ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్నారా? ఎన్ని చలాన్లు పడితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు అవుతుందో తెలుసా?

ట్రాఫిక్ నిబంధనలను పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే జేబుకు చిల్లు పడడమే కాదు, మీ డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు కావచ్చు. చాలామందికి ఈ విషయం గురించి తెలియదు. ఒకటికి మించి ఎక్కువ చలాన్‌లు పడినప్పుడు, పోలీసులు లైసెన్స్‌ను క్యాన్సిల్ చేసే అధికారం కలిగి ఉంటారు. అసలు ఎన్ని చలాన్‌లు పడితే లైసెన్స్ రద్దవుతుంది? ఒకవేళ రద్దైతే తిరిగి కొత్త లైసెన్స్ ఎలా పొందాలి? లాంటి విషయాలు ఈ వార్తలో తెలుసుకుందాం.

సాధారణంగా ప్రతి రాష్ట్రానికి దానికంటూ కొన్ని ప్రత్యేక ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి. చాలా రాష్ట్రాల్లో, ఒక వ్యక్తికి వరుసగా మూడు సార్లు ట్రాఫిక్ చలాన్ పడితే అతని డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. మరికొన్ని రాష్ట్రాల్లో ఐదు అంతకంటే ఎక్కువ చలాన్‌లు పడితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు.

Driving License

తెలంగాణలో గతంలో పెనాల్టీ పాయింట్ల విధానం అమల్లోకి వచ్చింది. ఈ విధానం ప్రకారం, డ్రైవింగ్ చేసేటప్పుడు ట్రాఫిక్ ఉల్లంఘనలు చేస్తే పెనాల్టీ పాయింట్లు కేటాయించబడతాయి. సంవత్సరంలో 12 పెనాల్టీ పాయింట్లు దాటితే డ్రైవింగ్ లైసెన్స్ ఒక సంవత్సరం పాటు సస్పెండ్ అవుతుంది. ఆ తర్వాత మళ్లీ పాయింట్లు దాటితే సస్పెన్షన్ కాలం పెరుగుతుంది.

ఆంధ్రప్రదేశ్‌లో కూడా కొన్ని రకాల ట్రాఫిక్ ఉల్లంఘనలకు నేరుగా లైసెన్స్ సస్పెండ్ అవుతుంది. ఉదాహరణకు, హెల్మెట్ లేకుండా వాహనం నడపడం వంటి ఉల్లంఘనలకు మూడు నెలల పాటు లైసెన్స్ సస్పెండ్ అవుతుంది. అదే ఉల్లంఘనను మళ్లీ చేస్తే లైసెన్స్ శాశ్వతంగా రద్దు అయ్యే అవకాశం ఉంది.

ప్రస్తుతానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఇన్ని చలాన్లు పడితేనే లైసెన్స్ రద్దు అని స్పష్టంగా చెప్పే నిబంధన లేదు. అయితే, ట్రాఫిక్ ఉల్లంఘనల తీవ్రతను బట్టి, కోర్టు లేదా రవాణా శాఖ అధికారులు లైసెన్స్ రద్దు లేదా సస్పెన్షన్ నిర్ణయం తీసుకుంటారు. పెనాల్టీ పాయింట్ల వ్యవస్థ, కొన్ని నిర్దిష్ట ఉల్లంఘనల ఆధారంగా మాత్రమే లైసెన్స్ సస్పెండ్ అవుతుంది.

Driving License

అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ చలాన్‌లు కేవలం ట్రాఫిక్ పోలీసులు ఆపినప్పుడు మాత్రమే కాదు, రోడ్డుపై ఏర్పాటు చేసిన కెమెరాల ద్వారా కూడా ఆటోమేటిక్‌గా వస్తాయి. చాలామందికి ఈ ఆటోమేటిక్ చలాన్‌ల గురించి తెలియక, వాటిని నిర్లక్ష్యం చేస్తారు. ఇలాంటి నిర్లక్ష్యం వల్ల చలాన్‌ల సంఖ్య పెరిగి, చివరికి లైసెన్స్ రద్దుకు దారితీస్తుంది.

