హైబ్రిడ్ కార్లు ఎలా పనిచేస్తాయో తెలుసా? వాటి లాభాల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అయితే ఇది చదవండి

ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారతదేశంలో హైబ్రిడ్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. పర్యావరణ సమస్యలు రోజురోజుకీ ఎక్కువవుతున్నాయి. ఈ రెండు కారణాల వల్ల చాలా మంది వినియోగదారులు ఇకపై సాధారణ ఇంజిన్ కార్లకంటే హైబ్రిడ్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. పెద్ద నగరాల్లో ట్రాఫిక్ సమస్యల్లో కూడా హైబ్రిడ్ కారు ఎక్కువ మైలేజ్ ఇస్తుంది.ఇప్పటికే టయోటా, హోండా వంటి కంపెనీలు భారత మార్కెట్‌లో హైబ్రిడ్ కార్లను ప్రవేశపెట్టాయి. వీటి అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయి. వినియోగదారులు ఫ్యూయల్ పొదుపు + భవిష్యత్ టెక్నాలజీ కలయికగా హైబ్రిడ్ కార్లను ఎంచుకుంటున్నారు. భారతదేశం లాంటి పెరుగుతున్న మార్కెట్‌లో, రాబోయే సంవత్సరాల్లో హైబ్రిడ్ కార్లే కీలకమైన పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అసలు ఈ కార్లు ఎలా పనిచేస్తాయో ఒకసారి తెలుసుకుందాం.

హైబ్రిడ్ కారు అనేది సాధారణ పెట్రోల్ లేదా డీజిల్ ఇంజిన్‌తో పాటు ఒక ఎలక్ట్రిక్ మోటార్‌ను కూడా ఉపయోగించే ప్రత్యేకమైన వాహనం. దీని వెనుక ఉద్దేశ్యం ఫ్యూయల్ వినియోగాన్ని తగ్గించడం, పర్యావరణానికి హాని చేసే కాలుష్య కారకాలను తగ్గించడం, అలాగే డ్రైవింగ్ అనుభవాన్ని మరింత సౌకర్యవంతంగా చేయడం. ఈ కారు సాధారణంగా ఎలక్ట్రిక్ మోటార్‌తో నడుస్తుంది. ఇంధనం దాదాపు వాడకపోవడం వల్ల మైలేజ్ పెరుగుతుంది.

How Hybrid Cars Work Engine Electric Motor Benefits

ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్(ICE), ఎలక్ట్రిక్ మోటార్ రెండూ కలిసి పనిచేస్తాయి. ఇది శక్తిని పెంచడమే కాకుండా, ఇంధన వినియోగాన్ని తగ్గిస్తుంది. హైవేలో లేదా ఎక్కువ వేగంతో వెళ్తున్నప్పుడు ఇంజిన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. మోటార్ సహాయం చేయడం వల్ల ఫ్యూయల్ తగ్గిపోకుండా కంట్రోల్ అవుతుంది. సాధారణ కార్లలో బ్రేక్ వేస్తే ఆ ఎనర్జీ వృథా అవుతుంది. కానీ హైబ్రిడ్ కార్లలో, ఆ ఎనర్జీ తిరిగి బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ఉపయోగపడుతుంది.

హైబ్రిడ్ కార్ల అసలైన విశేషం ఏమిటంటే, అవి కేవలం ఎలక్ట్రిక్ మోటార్ లేదా పెట్రోల్ ఇంజిన్‌ను వేరువేరుగా ఉపయోగించవు. బదులుగా, ఈ రెండు శక్తి వనరులను తెలివిగా సమన్వయం చేస్తూ పని చేస్తాయి. మీరు తక్కువ స్పీడ్‌లో లేదా ట్రాఫిక్‌లో నడుపుతున్నప్పుడు, ఎక్కువగా ఎలక్ట్రిక్ మోటార్ పనిలో ఉంటుంది. ఇది ఇంధనాన్ని ఆదా చేస్తుంది, కారును సైలెంట్‌గా నడిపిస్తుంది.

How Hybrid Cars Work Engine Electric Motor Benefits

కానీ మీరు వేగం పెంచినప్పుడు లేదా కారు ఎక్కువ శక్తి అవసరమైనప్పుడు, పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్ రెండూ కలిసి పనిచేస్తాయి. ఇలా, హైబ్రిడ్ సిస్టమ్ పరిస్థితులను బట్టి ఆటోమేటిక్‌గా మారుతూ, అవసరమైనప్పుడు శక్తివంతమైన పనితీరు ఇస్తుంది, అవసరం లేని సమయంలో ఇంధనాన్ని ఆదా చేస్తుంది. అంటే, మీ డ్రైవింగ్ స్టైల్, రోడ్డు పరిస్థితులు, వేగం ఇవన్నింటిని బట్టి హైబ్రిడ్ కారు తెలివిగా నిర్ణయం తీసుకుంటుంది.

ఇవి కేవలం ఒక టెక్నాలజీ అప్‌డేట్ మాత్రమే కాకుండా, డ్రైవింగ్ అనుభవాన్ని మార్చే పరిష్కారం. సాధారణ పెట్రోల్ లేదా డీజిల్ కార్లలో ఇంధనంపై పూర్తిగా ఆధారపడాల్సి వస్తుంది. కానీ హైబ్రిడ్ వాహనాల్లో ఎలక్ట్రిక్ మోటార్ సహకారం వలన ఆ ఆధారపడటం తగ్గుతుంది. పర్యావరణ పరిరక్షణలో కూడా హైబ్రిడ్ కార్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఇంజిన్ ఎప్పుడూ పూర్తి స్థాయిలో పని చేయకపోవడం, వాహనం నుంచి వెలువడే పొగలు గణనీయంగా తగ్గిపోతాయి.

How Hybrid Cars Work Engine Electric Motor Benefits

దీంతో నగరాల్లోని గాలి కాలుష్యం తగ్గడంలో సహకారం అందుతుంది. ఇంకా ఒక ప్రధాన లాభం డ్రైవింగ్ అనుభవంలో కనిపిస్తుంది. ట్రాఫిక్‌లో ఎక్కువసేపు ఆగిపోవడం, తక్కువ వేగంతో కదలడం వంటి సందర్భాల్లో కారు పూర్తిగా ఎలక్ట్రిక్ మోటార్‌తో నడవడం వల్ల వాహనం సైలెంట్‌గా ఉంటుంది. డ్రైవర్‌కూ, ప్రయాణికులకూ ఇది ఒక సౌకర్యవంతమైన అనుభూతిని ఇస్తుంది. అదే సమయంలో దీని రీసేల్ వ్యాల్యూ కూడా మంచి స్థాయిలో ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Monday, September 1, 2025, 14:32 [IST]
English summary
How hybrid cars work engine electric motor benefits and all details
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+