వీడియో: మీరు ఈ బుడ్డోడిలా కారు పార్క్ చేయగలరా?
గో కార్టింగ్.. అనేది చిన్న పిల్లల కోసం ఉద్దేశించబడిన ఫార్ములా వన్ రేస్ లాటింది. రెగ్యులర్ ఫార్ములా వన్ రేసింగ్ మాదిరిగానే ఇది కూడా ఖరీదైన మోటార్‌స్పోర్ట్. ప్రత్యేకించి చిన్నతనం నుంచే ఫార్ములా వన్, మోటార్‌స్పోర్ట్స్‌లలో పిల్లలకు శిక్షణ ఇచ్చేందుకు, అవగాహన కల్పించేందుకు ఈ గో కార్టింగ్‌ను నిర్వహిస్తుంటారు.
ప్రపంచంలోని దాదాపు అనేక దేశాలలో (మనదేశంలో కూడా) ఈ గో కార్టింగ్ పిల్లల కోసం అందుబాటులో ఉంటుంది. ఈ గో కార్టింగ్ ప్రక్రియలో చిన్న సైజు కార్లు (కొన్ని బ్యాటరీతో నడిచేవి, కొన్ని రెగ్యులర్ ఇంజన్లతో నడిచేవి) ఉంటాయి. ఇవి చూడటానికి చిన్నగానే ఉన్నప్పటికీ వీటి పెర్ఫార్మెన్స్ మాత్రం పెద్ద కార్ల మాదిరిగానే ఉంటుంది.
ఇది కూడా చూడండి: లేడీస్ డ్రైవింగ్ ఇలానే ఉంటుందా?
గో కార్టింగ్‌లో మంచి అనుభవం సంపాధించుకున్న పిల్లలు పెద్దవాళ్లయ్యాక ఫార్ములా వన్ రేసింగ్‌లో రాణించగలరు. సరే అదంతా అటుంచితే.. ఈ గో కార్టింగ్ రేస్‌లో ఎక్స్‌పర్ట్ అయిన బుడ్డోడు మాత్రం పెద్దవాళ్ల మాదిరిగా కారును ఎలా రివర్సులో పార్క్ చేశాడో మీరే చూడండి.
వేగంగా వస్తున్న గో కార్ట్ కారును డ్రిఫ్ట్ చేసి, రివర్సులోకి తీసుకొని అంతే వేగంతో వెనకకు డ్రైవ్ చేసుకుంటూ వచ్చి, గ్యారేజ్‌లో పార్క్ చేసిన విధానం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కారును పార్క్ చేసిన తర్వాత ఆ బాలుడు ఫేమస్ ఫార్ములా వన్ డ్రైవర్ల మాదిరిగా ఆటిట్యూడ్‌తో ముందుకు నడుచుకుంటూ పోతుంటే, చూడటానికి ఎంతో ముచ్చటగా అనిపిస్తుంది. మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా ఆ వీడియోని చూసేయండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/RbVFI08yj1I?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








