పట్టువదలని విక్రమార్కుడు మన 'రతన్ టాటా'.. అమెరికాలో అవమానం, మన దగ్గర ప్రతీకారం.. దెబ్బకు దెబ్బ!
భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం రతన్ టాటా (Ratan Tata) అక్టోబర్ 10 రాత్రి 11 గంటల సమయంలో కన్నుమూశారు. ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. దేశంలో ఆటోమొబైల్ రంగాన్ని ఓ స్థాయిలో నిలబెట్టిన నిరంతర శ్రామికుడి మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇండికా (Tata Indica) అనే కారు తయారీ ద్వారా టాటా ఆటోమోటివ్ ప్రపంచంలో ఓ విప్లవానికి తెరలేపింది. ఇందులో టాటా సన్స్ ఛైర్మన్‌గా ఉన్న రతన్ టాటా చాలా కీలక పాత్ర వహించాడు. అప్పట్లో హిందుస్తాన్ అంబాసిడర్, మారుతి 800 వంటి కార్ల పోటీని తట్టుకుని ఇండికాలో నిలిచింది. అంబాసిడర్‌కి సవాల్‌గా ఈ ట్యాక్సీ మార్కెట్ వీధులతో నిండిపోవడం కూడా చరిత్రే అని చెప్పాలి.
1998లో ఇండికా కారుని రతన్ టాటా ఆధ్వర్యంలో లాంచ్ అయింది. ఒక సంవత్సరం వరకు కూడా ఈ కారుని జనాలు ఆధరించలేదు. దీంతో ఆటో పరిశ్రమకు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్న టాటా సన్స్ తమ వ్యాపారాన్ని విలీనం చేయడానికి అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్‌ని సంప్రదించింది. ఈ అంశంపై చర్చ కోసం అమెరికాలోని డెట్రాయిట్‌లో గల బ్లూ ఓవల్ వేదికపై రతన్ టాటాకు ఘోర అవమానం జరిగింది.

ఈ సమావేశంలో ఫోర్డ్ ఎగ్జిక్యూటిట్ మెంబర్స్ ఇండికా కారును తయారు చేసిన విధానాన్ని విమర్శించారు. మీకు కారుని ఎలా తయారు చేయాలో తెలియదు, మీరు ఈ కారు ఉత్పత్తి విభాగంలోకి అడుగుపెట్టడం తప్పు అని సూచించారు. ఈ వ్యాఖ్యలను ఆయన పాజిటీవ్‌గా తీసుకున్నారు. ఆ తర్వాత రతన్ ఆటో పరిశ్రమ నుంచి వైదొలగకూడదని నిర్ణయించుకున్నారు. దీనికి తగిన సమయంలో సమధానం ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నారు.
ఆ తర్వాత ఫోర్డ్ చేసిన రిమార్క్స్ తప్పని నిరూపించేందుకు టాటా బ్రాండ్ నిర్మాణంపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకుని ఆ ఒప్పందాన్ని సైతం ఆయన విరమించుకున్నారు. ఇండస్ట్రీ దీన్ని భయంకరమైన నిర్ణయంగా చూసింది. ఆ తర్వాత తొమ్మిదేళ్ల తర్వాత టాటా సన్స్ బ్రిటీష్ లగ్జరీ వాహనాల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ని ఆధీనం చేసుకుంది. ఇది ఫోర్డ్‌లో ప్రధాన వాటాదారుగా ఉండటం గమనార్హం.

1922లో స్థాపించిన జాగ్వార్ లగ్జరీ స్పోర్ట్స్ కార్లకు పెట్టింది పేరు. దీని గురించి అప్పట్లో తెలియని వారు ఎవరూ ఉండరు. లగ్జరీ ఎస్‌యూవీలకు ప్రసిద్ధి చెందిన ల్యాండ్ రోవర్‌ని 2000 సంవత్సరంలో భారత్‌లో 2.7 బిలియన్ డాలర్లకు జాగ్వార్ కార్ల డీల్‌ని చేసుకుంది. అయితే అమెరికన్ బ్రాండ్ వీటిని ఎక్కువ కాలం లాభాలతో తీసుకెళ్లలేకపోయింది. ప్రపంచ ఆర్థిక మాంద్యంతో ఫోర్డ్ యాజమాన్యంలోని జాగ్వార్ ల్యాండ్ రోవర్ నష్టాల్లోకి వెళ్లింది.
ఆ తర్వాత సరిగ్గా ఎనిమిదేళ్లకు 2008లో JLRvని టాటా సొంతం చేసుకుంది. ఇది రతన్ టాటా బిలియన్ డాలర్ల ప్రతీకారంగా అభివర్ణించారు. జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ని కేవలం 2.3 బిలియన్ డాలర్లకు ఫోర్డ్ నుంచి రతన్ టాటా కొనుగోలు చేశారు. ఈ కొనుగోలు అప్పట్లో సంచలనాలకు తెరలేపింది. ఆ తర్వాత ఫోర్డ్ అమ్మకాలపై టాటా పట్టు పెంచుకుంది.

జాగ్వార్ ల్యాండ్ రోవర్ కూడా ఫోర్డ్ నుంచి కొనుగోలు చేసిన ఏడాది తర్వాత 55 మిలియన్ పౌండ్ల (90.6 మిలియన్ డాలర్లు) నికర లాభాన్ని నమోదు చేసింది. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ JLRను మార్కెట్‌లో నిలబెట్టేందుకు టాటా చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఎవరైతే అవమానాలకు గురి చేశారో వారికే తన చాతుర్యంతో దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు రతన్ టాటా.


Click it and Unblock the Notifications








