కారు ఇంజన్ ఎయిర్ ఫిల్టర్ మార్చాల్సిన టైమ్ వచ్చిందని ఎలా తెలుస్తుంది..?

ఎయిర్ ఫిల్టర్ (Air Filter) కారు ఇంజన్ లో చాలా కీలకమైన భాగం. ఇంజన్ పనితీరు సరిగ్గా ఉండాలన్నా, ఇంజన్ ఇంధనం పూర్తిగా మండాలన్నా సదరు కారులో శుభ్రమైన ఎయిర్‌ఫిల్టర్ ఉండటం ఎంతో అవసరం. మనందరికీ తెలుసు, అంతర్గత దహన యంత్రం (ఇంటర్నల్ కంబషన్ ఇంజన్, ICE) సరిగ్గా పనిచేయాలంటే, సదరు ఇంజన్ లోకి తగిన మోతాదులో ఇంధనం మరియు గాలి యొక్క మిశ్రమాన్ని పంపించి మండించడం ఎంతో అవసరం.

కారు ఇంజన్ ఎయిర్ ఫిల్టర్ మార్చాల్సిన టైమ్ వచ్చిందని ఎలా తెలుస్తుంది..?

ఈ ఇంజన్ విభాగంలో ఉండే ఎయిర్ ఫిల్టర్ (Engine Air Filter) ద్వారా గాలి ఇంజన్ లోపలికి ప్రవేశిస్తుంది. ఈ ఎయిర్ ఫిల్టర్‌లు దుమ్ము, ధూళి మరియు ఇతర కలుషితాలను ఇంజన్‌లోకి ప్రవేశించకుండా అడ్డుకోవడంలో సహకరిస్తాయి. అయితే, ఈ ప్రక్రియలో ఇంజన్ ఎయిర్ ఫిల్టర్లు కాలక్రమేణా కలుషితమవుతాయి, ఫలితంగా అవి మురికిగా మారి తగిన మోతాదులో ఇంజన్ లోకి గాలిని పంపించడంలో విఫలం అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడే అసలు సమస్యలన్నీ మొదలువుతాయి.

కారు ఇంజన్ ఎయిర్ ఫిల్టర్ మార్చాల్సిన టైమ్ వచ్చిందని ఎలా తెలుస్తుంది..?

మరి, కారు ఇంజన్ యొక్క ఎయిర్ ఫిల్టర్ ను మార్చాల్సిన సమయం వచ్చిందని మనం ఎలా తెలుసుకోవాలి? ఇందుకు కారు ఏదైనా సంకేతాలు ఇస్తుందా? తగిన సమయంలో ఇంజన్ ఎయిర్ ఫిల్టర్ మార్చకపోతే ఏమవుతుంది? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

కారు ఇంజన్ ఎయిర్ ఫిల్టర్ మార్చాల్సిన టైమ్ వచ్చిందని ఎలా తెలుస్తుంది..?

ఇంజన్ ఎయిర్ ఫిల్టర్‌లు మురికిగా ఉంటే, అది మీ కారు ఇంజన్ పనితీరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అంటే ఇంజన్ పెర్ఫార్మెన్స్ తగ్గుతుంది మరియు ఎక్కువ ఇంధనాన్ని వినియోగిస్ంది. ఫలితంగా మీ కారు మైలేజీ కూడా తగుతుంది. ఎయిర్ ఫిల్టర్‌లు విఫలమైతే, మీ కారు యొక్క ఇంజన్ కూడా ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంది.

కారు ఇంజన్ ఎయిర్ ఫిల్టర్ మార్చాల్సిన టైమ్ వచ్చిందని ఎలా తెలుస్తుంది..?

ఒకవేళ కారు ఇంజన్ ఫెయిల్ అయితే, దానిని రిపేరు చేయించడానికి అధిక మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాబట్టి, ఈ నష్టాల నుండి తప్పించుకోవాలంటే, ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా ఇంజన్ ఎయిర్ ఫిల్టర్‌ ను మార్చడం ఎంతో అవసరం. అయితే ఎయిర్ ఫిల్టర్లను ఎప్పుడు మార్చాలనే విషయం చాలా మందికి తెలియదు. దీన్ని మనం కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు. ఆ లక్షణాలు ఏంటో చూద్దాం రండి.

