స్విఫ్ట్ కారుకు ఆ పేరెలా వచ్చింది మరియు సుజుకి స్విఫ్ట్ చరిత్ర

Written By:

12 సంవత్సరాల క్రితం దేశీయ మార్కెట్లోకి విడుదలయ్యి, భారత దేశపు బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచి మరియు ప్రపంచ దేశాలకు విపరీతంగా ఎగుమతి అవుతున్న స్విఫ్ట్ కారుకు దేశీయంగా భారీ అభిమానులు ఉన్నారు. మరి ఈ కారుకు స్విఫ్ట్ అనే పేరు ఎలా వచ్చింది మరియు స్విఫ్ట్ చరిత్ర గురించి పూర్తి వివరాలు నేటి కథంలో తెలుసుకుందాం రండి.

స్విఫ్ట్ కారుకు ఆ పేరెలా వచ్చింది మరియు సుజుకి స్విఫ్ట్ చరిత్ర

ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ వ్యాసింజర్ కార్ల తయారీ సంస్థగా ఎదిగిన సుజుకి ప్రాణం పోసుకుంది జపాన్ దేశంలో. ఒక్కో దేశంలో ఒక్కో ప్రాంతీయ సంస్థతో చేతులు కలుపుతూ శాఖోపశాఖలుగా ఎదుగుతూ వచ్చింది.

స్విఫ్ట్ కారుకు ఆ పేరెలా వచ్చింది మరియు సుజుకి స్విఫ్ట్ చరిత్ర

సుజుకి భారత దేశంలో మారుతి ఉద్యోగ్ సంస్థతో చేతులు కలిపి మారుతి సుజుకిగా అవతరించింది. మరియు ప్రపంచ వ్యాప్తంగా అనేక పేర్లతో పిలువబడే కారును ఇండియన్ మార్కెట్లోకి 2005 లో స్విఫ్ట్‌గా పరిచయం చేసింది.

స్విఫ్ట్ కారుకు ఆ పేరెలా వచ్చింది మరియు సుజుకి స్విఫ్ట్ చరిత్ర

దేశీయంగా స్విఫ్ట్ పరిచయం చేసిన అనంతరం భారీ బుకింగ్స్ మరియు విక్రయాలతో అనేక సంచలనాలు సృష్టించింది. అనేక ప్రపంచ దేశాలకు కూడా ఎగుమతయ్యే స్విఫ్ట్‌కు దేశీయంగా భారీ సంఖ్యలో అభిమానులు పోగయ్యారు.

స్విఫ్ట్ కారుకు ఆ పేరెలా వచ్చింది మరియు సుజుకి స్విఫ్ట్ చరిత్ర

దేశం మొత్తం మారుమ్రోగిపోతున్న స్విఫ్ట్ కారుకు ఆపేరెలా వచ్చింది. మరియు దీని వెనుక చరిత్రం ఏంటి...? అనే విషయాలను ఇవాళ్టి కథనంలో తెలుసుకుందాం రండి.

స్విఫ్ట్ కారుకు ఆ పేరెలా వచ్చింది మరియు సుజుకి స్విఫ్ట్ చరిత్ర

సుజుకి సంస్థ 1983 నుండి 2003 వరకు సూపర్ మినీ సెగ్మెంట్లో కల్టస్ అనే కారును ఉత్పత్తి చేసింది. 25వ టోక్యో మోటార్ షో లో కల్టస్ కారును తొలిసారిగా ప్రదర్శించింది. సుమారుగా ఏడు దేశాలలో, మూడు తరాలుగా కల్టస్ కారును విక్రయిస్తూ వచ్చింది.

స్విఫ్ట్ కారుకు ఆ పేరెలా వచ్చింది మరియు సుజుకి స్విఫ్ట్ చరిత్ర

జపాన్ మార్కెట్లో కల్టస్ పేరుతో విక్రయించే సమయంలో ప్రపంచ దేశాలలో సుజుకి స్విఫ్ట్, సుజుకి ఫోర్సా, సుజుకి జాజ్, షెవర్లే స్విఫ్ట్, షెవర్లే స్ప్రింట్, స్ప్రింట్ మెట్రో, జియో(Geo) మరియు షెవర్లే మెట్రో, పోంటియాక్ ఫైర్ ఫ్లై, మరియు మారుతి 1000 పేర్లుతో ఉన్న కార్లకు స్విఫ్ట్ పేరును నామకరణం చేసింది సుజుకి.

