కేవలం రూ. 3000తో 200 టోల్ ట్రిప్పులు.. ఒక్క నిమిషంలో ఫాస్టాగ్ పాస్ యాక్టివేట్ చేసుకోండి

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) ఆగస్ట్ 15న ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ (FASTag Annual Pass)ను ప్రారంభించింది. ఈ పాస్ ద్వారా ప్రైవేట్ వాహనాల యజమానులు కేవలం రూ.3,000తో 200 ట్రిప్పులు (టోల్ క్రాసింగ్) చేయవచ్చు. ఈ ఫాస్ట్‌ట్యాగ్ దేశంలోని అన్ని నేషనల్ హైవేలు, నేషనల్ ఎక్స్‌ప్రెస్‌వేలపై పని చేస్తుంది.

ఈ యాన్యువల్ పాస్ అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే ప్రతి టోల్‌కు అయ్యే ఖర్చు ఇప్పుడు రూ. 15కి తగ్గుతుంది. ఇది ఇప్పటివరకు రూ. 50 నుండి రూ. 60 ఉండేది. దీని వల్ల టోల్ ప్లాజాల వద్ద ఎక్కువ సమయం పాటు వేచి ఉండాల్సిన అవసరం కూడా ఉండదు.

How to Activate FASTag Annual Pass in Just a Few Steps

ఫాస్టాగ్ యాన్యువల్ పాస్‌ను కేవలం కార్లు, జీపులు, వ్యాన్‌ల కోసం మాత్రమే ఉపయోగించవచ్చు. బస్సులు, ట్రక్కులు లేదా ఇతర కమర్షియల్ వాహనాలకు ఇది పనిచేయదు. మొత్తం మీద, ఈ పాస్‌తో మీరు మంచి పొదుపు చేసుకోవచ్చు.

ఎందుకంటే ఈ పాస్ ఒక్కసారి యాక్టివేట్ అయిన తర్వాత మొత్తం ఒక సంవత్సరం వరకు పనిచేస్తుంది. మీరు కూడా యాన్యువల్ ఫాస్టాగ్ పాస్‌ను యాక్టివేట్ చేయాలనుకుంటే, ఇక్కడ స్టెప్-బై-స్టెప్ మొత్తం ప్రక్రియను వివరంగా తెలుసుకుందాం.

How to Activate FASTag Annual Pass in Just a Few Steps

రాజ్‌మార్గ యాత్ర యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి లేదా NHAI వెబ్‌సైట్‌కు వెళ్లండి:
యాన్యువల్ పాస్‌ను రాజ్‌మార్గ యాత్ర మొబైల్ యాప్ లేదా NHAI అధికారిక వెబ్‌సైట్ నుండి మాత్రమే యాక్టివేట్ చేయవచ్చు. యాక్టివేషన్ సమయంలో ఇంటర్నెట్ కనెక్షన్ బాగుండాలి. టెక్నికల్ సమస్యలు రాకుండా యాప్‌లో లేటెస్ట్ వెర్షన్ ఉండాలి. ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది.

లాగిన్ చేసి, అర్హతను చెక్ చేయండి
మొబైల్ నంబర్ లేదా వాహన నంబర్ (VRN) ఉపయోగించి లాగిన్ చేయండి. మీ ఫాస్ట్‌ట్యాగ్ యాక్టివ్‌గా ఉండాలి. అది వాహనంపై సరిగ్గా అంటించి ఉండాలి, చెల్లుబాటు అయ్యే VRNతో అనుసంధానించబడి ఉండాలి. బ్లాక్‌లిస్ట్‌లో ఉండకూడదు.

How to Activate FASTag Annual Pass in Just a Few Steps

ఒకవేళ ఫాస్ట్‌ట్యాగ్ కేవలం ఛాసిస్ నంబర్‌పై రిజిస్టర్ అయి ఉంటే, ముందుకు వెళ్లే ముందు దానిని VRNతో అప్‌డేట్ చేయడం ముఖ్యం. అలాగే, మీ వాహనం వ్యక్తిగత/నాన్ కమర్షియల్ వెహికల్ అని నిర్ధారించుకోండి. అప్పుడే అది యాన్యువల్ పాస్‌కు అర్హత పొందుతుంది.

వెహికల్, ఫాస్ట్‌ట్యాగ్ వివరాలను ఎంటర్ చేయండి
మీ వాహనం, ఫాస్ట్‌ట్యాగ్ ఐడి వివరాలను ఎంటర్ చేయాలి. అవసరమైతే ఆర్‌సీ, యజమాని ఐడి, చిరునామా రుజువు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోను అప్‌లోడ్ చేయండి. వివరాలు సరిగ్గా లేకపోతే ప్రక్రియ ఆలస్యం కావచ్చు లేదా రిజెక్ట్ కావొచ్చు. కాబట్టి, వాటిని సబ్మిట్ చేసే ముందు జాగ్రత్తగా చెక్ చేయండి.

పేమెంట్ చేయండి
2025-26 యాన్యువల్ పాస్ రుసుం రూ. 3,000. మీరు యూపీఐ, డెబిట్/క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపు చేయవచ్చు. వాలెట్ బ్యాలెన్స్ నుండి పేమెంట్ ఆమోదించబడదు. చెల్లింపు రసీదు/కన్ఫర్మేషన్‌ను సురక్షితంగా ఉంచుకోండి.

యాక్టివేషన్ కన్ఫర్మేషన్
పేమెంట్ వెరిఫికేషన్ తర్వాత మీ యాన్యువల్ పాస్ ప్రస్తుత ఫాస్ట్‌ట్యాగ్‌పై యాక్టివేట్ అవుతుంది. ఈ ప్రక్రియ సాధారణంగా 2 గంటల్లో పూర్తవుతుంది.. కానీ కొన్నిసార్లు 24 గంటల వరకు పట్టవచ్చు. యాక్టివేషన్ విజయవంతమైతే మీకు ఎస్సెమ్మెస్ కన్ఫర్మేషన్ వస్తుంది. టోల్ ప్లాజాలో ఉపయోగించే ముందు పాస్ యాక్టివ్‌గా ఉందో లేదో తెలుసుకోవడానికి మీరు యాప్ లేదా NHAI వెబ్‌సైట్ డాష్‌బోర్డ్‌లో దాని స్థితిని తనిఖీ చేయవచ్చు.

More from DriveSpark

Article Published On: Monday, September 1, 2025, 13:30 [IST]
English summary
How to activate fastag annual pass in just a few steps
Read more on: #offbeat #india #auto news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+