వానాకాలంలో మీ కార్లు పాడవకుండా కాపాడే టిప్స్.. వీటిలో ఒక్కటి పనిచేయకపోయినా అంతే సంగతులు..

మరికొద్ది రోజుల్లో వేసవి కాలం ముగిసి వర్షాకాలం రాబోతుంది. ఒక్కో సీజన్‌లో మనుషులే కాదు వాహనాలు కూడా వేర్వేరు వాతావరణాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగా అన్ని సీజన్లలో వాహనాల యజమానులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే తరచుగా షెడ్‌కు వెళ్లాల్సిందే. ముఖ్యంగా కార్ల యజమానులు తమ వాహనాల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

త్వరలో రుతుపవనాలు సమీపిస్తుండటంతో వేసవి కాలం ముగిసేలోపే వాహనదారులు తమ కారులో కావలసినవన్నీ సమకూర్చుకోవాలి. లేదంటే వర్షాకాలంలో ఎదురయ్యే సమస్యల పట్ల అప్రమత్తంగా లేకపోతే కార్ల మరమ్మతులకు వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో కార్ల యజమానులు సమ్మర్‌ ముగిసేలోపే ఈ సాధారణ చిట్కాలను పాటిస్తే వర్షాకాలంలో తమ కార్లను సురక్షితంగా ఉంచుకోవచ్చు.

Car Care Tips in Monsoon

వైపర్లు తనిఖీ చేసుకోవాలి : మొదటగా కారులో విండ్‌షీల్డ్ వైపర్ బ్లేడ్‌లను మార్చడం ఉత్తమమైన పని. వేసవిలో వైపర్ల వాడకం ఉండదు.. అంతే కాకుండా వేసవి తాపం రబ్బరును చాలా దెబ్బతీస్తుంది. వర్షాకాలం వస్తున్నందున మీ కారు వైపర్లు సరిగా పనిచేస్తున్నాయో లేదో తనిఖీ చేసుకోవాలి. అవసరమైతే కొత్త వైపర్లను మార్చాలి.

బ్రేక్‌లు : వేసవి కాలంలో ట్రిప్‌లు, టూర్లు అనీ మనం కార్లను ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. దీనివల్ల ప్రధానంగా బ్రేక్‌లు అరిగిపోతాయి. కాబట్టి ఈ సమయంలో బ్రేక్ లైనింగ్‌లు, డ్రమ్ రోటర్లు మరియు బ్రేక్ ప్యాడ్‌లను తనిఖీ చేసుకోవాలి. ప్రతి ఏటా బ్రేక్‌ సిస్టమ్‌ను సరిచూడాలి. వర్షాకాలంలో బ్రేక్‌లను సున్నితంగా వాడాల్సి ఉంటుంది. కాబట్టి ఒకసారి సరిచూసుకుని అరిగిపోతే వాటిని కొత్త వాటితో భర్తీ చేసుకోవాలి.

Car Care Tips in Monsoon

టైర్లను చెక్ చేసుకోవాలి : వేసవిలో ట్రిప్పుల తర్వాత, టైర్ల పరిస్థితిని ఒకసారి తనిఖీ చేసుకోవాలి. ఎందుకంటే వర్షాకాలంలో వర్షపు నీరు ఉన్న రోడ్లపై కారు నిర్వహణ మారుతుంది. కాబట్టి టైర్లు అరిగిపోయినట్లయితే, వెంటనే వాటిని మార్చండి. కారు ముందు టైర్లను వెనుకకు, వెనుక టైర్లను ముందుకు లేదా కుడి, ఎడమ టైర్లను ఒకదాని స్థానంలో ఒకటి మార్చుకోవడం ఉత్తమం.

ఫ్యూయెల్‌, బ్యాటరీ చెకప్ : మీ కారు బ్యాటరీని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. బ్యాటరీ చుట్టూ ఏదైనా దుమ్ము, లేదా తుప్పు ఉందా మరియు బ్యాటరీకి కనెక్ట్‌ చేసిన వైర్లు గట్టిగా ఉన్నాయా అని ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకోవాలి. అదే విధంగా ఇంజిన్ ఆయిల్‌ చెక్‌ చేసుకోవాలి.

Car Care Tips in Monsoon

హెడ్‌లైట్ తనిఖీ : వేసవి కాలంలో రాత్రి ప్రయాణానికి పెద్దగా ఇబ్బంది ఉండదు. కాబట్టి హెడ్‌లైట్‌లపై దృష్టి పెట్టము. కానీ మిగతా సీజన్లలో పొగమంచు మరియు వర్షం కారణంగా రోడ్లు సరిగా కనిపించవు. కాబట్టి మీ కారులోని అన్ని లైట్లు పని చేస్తున్నాయో లేదో సరిచూసుకోవాలి. హెడ్‌లైట్లు, ఫాగ్ ల్యాంప్స్, టర్న్ ఇండికేటర్‌లు, టెయిల్‌లైట్‌లను తనిఖీ చేయండి.

టాప్ అప్ ఫ్లూయిడ్స్, ఏసీ: వేసవి ముగుస్తుండటంతో మీ కారు ద్రవ స్థాయిని తనిఖీ చేయాలి. ఇంజిన్ కూలెంట్, పవర్ స్టీరింగ్ ఆయిల్, బ్రేక్ ఆయిల్, గేర్‌ ఫ్ల్యూయిడ్‌, విండ్‌ షీల్డ్‌ డిటర్జెంట్‌, ట్రాన్స్‌మిషన్ ఆయిల్‌లను ఒకసారి మెకానిక్‌తో చెక్ చేయించుకోవాలి. ఇంజిన్‌ ఆయిల్‌ను కాలానుగుణంగా మార్చాలి. అదేవిధంగా ఏసీని కూడా చెక్‌ చేసుకోవడం ఉత్తమం.

Car Care Tips in Monsoon

ఎగ్జాస్ట్‌ను చెక్ చేయండి : మీ కారు రెగ్యులర్ చెకప్‌లో భాగంగా కారు ఎగ్జాస్ట్‌ను కూడా తనిఖీ చేయాలి. ఎందుకంటే దాని పొగ.. వాహనం పరిస్థితి గురించి చెబుతుంది. ఎగ్జాస్ట్ సిస్టమ్‌ను మెకానిక్ ద్వారా తనిఖీ చేయడం ఉత్తమం. ఎగ్జాస్ట్ లీక్‌లు చాలా ప్రమాదకరమైనవి కాబట్టి ఇది చాలా ముఖ్యమైన చిట్కా. కాబట్టి ఈ చిట్కాలను జాగ్రత్తగా అనుసరిస్తూ.. వర్షాకాలంలో జర్నీని ఎంజాయ్‌ చేయండి.

More from DriveSpark

Article Published On: Wednesday, June 7, 2023, 11:40 [IST]
English summary
How to care your car at the end of summer before monsoon in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+