స్విఫ్ట్ కారుకు ఆ పేరెలా వచ్చింది మరియు సుజుకి స్విఫ్ట్ చరిత్ర

2007 వరకు భారత్‌లో కల్టస్ కార్లను విక్రయించగా, పాకిస్తాన్ మరియు చైనా దేశాలలో కల్టస్ కారును ఇప్పటికీ విక్రయిస్తోంది సుజుకి.

స్విఫ్ట్ అనగా...?

స్విఫ్ట్ అనగా...?

స్విఫ్ట్ అనే ఆంగ్ల పదానికి అర్థం వేగవంతమైన. వేగవంతమైన అనే అర్థం వచ్చే విధంగా ఈ స్విఫ్ట్ పేరును సేకరించి సుజుకి వివిధ దేశాల్లో అనేక పేర్లతో విడుదల చేసిన ఒకే కారుకు స్విఫ్ట్ ను ఖరారు చేసి, దాన్ని అలాగే కొనసాగిస్తూ వస్తోంది.

మొదటి తరం స్విఫ్ట్

మొదటి తరం స్విఫ్ట్

2000 సంవత్సరంలో సుజుకి కల్టస్ పేరుకు బదులుగా స్విఫ్ట్ పేరుతో మొదటి తరం కారుగా విడుదల చేసింది. ఈ మొదటి తరం స్విఫ్ట్‌లో నాలుగు సిలిండర్ల గ్యాసోలిన్ ఇంజన్‌లు ఉండేవి.

స్విఫ్ట్ కారుకు ఆ పేరెలా వచ్చింది మరియు సుజుకి స్విఫ్ట్ చరిత్ర

1.3 మరియు 1.5-లీటర్ సామర్థ్యంతో అందుబాటులో ఉండే వీటిలో 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం ఉండేది. మరియు 1.3-లీటర్ స్విప్ట్ వేరియంట్‌కు హెచ్‌టి51ఎస్ మరియు 1.5-లీటర్ వేరియంట్‌కు హెచ్‌టి81ఎస్ అనే వెర్షన్‌లను కూడా పరిచయం చేసింది.

స్విఫ్ట్ కారుకు ఆ పేరెలా వచ్చింది మరియు సుజుకి స్విఫ్ట్ చరిత్ర

అమెరికా దిగ్గజం జనరల్ మోటార్స్ సుజుకితో చేతులు కలిపి ఈ హెచ్‌టి51ఎస్ మరియు హెచ్‌టి81ఎస్ కార్ల ఆధారంతో అనేక కొత్త మోడళ్లను అభివృద్ది చేసి షెవర్లే క్రజ్‌గా ఆవిష్కరించింది మరియు ఆస్ట్రేలియాకు చెందిన ఓ సంస్థ హోల్డన్ క్రజ్ పేరుతో ఆవిష్కరించింది.

రెండవ తరం స్విఫ్ట్ (2004-2010)

రెండవ తరం స్విఫ్ట్ (2004-2010)

సుజుకి సంస్థ రెండవ తరానికి చెందిన స్విప్ట్ కారును కాన్సెప్ట్ ఎస్ మరియు కాన్సెప్ట్ ఎస్2 పేర్లతో 2004 ప్యారిస్ మోటార్ షో వేదిక మీద ఆవిష్కరించింది. రెండవ జనరేషన్ స్విప్ట్‌తో సుజుకి తమ కార్ల డిజైన్‌ను పూర్తిగా మార్చేసింది.

స్విఫ్ట్ కారుకు ఆ పేరెలా వచ్చింది మరియు సుజుకి స్విఫ్ట్ చరిత్ర

అప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కల్టస్ కార్ల పేరును స్విఫ్ట్‌గా మార్చేసింది. అత్యంత సరసమైన ధరతో సబ్ కాంపాక్ట్ సెగ్మెంట్లో స్పోర్టివ్ శైలితో స్విఫ్ట్‌ను సాదరంగా ప్రపంచ మార్కెట్‌కు పరిచయం చేసింది.

