 గంటలకు ప్రయోగించనున్నారు. భూమి నుంచి సూర్యుడి దిశలో 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని తొలి లాగ్రాంజియన్ పాయింట్ చుట్టు ఉన్న కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ఫలితంగా గ్రహణంతో సంబంధం లేకుండా సూర్యుడిపై నిరంతరం అధ్యయనం చేసేందుకు అవకాశం ఉంటుందని ఇస్రో భావిస్తోంది. సూర్యుడి నుంచి ప్రసరించే అత్యంత శక్తివంతమైన కాంతి ప్రభావాన్ని తట్టుకొనే విధంగా ఆదిత్య ఎల్1 పేలోడ్‌లను తయారుచేశారు.

ఆదిత్య ఎల్1 వ్యోమనౌకలో మొత్తం 7 రకాల పరికరాలను అమర్చారు. ఇవి సూర్యుడి ఫోటోస్పియర్, క్రోమోస్పియర్ సహా కరోనా బయటి పొరను ఇవి అధ్యయనం చేయనున్నాయి. ఈ సమాచారాన్ని తిరిగి భూమిపైకి పంపిస్తాయి. ఇప్పటి వరకు అమెరికా, జపాన్, చైనా, యూరప్ సూర్యుడి అధ్యయనం కోసం అంతరిక్ష నౌకలను పంపాయి. ఈ జాబితాలో భారత్ చేరనుంది.
సూర్యుడు భూమికి అత్యంత సమీపంలో ఉన్న నక్షత్రం. అందువల్ల సూర్యుడిపై అధ్యయనం చేయడం ద్వారా సమీపంలో ఉన్న ఇతర నక్షత్రాల స్వభావం గురించి తెలుసుకోవచ్చని ఇస్రో భావిస్తోంది. ఇది పాలపుంతలోని ఇతర నక్షత్రాలు, గ్రహాల గురించి సరైన సమాచారం తెలుసుకోవచ్చని భావిస్తోంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