కారు ఇంజన్ ఎయిర్ ఫిల్టర్ మార్చాల్సిన టైమ్ వచ్చిందని ఎలా తెలుస్తుంది..?

మురికి పట్టిన లేదా రంగు మారిన ఎయిర్ ఫిల్టర్!

ఎయిర్ ఫిల్టర్‌ని ఎప్పుడు మార్చాలని తెలుసుకోవడానికి ఒక సులభమైన మార్గం ఉంది. అదే ఎయిర్ ఫిల్టర్‌ను బయటకు తీసి, భౌతికంగా చెక్ చేయడం. అవును, ఎయిర్ ఫిల్టర్‌ని చూడగానే దాన్ని మార్చాలా వద్దా అనే విషయాన్ని సులువుగా తెలుసుకోవచ్చు. అంతేకాదు, ఎయిర్ ఫిల్టర్‌ని బయటకు తీయడం కూడా చాలా సులభం. క్లీన్ మరియు ఫ్రెష్ గా ఉండే ఎయిర్ ఫిల్టర్ ఎక్కువగా తెల్లగా ఉంటుంది. అలాకాకుండా, ఎయిర్ ఫిల్టర్ మురికిగా లేదా నల్లగా ఉన్నట్లయితే, దాన్ని రీప్లేస్ చేయాల్సిన సమయం వచ్చిందని గుర్తించాలి.

కారు ఇంజన్ ఎయిర్ ఫిల్టర్ మార్చాల్సిన టైమ్ వచ్చిందని ఎలా తెలుస్తుంది..?

మైలేజ్ తగ్గుతుంది!

ఇదివరకు చెప్పుకున్నట్లుగా ఇంజన్ ఎయిర్ ఫిల్టర్ కారు మైలేజీని ప్రభావితం చేస్తుంది. మంచి ఎయిర్ ఫిల్టర్ ఉంటే మంచి మైలేజ్, చెడు ఎయిర్ ఫిల్టర్ ఉంటే చెడు మైలేజ్ అని గుర్తుంచుకోండి. మురికిగా ఉండే ఎయిర్ ఫిల్టర్ కారు ఇంజిన్‌లోకి గాలి రాకుండా చేస్తుంది. ఇంజన్‌ను నడపడానికి తగినంత గాలి లేకపోతే, ఇంధనం ఎక్కువగా కాలిపోతుంది. ఇది మీ కారు మైలేజీని తగ్గిస్తుంది.

కారు ఇంజన్ ఎయిర్ ఫిల్టర్ మార్చాల్సిన టైమ్ వచ్చిందని ఎలా తెలుస్తుంది..?

కాబట్టి, ఇలాంటి పరిస్థితుల్లో మీరు సాధారణం కంటే ఎక్కువ ఇంధనాన్ని వినియోగిస్తారు. ప్రస్తుతం, పెరిగిన పెట్రోల్ / డీజిల్ ధరలను చూస్తే, ఈ ఖర్చు తడిసి మోపెడు అవుతుంది. కాబట్టి మీ కారు మైలేజ్ ఒక్కసారిగా పడిపోయినా, ఎయిర్ ఫిల్టర్లలో సమస్య ఉందేమోనని గుర్తించండి. కారు నుండి ఎయిర్‌ ఫిల్టర్ ను బయటకు తీయడం మీకు రాకపోయినట్లయితే, మీ సమీపంలో ఉండే నమ్మకమైన మెకానిక్ కు చూపించండి.

కారు ఇంజన్ ఎయిర్ ఫిల్టర్ మార్చాల్సిన టైమ్ వచ్చిందని ఎలా తెలుస్తుంది..?

ఇంజన్ పెర్ఫార్మెన్స్ తగ్గుతుంది!