అప్పటి భద్రత పరీక్షల్లో ఐదింటికి నాలుగు స్టార్లు

అప్పటి భద్రత పరీక్షల్లో ఐదింటికి నాలుగు స్టార్లు

జపాన్ దిగ్గజం సుజుకి అత్యంత తెలివిగా యూరోపియన్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని ఛాసిస్ మరియు బాడీని అభివృద్ది చేసింది. ప్రపంచ మార్కెట్లో పూర్తి స్థాయి విక్రయాలు ప్రారభించిన తరువాత 2006 లో నిర్వహించిన భద్రత పరీక్షల్లో ఐదింటికి నాలుగు స్టార్ల ర్యాంక్ పొందింది.

స్విఫ్ట్ కారుకు ఆ పేరెలా వచ్చింది మరియు సుజుకి స్విఫ్ట్ చరిత్ర

పూర్తి స్థాయి విక్రయాలు ప్రారభించిన అనంతరం 2005 లో యూరోపియన్ దేశాల్లో స్విఫ్ట్‌కు దిగ్గజ ఫుట్ బాల్ అటగాడు క్రిస్టియానో రొనాల్డో బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాడు.

స్విఫ్ట్ కారుకు ఆ పేరెలా వచ్చింది మరియు సుజుకి స్విఫ్ట్ చరిత్ర

ప్రపంచ దేశాల్లో భారీ విక్రయాలతో స్విప్ట్ మోడల్ సుజుకికు మంచి విజాయన్ని సాధించిపెట్టింది. యూరోపియన్ దేశాలతో పాటు జపాన్, చైనా, ఇండియాలలో కూడా మంచి సక్సెస్ అందుకుంది.

స్విఫ్ట్ కారుకు ఆ పేరెలా వచ్చింది మరియు సుజుకి స్విఫ్ట్ చరిత్ర

హంగేరి, ఇండియా, జపాన్, పాకిస్తాన్ మరియు చైనాలో స్విఫ్ట్ కారును 1.3 మరియు 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లలో సుజుకి ఉత్పత్తి చేసేది.

స్విఫ్ట్ కారుకు ఆ పేరెలా వచ్చింది మరియు సుజుకి స్విఫ్ట్ చరిత్ర

మూడు, నాలుగు మరియు ఐదు డోర్లలో అదే విధంగా ఫోర్ వీల్ డ్రైవ్ మరియు టూ వీల్ డ్రైవ్ ఆప్షన్‌లలో ఎంచుకునే వీలున్న ఇందులో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కూడా ప్రవేశపెట్టింది సుజుకి.

స్విఫ్ట్ కారుకు ఆ పేరెలా వచ్చింది మరియు సుజుకి స్విఫ్ట్ చరిత్ర

వివిధ దేశాల వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా 1.3-లీటర్ పెట్రోల్, 1.5-లీటర్ పెట్రోల్, 1.2-లీటర్ పెట్రోల్(ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో), మరియు ఫియట్ నుండి మరో 1.3-లీటర్ పెట్రోల్ ఇంజన్ సేకరించి తమ స్విఫ్ట్‌లో అందించింది సుజుకి.

స్విఫ్ట్ స్పోర్ట్ (2005-2012)

స్విఫ్ట్ స్పోర్ట్ (2005-2012)

పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా సుజుకి స్విప్ట్‌కు కొనసాగింపుగా శక్తివంతమైన స్విఫ్ట్ వేరియంట్‌ను స్పోర్ట్ వెర్షన్‌లో స్విప్ట్ ఆర్ఎస్ పేరుతో అక్టోబర్ 2005 లో జపాన్‌ మార్కెట్లో విడుదల చేసింది.

స్విఫ్ట్ కారుకు ఆ పేరెలా వచ్చింది మరియు సుజుకి స్విఫ్ట్ చరిత్ర

ఏడాది తిరిగే సరికి సరిగ్గా సెప్టెంబర్ 2006 లో స్విప్ట్ ఆర్ఎస్ వేరియంట్‌ను స్విఫ్ట్ స్పోర్ట్ పేరుతో యూరోపియన్ మార్కెట్లోకి విడుదల చేసింది సుజుకి.

