విమానం నడిపేటప్పుడు ఏ దిశలో వెళ్లాలో పైలట్‌కు ఎలా తెలుస్తుంది.. ఎప్పుడైనా ఆలోచించారా.!!

మనం ఏదైనా పని మీద బయటకు వెళ్లినప్పుడు మనకు తెలిసిన దారి అయితే నిస్సంకోచంగా వెళ్తాం. అదే తెలియని దారి అయితే ఆ మార్గంలో కనిపించే వారిని దారి అడుగుతూ వెళ్తాం. కానీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక.. గూగుల్ మ్యాప్స్ సాయంతో గమ్యస్థానానికి చేరుకుంటున్నాం. కొత్త వారికి ఇది ఒక గైడ్‌లా పని చేస్తుంది.

ప్రస్తుత జనరేషన్‌లో గూగుల్ మ్యాప్స్ మనిషి జీవితంలో అంతర్భాగం అయిందనడంలో సందేహం లేదు. మనం ఏ ప్రదేశానికి వెళ్లాలన్నా గూగుల్ మ్యాప్స్‌ను గైడ్‌లా ఉపయోగిస్తాం. ఇంకా బస్సు, కారు, ట్రైన్ ఇలా రోడ్డుపై వెళ్లే ఏ వాహనంలో అయినా రోడ్డు, రూట్ మ్యాప్ కనబడుతుంది కాబట్టి కరెక్టుగా వెళ్లగలం.

How-Pilot-Know-Which-Direction-to-Fly

కానీ విమానం ఆకాశంలో ఎగురుతూ వెళ్తుంది. పైకి వెళ్లిన తర్వాత అంతా అయోమయంగా ఉంటుంది. మరి ఆకాశ మార్గంలో ప్రయాణించేటప్పుడు పైలట్‌కు దారి ఎవరు చెప్తారు. అతను సవ్యంగా గమ్యస్థానానికి ఎలా తీసుకువెళ్తారు అనే సందేహం మీకెప్పుడైనా కలిగిందా.. దానికి సమాధానం ఈ కథనంలో చదవండి.

ఆకాశంలో రయ్ మంటూ దూసుకెళ్తున్న విమానంలో ప్రయాణం.. ఎంతో ఆహ్లాదకరంగా ఉండటంతో పాటు మంచి అనుభూతిని ఇస్తుంది. మధ్య తరగతి ప్రజలు తమ జీవితంలో ఒక్కసారైనా విమాన ప్రయాణం చేయాలని కలలు కంటారు. ఎందుకంటే ఫ్లైట్ జర్నీ చాలా కాస్ట్లీ అని మనకు తెలిసిందే..

How-Pilot-Know-Which-Direction-to-Fly

కానీ విమానం నడిపే సమయంలో పైలట్లు.. కరెక్టుగా ఏ మార్గంలో వెళ్లాలో ఎలా తెలుసుకుంటారు. సరిగ్గా గమ్యస్థానంలోనే ఫ్లైట్ ఎలా ల్యాండ్ అవుతుంది. వారి వద్ద ఏమైనా గూగుల్ మ్యాప్ ఉందా.. ఒకవేళ ఉంటే దాన్ని వీరు ఎలా అనుసరిస్తారో తెలుసుకుందాం.

విమానం ఒక్కసారి టేకాఫ్ అయిన తర్వాత రేడియో మరియు రాడార్ సాయంతో పైలట్ విమానాన్ని నడుపుతారు. ఇది కాకుండా ఫ్లైట్‌లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ATC) కూడా ఉంటుంది. రోడ్డుపై వందల కొద్దీ వాహనాలు ప్రయాణిస్తుంటాయి. వాటిని ట్రాఫిక్ పోలీసులు కంట్రోల్ చేస్తున్నట్లుగా.. ఆకాశంలో ప్రయాణించే విమానాలను ఏటీసీ కంట్రోల్ చేస్తుంది.

How-Pilot-Know-Which-Direction-to-Fly

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్.. పైలట్‌కు ఏ దిశలో వెళ్లాలి.. ఏ దిశలో వెళ్లకూడదనేది దిశానిర్దేశం చేస్తుంది. దీని ద్వారా పైలట్ ట్రాఫిక్‌ను పరిశీలిస్తూ సులభంగా, సురక్షితంగా గమ్యస్థానానికి చేరుస్తాడు. అంతే కాకుండా పైలట్‌కు మార్గ నిర్దేశం చేయడానికి క్షితిజ సమాంతర పరిస్థితి(HSI) సూచిక ఉపయోగపడుతుంది.

HSI ద్వారా పైలట్లు సులభంగా తమ మార్గంలో ప్రయాణిస్తారు. దీని ద్వారా మార్గ మధ్యలో ప్రతి ప్రాంతం యొక్క స్థానంతో పాటు రేఖాంశాన్ని కొలవడానికి దోహదపడుతుంది. ఇది ఆకాశంలో విమానం సవ్యంగా ప్రయాణించడానికి సహాయం చేస్తుంది. విమానం సాధారణంగా భూమి నుంచి 35 వేల అడుగుల ఎత్తులో అంటే దాదాపు 11 కి.మీ ఎత్తులో ప్రయాణిస్తుంది.

How-Pilot-Know-Which-Direction-to-Fly

కొన్ని సందర్భాల్లో పలు విమానాల లొకేషన్ మరియు ప్రయాణీకుల ఆధారంగా అవి ప్రయాణించే ఎత్తు మారుతూ ఉంటుంది. కమర్షియల్ ప్యాసింజర్ జెట్ విమానం ఎప్పుడూ 90 వేల అడుగుల దూరంలో ఎగురుతుంది. విమానాల ఎత్తు కూడా వాతావరణానికి అనుగుణంగా తగ్గించడం లేదా పెంచడం జరుగుతుంది.

How-Pilot-Know-Which-Direction-to-Fly

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, August 17, 2023, 20:50 [IST]
English summary
How does a pilot know which direction to fly story in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+