ఒకవేళ మీ లైసెన్స్ రద్దయితే, మీరు మళ్ళీ కొత్త లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు దీనికోసం కోర్టులో కూడా అభ్యర్థన చేసుకోవాల్సి రావచ్చు. ఒకవేళ మీ డ్రైవింగ్ లైసెన్స్ పోగొట్టుకున్నా, గడువు ముగిసినా లేదా రద్దు అయినా, కొత్త లైసెన్స్ పొందడానికి రెండు మార్గాలు ఉన్నాయి.

Driving License

ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలి?
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడం చాలా సులభం. ఈ పద్ధతిలో మీ ఇంటి దగ్గరే కూర్చుని లైసెన్స్ కోసం అప్లై చేయవచ్చు. ముందుగా మీరు https://parivahan.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్ళాలి. ఇది కేంద్ర రవాణా శాఖ అధికారిక వెబ్‌సైట్. వెబ్‌సైట్ హోమ్‌పేజీలో ఆన్‌లైన్ సర్వీసేస్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేసి services related to driving license అనేదాన్ని సెలక్ట్ చేసుకోవాలి.

ఇప్పుడు కొత్త పేజీలో మీ రాష్ట్రం పేరును ఎంచుకోవాలి. మీరు మీ రాష్ట్రాన్ని ఎంచుకున్న తర్వాత Apply for DL renewal అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫారం నింపే ముందు కొన్ని గైడ్‌లైన్స్ కనిపిస్తాయి, వాటిని జాగ్రత్తగా చదవండి. ఆ తర్వాత మీ వ్యక్తిగత వివరాలను, డ్రైవింగ్ లైసెన్స్ నంబర్‌ను మరియు ఇతర అవసరమైన సమాచారాన్ని నింపాలి.

ఈ దశలో అవసరమైన డాక్యుమెంట్లు (ఉదాహరణకు, ఆధార్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్) అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో ఫోటో, సంతకం కూడా అప్‌లోడ్ చేయమని అడగవచ్చు. చివరిగా, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలి. మీ పేమెంట్ సక్సెస్ ఫుల్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి.

ఆఫ్‌లైన్ ప్రాసెస్ (RTO ద్వారా)
ఆన్‌లైన్‌లో అప్లై చేయడం మీకు కష్టంగా అనిపిస్తే, మీరు నేరుగా మీ దగ్గరలోని RTO (Regional Transport Office) ఆఫీసుకు వెళ్లి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మీ సమీపంలోని RTO ఆఫీసుకు వెళ్లాలి. కొత్త డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఫారం 2 నింపాలి.

ఒకవేళ మీ లైసెన్స్ పోతే, ఫారం LLD నింపాల్సి ఉంటుంది. అవసరమైన అన్ని పత్రాలను (ఆధార్ కార్డ్, పాత లైసెన్స్, అడ్రస్ ప్రూఫ్, etc.) సమర్పించాలి. RTO ఆఫీసులో నిర్దేశించిన ఫీజును చెల్లించాలి. మీ వేలిముద్రలు, ఫోటో వంటి బయోమెట్రిక్ వివరాలు తీసుకుంటారు.

ఒకవేళ ఇది మొదటిసారి లైసెన్స్ అయితే, డ్రైవింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఈ ప్రక్రియలో కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. మీ మొబైల్ నంబర్ ఆధార్‌తో లింక్ అయ్యి ఉండాలి. ఒకవేళ మీకు 40 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉంటే ఫారం 1A (మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్) తప్పనిసరిగా సమర్పించాలి. ఒకవేళ మీ లైసెన్స్ పోగొట్టుకుంటే ముందుగా పోలీస్ స్టేషన్‌లో FIR కాపీని కూడా సమర్పించాల్సి ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, August 5, 2025, 10:24 [IST]
English summary
How many challans can lead to driving license suspension
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+