రైలు చైన్‌ లాగితే ఎలా దొరికిపోతారో తెలుసా.!!.. దీని వెనుక ఇంత స్టోరీ ఉందా.??

రైలు ప్రయాణం అంటే చాలా మందికి ఆసక్తికరంగా ఉంటుంది. ఇక ఫ్యామిలీతో కలిసి ట్రైన్‌లో వెళితే ఆ సరదానే వేరు. రైల్లో చాలా ఆసక్తికర విషయాలు ఉంటాయి. అయితే వాటిలో అందరికీ ఉత్సుకత కలిగించేది చైన్‌.. చైన్‌ లాగితే ట్రైన్‌ ఎలా ఆగిపోతుంది.. ఏ కోచ్‌లో చైన్‌ లాగారు అనే విషయాలను రైల్వే సిబ్బంది ఎలా తెలుసుకుంటారు.??

దేశంలో ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణికులను రైల్వే శాఖ గమ్యస్థానానికి చేరుస్తుంది. ప్రపంచంలోనే అతి పెద్ద రెండో కనెక్టింగ్‌ నెట్‌వర్క్‌ ఇది. దేశంలో కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు కలుపుతూ.. ప్రయాణికులను మోసుకుపోతుంది. ఈ క్రమంలో సినిమాల్లో రైలు సీన్లు వచ్చినప్పుడు ఎక్కడో చోట చైన్ లాగే సీన్‌ అయితే కంపల్సరీ చూస్తాం. అది చాలా ఫన్నీగా ఉంటుంది.

Train-Chain-Pulling-How-Does-Pilot-Know

చిన్న చిన్న కారణాల వల్ల చైన్‌ లాగితే(Train Chain Pulling) వారికి జరిమానా విధించడం కూడా చూస్తుంటాం. అయితే ఈ సినిమాలను పక్కనబెడితే.. నిజ జీవితంలో కూడా మనం రైల్లోని ప్రతి కోచ్‌లో చైన్‌ను చూస్తుంటాం. ఈ చైన్‌ లాగే విషయంలో ప్రయాణికులు కేర్‌ఫుల్‌గా, అలర్ట్‌గా ఉండాలని రైల్వే అధికారులు చెబుతూనే ఉంటారు.

అయితే మీరు ఒకవేళ ఎమర్జెన్నీ పరిస్థితుల్లో చైన్‌ లాగినా.. ఆ సంఘటన మీరున్న కోచ్‌లోనే జరిగిందని లోకో పైలట్‌ ఎలా తెలుసుకుంటారు.?? నేరుగా ఆ కోచ్‌ దగ్గరికే ఎలా వస్తారు. ఆ తర్వాత ట్రైన్‌ మళ్లీ ఎలా స్టార్టవుతుంది.?? అనే సందేహాలు మీకు ఎప్పుడో ఓ సారి వచ్చి ఉంటాయి కదా..

Train-Chain-Pulling-How-Does-Pilot-Know

రైలు కోచ్‌ల్లో ఉండే చైన్‌ అనేది అత్యవసర బ్రేక్‌.. అయితే ఈ అత్యవసర బ్రేక్‌ను ఎటువంటి కారణం లేకుండా దీనిని లాగకూడదు. లేదంటే సదరు బాధ్యుడు ఊహించని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చైన్‌ సిస్టమ్‌కు అనుసంధానంగా ఉన్న ప్రతి బోగీలో ఎమర్జెన్సీ ఫ్లాషర్‌ అనేది ఒకటి ఏర్పాటు చేస్తారు. దీంతో ప్రయాణికులైవరైనా ఏ బోగీలో చైన్‌ లాగినా.. అక్కడే ఉండే ఫ్లాషర్‌ లైట్‌ ఆన్‌ అవుతుంది.

ఫ్లాష్‌ లైట్‌ ఆన్‌ అవడంతో లోకో పైలట్‌ అప్రమత్తమై వెంటనే రైలును ఆపుతారు. ఆ వెంటనే లోకో పైలట్ తోపాటు గార్డ్ కూడా ఏ బోగీలో అయితే చైన్ లాగారో అక్కడికి వెళ్తారు. సదరు బోగీలో ఆ చైన్‌ను సరిచేస్తేనే ప్లాషర్ ఆగిపోతుంది. అనంతరం మళ్లీ రైలును స్టార్ట్‌ చేస్తారు. అయితే చైన్ వ్యవస్థను ఇదే విధానంతో తయారు చేశారు.

Train-Chain-Pulling-How-Does-Pilot-Know

కాగా రైలుల్లో ఈ చైన్‌ పుల్లర్‌ను అమల్లోకి తెచ్చేటప్పుడు ఇక్కడ ఓ ఫిజిక్స్‌ లాజిక్ ఉంది. లోకో పైలట్ రైలును నడిపేటప్పుడు.. గాలి ఒత్తిడి ద్వారా టైర్ నుంచి బ్రేక్‌ను దూరంగా పెడతాడు. కానీ రైలును ఆపేటప్పుడు గాలిని ఆపడం ద్వారా.. ట్రైన్‌కు బ్రేకులు పడతాయి. ఈ క్రమంలో ఓ బోగీలో నుంచి చైన్‌ను లాగినప్పుడు గాలి పీడనం లీక్‌ అయినట్లు శబ్దాన్ని లోకో పైలట్‌ కనుగొంటారు.

Train-Chain-Pulling-How-Does-Pilot-Know

దీంతో ఆ శబ్దాన్ని బేస్‌ చేసుకుని లోకో పైలట్‌ రైలును ఆపుతారు. అయితే కొన్ని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఈ చైన్‌ను లాగాలని రైల్వే అధికారులు నిబంధనలు పెట్టారు. దోపిడీ దొంగలు పడటం, భద్రతా పరమైన సమస్యలు, అగ్ని ప్రమాదం, మెడికల్‌ ఎమర్జెన్సీ లేదా వృద్ధులు, వికలాంగుల కోసం సహాయం లాంటి సందర్భాల్లో మాత్రమే చైన్‌ లాగాలి. లేదంటే జరిమానా తప్పదని గుర్తుంచుకోవాలి.

More from DriveSpark

Article Published On: Sunday, March 10, 2024, 10:45 [IST]
English summary
How does the loco pilot know who pulled the train chain know the science and mechanism
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+