ఎలక్ట్రిక్‌ వాహనాలు పర్యావరణానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా..?

భారతదేశం ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యల్లో వాయు కాల్యుషం ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థల్లో ఒకటిగా ఉన్న భారత్‌లో వాహనాల వినియోగం పెరగడం కారణంగా రోజురోజుకు వాయు కాలుష్యం పెరిగిపోతోంది. ఫలితంగా గాలి నాణ్యత తగ్గిపోతుంది. ఈ కారణంగా ప్రజలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు.

ఈ సమస్యలకు ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగంతో చెక్ పెట్టొచ్చు. ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాలు ఎలక్ట్రిక్‌ వాహనాలు (EV)లను పెద్ద ఎత్తున ప్రమోట్‌ చేస్తున్నాయి. ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం పెంచేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈవీలు వాతావరణాన్ని తద్వారా ప్రజారోగ్యాన్ని ఎలా కాపాడుతాయో తెలుసుకొనేందుకు ఈ స్టోరీని చదవండి.

Electric Vehicles improve environment

1. ఉద్గారాలు : ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం వల్ల వాతావరణంలోకి విడుదలయ్యే కాలుష్య కారకాలు భారీగా తగ్గుతాయి. ఎలక్ట్రిక్‌ వాహనాలు సాంప్రదాయ ఇంటర్నల్‌ కంబషన్‌ ఇంజిన్లు (ICE) వలే కార్బన్‌ మోనాక్సైడ్‌ సహా ఇతర కాలుష్య కారకాలను విడుదల చేయవు. ఫలితంగా సాంప్రదాయ ఇంజిన్లను ఈవీలతో భర్తీ చేయడం వల్ల వాతావరణ కాలుష్యం గణనీయంగా తగ్గుతుంది.

2. గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాలు: వాయు కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా, గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాలను తగ్గించంలో ఈవీలు ఎంతో సహాయపడతాయి. పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి విద్యుత్‌ ఛార్జ్‌ చేసిన ఈవీలు, సాంప్రదాయ ICEలు చాలా తక్కువ కార్బన్ ఉద్గారాలను విడుదల చేస్తాయి. ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వాహన రంగాన్ని మరింత బలపరిచేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రజలు ఈవీల వినియోగాన్ని పెంచేలా కృషిచేస్తోంది.

Electric Vehicles improve environment

3. ఆరోగ్యం: ప్రజల ఆరోగ్యాన్ని గాలి కాలుష్యం ప్రభావితం చేస్తుంది. వాయు కాలుష్యం కారణంగా శ్వాసకోశ, హృదయ సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం పెరిగితే గాలి నాణ్యత మెరుగవుతుంది. ఫలితంగా ప్రజల ఆరోగ్యం గణనీయంగా మెరుగవుతుంది. అది ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదలకు తోడ్పాటు అందిస్తుంది.

4. శబ్ద కాలుష్యాన్ని నియంత్రిస్తుంది : సాంప్రదాయ ఇంజిన్లు కలిగిన వాహనాలు ఎక్కువ శబ్దం చేసుకుంటూ ప్రయాణిస్తాయి. అదే ఈవీలతో శబ్ద కాలుష్యం గణనీయంగా తగ్గుతుంది. ఇది ప్రయాణికుల మానసిక మరియు శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అధిక జనాభా నివాసం ఉంటున్న ప్రాంతాల్లో గణనీయమైన ప్రభావం చూపుతుంది.

Electric Vehicles improve environment

భారత్‌లో వాయు కాలుష్య నియంత్రణకు మరియు ప్రజల ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం ఎంతో అవసరం. ప్రజలు ఎలక్ట్రిక్‌ వాహనాలకు మారడం ద్వారా గణనీయమైన మార్పులు వస్తాయి. అయితే ఇప్పటి కిప్పుడే ప్రజలంతా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంలోకి మారడం అంత సులభం కాదు.

ఎందుకంటే ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వాహనాల వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. కొన్ని పట్టణ ప్రాంతాలు మినహా గ్రామీణులకు ఈవీలపై పూర్తి అవగాహన లేదు. పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తేనే ఇది సాధ్యమవుతుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, June 5, 2023, 11:12 [IST]
English summary
How electric vehicles improve air quality and environment in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+