మీరు మీ కారును నిరంతరం నడుపుతున్నట్లయితే, దాని పనితీరు ఎలా ఉంటుందో, మీకు ప్రత్యేకంగా తెలియజేయాల్సిన అవసరం లేదు. మీ కారు పల్స్ మరియు దాని పెర్ఫార్మెన్స్ మీకు ఇట్టే తెలిసిపోతుంది. ఒకవేళ మీ కారు పెర్ఫార్మెన్స్ లో అకస్మాత్తుగా మార్పును గుర్తించినట్లయితే, అది ఎయిర్ ఫిల్టర్ సమస్యల వల్ల కావచ్చేమోనని గుర్తించండి. అంటే ఎత్తుగా ఉండే రోడ్లపై ప్రయాణిస్తున్నప్పుడు మీ కారు వేగంగా వెళ్లడానికి సహకరించకుండా, ఆ రడ్డుపై జారిపోతున్నట్లు అనిపిస్తే, ఓసారి ఎయిర్ ఫిల్టర్ ను చెక్ చేసుకోవడం మంచిది.

కారు ఇంజన్ ఎయిర్ ఫిల్టర్ మార్చాల్సిన టైమ్ వచ్చిందని ఎలా తెలుస్తుంది..?

డ్యాష్‌బోర్డుపై ఇంజన్ లైట్ ను చెక్ చేయండి!

మీ కారు డ్యాష్‌బోర్డ్‌లో కొన్ని సార్లు, చెక్ ఇంజన్ లైట్ ఆన్ కావచ్చు. ఈ లైట్ ఆన్ కావడానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే, వాటిలో ఎయిర్ ఫిల్టర్ సమస్య కూడా ఒకటి కావచ్చు. అంటే మీ కారు ఎయిర్ ఫిల్టర్ మూసుకుపోయి, ఇంజన్‌లోకి తగినంత గాలి చేరకపోతే, ఈ లైట్ ఆటోమేటిక్‌గా వెలగడం ప్రారంభిస్తుంది..

కారు ఇంజన్ ఎయిర్ ఫిల్టర్ మార్చాల్సిన టైమ్ వచ్చిందని ఎలా తెలుస్తుంది..?

కాబట్టి చెక్ ఇంజన్ లైట్ ఆన్‌లో ఉంటే, మీరు అదనపు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. దాన్ని అలాగే వదిలేయకూడదు. ఎయిర్ ఫిల్టర్‌ను మార్చడానికి తక్కువ ఖర్చు అవుతుంది. ఇంజన్ సమస్యను సరిచేసే ధరతో పోలిస్తే ఎయిర్ ఫిల్టర్‌ను మార్చడానికి అయ్యే ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో ఉదాసీనంగా వ్యవహరించకండి.

కారు ఇంజన్ ఎయిర్ ఫిల్టర్ మార్చాల్సిన టైమ్ వచ్చిందని ఎలా తెలుస్తుంది..?

అసాధారణ ఇంజన్ శబ్దం!

కార్లు అన్ని సందర్భాల్లో ఒకేరకమైన శబ్దాన్ని చేయవు. వాటిలో ప్రతి దాని గురించి మీరు చింతించాల్సిన అవసరం లేదు. అయితే, కారు ఐడ్లింగ్‌లో ఉన్నప్పుడు, అకస్మాత్తుగా ఏదైనా వింత శబ్దం వస్తే మాత్రం మీరు గమనించాల్సి ఉంటుంది. ఇంజన్ శబ్ధం విచిత్రంగా ఉంటే, ఎయిర్ ఫిల్టర్‌ను మార్చాల్సిన అవసరం వచ్చిందేమో అని గుర్తించాలి. ఇలా పైన తెలిపిన వివిధ సందర్భాలను బట్టి, ఇంజన్ ఎయిర్ ఫిల్టర్ మార్చాలా వద్దా అని తెలుసుకోవచ్చు.

More from DriveSpark

Article Published On: Sunday, March 20, 2022, 14:00 [IST]
English summary
How do i know it s time to change my car s engine air filter
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+