రూ.10 కోట్ల విలువైన కారులో రిపబ్లిక్‌ డే వేడుకలకు ప్రధాని.. ఈ కారు అంత శక్తివంతమైనదా?

జనవరి 26న దేశ రాజధాని ఢిల్లీలో రిపబ్లిక్‌ డే వేడుకలను (Republic Day Event 2024) అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సైనిక దళాలు పరేడ్‌ సహా ప్రత్యేక దళాలు విన్యాసాలు నిర్వహించాయి. దీంతోపాటు రాష్ట్రాలు తమ శకటాలను ప్రదర్శించాయి. ఈ వేడుకల కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

తేజస్‌ సహా యుద్ధ విమానాలు గగనతల విన్యాసాలు నిర్వహించాయి. ఈ విన్యాసాలు అతిథులను ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ రూ.10 కోట్ల విలువైన రేంజ్‌ రోవర్‌ కారులో (PM Modi Range Rover Car) ప్రయాణించారు. సైనిక దళాల ప్రత్యేక గౌరవ వందనం స్వీకరించారు. అయితే ఈ కారు ధర సహా ఫీచర్ల, సేఫ్టీ ఏర్పాట్లపై ప్రస్తుతం చర్చ నడుస్తోంది.

Top things to know about PM Narendra Modi range rover

ఈ కారులోనే ప్రధాని మోడీ ప్రయాణం : ప్రధాని నరేంద్ర మోడీ ప్రయాణించిన కారును లండన్‌లోని రేంజ్‌ రోవర్‌ స్పెషల్‌ వెహికల్‌ ఆపరేషన్స్‌ యూనిట్‌లో తయారు చేశారు. ఈ కారును మోడీ.. చాలా సంవత్సరాలుగా వినియోగిస్తున్నారు. అధికారిక పర్యటన, ఎన్నికల ర్యాలీలు సహా ఇతర పర్యటనల్లో ఈ కారులోనే ప్రధాని మోదీ ప్రయాణాలు చేస్తుంటారు.

రేంజ్ రోవర్‌ కారులో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. సాంకేతిక ఫీచర్లు, సహా ప్రత్యేక సెక్యూరిటీ ఫీచర్లు ఈ కారు సొంతం. ఇతర కార్ల కంటే భిన్నంగా ఉంటాయి. ప్రధాని మంత్రి భద్రత కోసం ఈ కార్లను కొనుగోలు చేశారు. ఈ వాహనం అన్ని గ్లాస్‌లు బుల్లెట్‌ ఫ్రూప్‌గా తయారుచేయబడ్డాయి. ఫలితంగా భారీ దాడులను సైతం తట్టుకుంటుంది.

how PM Narendra Modi range rover powerful of worth rs 10 crore

గన్‌లు సహా బాంబులతో పేల్చినా ప్రధాని మోడీ ప్రయాణిస్తున్న కారు అద్దాలు డ్యామేజీ కాకుండా ఉంటాయి. దీంతోపాటు కారులోని ఉన్న ప్రయాణికులు.. బయట వారికి కనిపించే పరిస్థితి ఉండదు. దాంతోపాటు ఈ కారు టైర్లు పంక్చర్‌ అయినా ఎటువంటి ఆటంకం లేకుండా ప్రయాణం చేయగలవు. కారు టైర్లు పంక్చర్‌ అయినా.. 50 కి.మీ దూరం వరకు 80 కి.మీ వేగంతో ప్రయాణం చేయగలదు.

ఈ రేంజ్ రోవర్‌ కారు 5.0 లీటర్‌ V8 సూపర్‌ ఛార్జడ్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్‌ 374bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మరియు కేవలం 10.4 సెకన్లలో 0-100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. మరియు ఈ కారు గరిష్ఠంగా గంటకు 193 కి.మీ వేగంతో ప్రయాణం చేయగలదు.

అయితే ప్రధాని నరేంద్ర మోడీ ప్రయాణం చేసే కార్ల ఆయుధాలను కూడా కలిగి ఉండే అవకాశం ఉండవచ్చు. అయితే ప్రధాని భద్రతా కారణాల రీత్యా ఆ సమాచారం బయటకు వెల్లడించరు. శత్రువు దాడి చేసిన ప్రతిస్పందించే వ్యవస్థ ఈ కార్లలో ఉండే అవకాశం ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Sunday, January 28, 2024, 9:01 [IST]
English summary
How pm narendra modi range rover powerful of worth rs 10 crore
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+