స్విఫ్ట్ కారుకు ఆ పేరెలా వచ్చింది మరియు సుజుకి స్విఫ్ట్ చరిత్ర

సాంకేతికంగా ఈ స్విప్ట్ స్పోర్ట్ లేదా స్విఫ్ట్ ఆర్ఎస్ లో 1.6-లీటర్ సామర్థ్యం ఉన్న న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ అందించింది. ఇది గరిష్టంగా 123బిహెచ్‌పి పవర్ మరియు 148ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలిగింది.

స్విఫ్ట్ కారుకు ఆ పేరెలా వచ్చింది మరియు సుజుకి స్విఫ్ట్ చరిత్ర

స్విప్ట్ స్పోర్ట్ లేదా స్విఫ్ట్ ఆర్ఎస్ లో స్పోర్టివ్ బంపర్లు మరియు స్పాయిలర్, ధృడమైన సస్పెన్షన్, ట్విన్ ఎగ్జాస్ట్ పైపులు, నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేకులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్ మరియు యూరోపియన్ వెర్షన్ స్విప్ట్ స్పోర్ట్‌లో 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఉండేది.

మారుతి సుజుకి స్విఫ్ట్

మారుతి సుజుకి స్విఫ్ట్

ప్రపంచ దేశాల్లో అందుబాటులో ఉన్న స్విఫ్ట్‌ను సుజుకి స్విఫ్ట్ అని, దేశీయంగా ఉన్న స్విఫ్ట్ మారుతి సుజుకి స్విఫ్ట్ గా సంభోదిస్తారు. మారుతి సుజుకి మే 2005 లో స్విఫ్ట్ కారును 1.3-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో విడుదల చేసింది.

స్విఫ్ట్ కారుకు ఆ పేరెలా వచ్చింది మరియు సుజుకి స్విఫ్ట్ చరిత్ర

తరువాత 2007 లో స్విప్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను ఫియట్ నుండి సేకరించిన 1.3-లీటర్ డీజల్ ఇంజన్‌తో మార్కెట్లోకి విడుదల చేసింది. తరువాత బిఎస్-IV ఉద్గార నియమాలను పాటించే ఇంజన్ అప్‌గ్రేడ్స్ సమయంలో 1.3-లీటర్ పెట్రోల్ స్థానంలో 1.2-లీటర్ కె-సిరీస్ పెట్రోల్ వేరియంట్‌ను పరిచయం చేసింది.

స్విఫ్ట్ కారుకు ఆ పేరెలా వచ్చింది మరియు సుజుకి స్విఫ్ట్ చరిత్ర

ఆగష్టు 2011లో మూడవ తరం స్విఫ్ట్ కారును ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో ఉన్న 1.2-లీటర్ కె-సిరీస్ పెట్రోల్ మరియు 1.3-లీటర్ డిడిఐఎస్ డీజల్ ఇంజన్ వేరియంట్లు ఇప్పటికీ కొనసాగుతూనే వచ్చాయి.

స్విఫ్ట్ కారుకు ఆ పేరెలా వచ్చింది మరియు సుజుకి స్విఫ్ట్ చరిత్ర

సుజుకి సంస్థ తమ ఐదవ తరానికి చెందిన స్విఫ్ట్ కారును జపాన్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇదే స్విఫ్ట్‌ను మారుతి సుజుకి ఈ ఏడాది ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్దమవుతోంది.

స్విఫ్ట్ కారుకు ఆ పేరెలా వచ్చింది మరియు సుజుకి స్విఫ్ట్ చరిత్ర

త్వరలో విడుదల కానున్న నూతన ఐదవ తరానికి చెందిన స్విఫ్ట్ మరియు ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ మధ్య తేడా ఏముంటుందని అనుకుంటున్నారా...? అయితే క్రింది గ్యాలరీలోని ఫోటోలను తప్పకుండా వీక్షించాల్సిందే....

English summary
Read In Telugu To Know About How Did Suzuki Swift Get It's Name And History Of The Swift.

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Drivespark sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Drivespark website. However, you can change your cookie settings at any time. Learn more